Home » గ్వాలియర్‌లో గాడ్సే లైబ్రరీ.. నాథురామ్ నిజమైన జాతీయవాది!
Published
1 week agoon
Hindu Mahasabha opens Godse library : విశ్వ హిందీ దివాస్ సందర్భంగా.. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో మహాత్మాగాంధీ హంతకుడు నాథురామ్ గాడ్సే గుర్తుగా గాడ్సే లైబ్రరీని అఖిల్ భారతీయ హిందూ మహాసభ ప్రారంభించింది. గాడ్సే జీవితం భావజాలానికి అంకితమైన గ్వాలియర్‌లో ఈ గాడ్సే లైబ్రరీని ప్రారంభించింది. దౌలత్ గంజ్‌లోని మహాసభ కార్యాలయంలో గాడ్సే లైబ్రరీని తెరిచింది. మహాత్మా గాంధీ హత్యకు గాడ్సేను ప్రేరేపించిన అంశాలు, వ్యాసాలు, ఆయన ప్రసంగాలకు సంబంధించి సాహిత్యమంతా లైబ్రరీ పుస్తకాల్లో ఉంది.
గాడ్సే నిజమైన జాతీయవాదిగా ప్రపంచం ముందు ఉంచేందుకు ఈ లైబ్రరీని ప్రారంభించినట్టు మహాసభ ఉపాధ్యక్షుడు జైవీర్ భరద్వాజ్ పేర్కొన్నారు. భారతదేశ విభజనకు అప్పట్లో గాడ్సే వ్యతిరేకించి నిలబడ్డాడు. యువతలో గాడ్సే నిజమైన జాతీయతను ప్రేరేపించడం లైబ్రరీ ఉద్దేశ్యమని ఆయన తెలిపారు. దేశాన్ని పాలించాలనే ఉద్దేశంతో జవహర్లాల్ నెహ్రూ, మహ్మద్ అలీ జిన్నా ఆశయాలను నెరవేర్చడానికి భారత్ విభజన జరిగిందని భరద్వాజ్ అన్నారు.
అయితే దీన్ని అప్పట్లో గాడ్సే తీవ్రంగా వ్యతిరేకించారు కూడా. గాంధీని హత్యచేసిన గ్యాలియర్ ప్రాంతాన్నే గాడ్సే లైబ్రరీ ఏర్పాటుకు ఎంపిక చేసినట్టు తెలిపారు. ఈ గాడ్సే లైబ్రరీని గాడ్సేకు అంకితం చేసినట్టు తెలిపారు. గతంలో గాడ్సేకు అంకితం చేసిన ఆలయాన్ని మహాసభ వారి గ్వాలియర్ ఆఫీసులో ఏర్పాటు చేశారు. అయితే అప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకంచడంతో దాన్ని తొలగించారు. భారత విభజన మహాత్మా గాంధీ చేసిన పొరపాటుగా ప్రోటీమ్ స్పీకర్ రామేశ్వర్ శర్మ పేర్కొన్నారు.