HMWSSB Recruitment 2020 Apply Online for 93 TSPSC Manager Posts

చెక్ ఇట్ : హైదరాబాద్ వాటర్ బోర్డులో మేనేజర్ ఉద్యోగాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (HMWSSB) లో మేనేజర్ ఉద్యోగాల భర్తీకి తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో మెుత్తం 93 ఖాళీలు ఉన్నాయి. దరఖాస్తు ప్రక్రియ మార్చి 16 నుంచి ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్దులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం TSPSC అధికారిక వెబ్ సైట్ లో చూడవచ్చు. 

అభ్యర్దులు దరఖాస్తు చేసుకోవటానికి ముందుగా TSPSC అధికారిక వెబ్ సైట్ లో వన్ టైమ్ రిజిస్ట్రేషన్(OTR) అవ్వాలి. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయ్యిన అభ్యర్దులు వారి TSPSC ఐడీ నెంబర్, పుట్టిన తేదీని ఎంట్రర్ చేసి దరఖాస్తు చేసుకోవాలి. 

విభాగాల వారీగా ఖాళీలు :
సివిల్ ఇంజనీరింగ్ – 79
మెకానికల్ ఇంజనీరింగ్ – 6
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ – 4
ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ – 3
కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంజనీరింగ్ – 1

అర్హతలు : అభ్యర్దులు సంబంధిత విభాగాల్లో బీటెక్, బీఈ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు : అభ్యర్దులు వయసు జూలై 1, 2020 నాటికి 18 నుంచి 34 సంవత్సరాల మధ్య ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వడ్ అభ్యర్దులకు వయసులో సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు ఫీజు : అభ్యర్దులు రూ.320 చెల్లించాలి. బీసీ, SC,ST,  దివ్యాంగులు, ఎక్స్ – సర్వీస్ మెన్ ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.

ఎంపికా విధానం : అభ్యర్దులను రాత పరీక్ష, స్కిల్ టెస్టు, డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వూ ద్వారా ఎంపిక చేస్తారు. 

ముఖ్య తేదీలు :
దరఖాస్తు ప్రారంభ తేదీ : మార్చి 16, 2020.
దరఖాస్తు చివరి తేదీ : మార్చి 30, 2020. 

Related Posts