కొవిడ్ వ్యాక్సిన్ రెడీ కోసం తనపైనే ప్రయోగించుకున్న సైంటిస్టు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జోసియా జేనర్ ప్లాన్ చాలా సింపుల్. Covid Vaccine ప్రయోగం కోతులపైన సక్సెస్ అయింది. లైవ్‌లో అతనిపైనే ప్రయోగం చేసుకుని కొన్ని నెలల నుంచి ఆరోగ్యంగానే ఉన్నాడు. వ్యాక్సిన్లు డెవలప్ చేయడానికి ఇంకా సంవత్సరాలు పడుతుందనే దిశగా హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ను వేలమందిపై నిర్వహిస్తున్నారు.

అమెరికన్ సైంటిస్టులు ఈ ప్రయోగాన్ని మరింత వేగవంతం చేశారు. నాసా రీసెర్చర్ జేనర్ మాత్రం అతనిపైనే ప్రయోగం చేసుకున్నారు. చాలా వెంటనే దాంతో పాటు అత్యంత చౌకగా ప్రయోగాన్ని అతనిపైనే చేసుకుంటున్నాడు. అందులో జేనర్ ఊహించుకున్న దానికంటే ఇంకా బెటర్ గానే ఫలితాలు వస్తున్నాయి.


ఈ ప్రయోగంలో జేనర్‌కు సమాధానం దొరకని ప్రశ్నలు చాలా కనిపించాయి. కాకపోతే ప్రయోగానికి ముందు.. తర్వాత అతని శరీరంలో యాంటీబాడీలు ఎన్ని ఉన్నాయనే దానిని లెక్కించకుండా వదిలేశారు. ఈ సందర్భంగా బయో హ్యాకర్లు ఎంతవరకూ ప్రయోగాలు చేయగలరో నిరూపించుకోవడానికి సరైన సమయం అని జేనర్ చెప్తున్నారు.

మానవులు వారి బయోలజీ అనే చాలా కాంప్లెక్సింగ్ గా ఉంటుందని రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఫలితాలనేవి చాలా గందరగోళంగా ఉన్నాయి. ప్రయోగాల్లోనూ అంతే గందరగోళం. అయితే ఇవి ఒక 30వేల మంది వరకూ ప్రయోగం చేస్తే అప్పుడు ఓ క్లారిటీకి రాగలం అని చెప్పారు.



అమెరికా మార్కెట్లోకి వ్యాక్సిన్ త్వరగా రావాలని అనుకుంటే.. టెస్టులు కూడా అంతే వేగంగా జరగాలని జేనర్ అంటున్నారు. జాతీయవ్యాప్తంగా ఇది కచ్చితంగా చేయాల్సిన పని. సేఫ్ డెవలప్ మెంట్, ఎఫెక్టివ్ మెడిసిన తయారుచేసి ప్రెసిడెన్షియల్ ఎన్నికకు ముందుకల్లా సిద్ధం చేయాలని చూస్తున్నారు. నవంబర్ 3ముందు నాటికి వ్యాక్సిన్ తీసుకొస్తానని ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అంటున్నారు. సైంటిస్టులు మాత్రం సంవత్సరం చివరి నాటికి లేదా జనవరిలో వ్యాక్సిన్ వస్తుందని చెప్పారు.

శాన్ ఫ్రాన్సిస్కో బయోటెక్ కాన్ఫిరెన్స్ లో అతణ్ని ఓ గినియా జంతువులా భావించుకుని ఇంజెక్షన్ చేసుకుంటున్నట్లు జేనర్ చెప్పారు. టెక్నాలజీ అడ్వాన్స్ మెంట్ కోసం సైంటిస్టులు ముందుగా తమకు తాము పరీక్షించుకోవాలని ఆయనే చెప్తున్నారు. సైన్స్ అనేది అందరికీ అందుబాటులో ఉండాలని జేనర్ నమ్మకం.



జేనర్ ఆరంభంలో చేసిన ప్రయోగానికి Project McAfee అనే పేరు పెట్టారు. దానికంటే ముందు యాంటీవైరల్ సాఫ్ట్ వేర్ కూడా రెడీ అయింది. ఇది ఇమ్యూనిటీ ప్రొటెక్షన్ వ్యాక్సిన్. మకా కోతుల్లో ఉండే రెసెస్ వైరస్ నుంచి తట్టుకోగలడానికి ఇది హెల్ప్ అవుతుంది. డీఎన్ఏ సింథసిస్ ప్రకారం.. స్పైక్ ప్రొటీన్ సీక్వెన్స్ ఫార్ములాతో దీనిని రెడీ చేశారు. అతనితో పాటు మరో ఇద్దరు బయో హ్యాకర్లు అయిన డారియా దాంత్‌సేవ, డేవిడ్ ఇషీలు సెల్ఫ్ ఎక్స్‌పరిమెంట్ చేసుకుని ఆన్ లైన్లో ప్రయోగం గురించి అప్ డేట్ ఇస్తూ వారి కండీషన్ ను పంచుకుంటున్నారు.

ఈ డేటాపై చాలా అనుమానాలు ఉన్నాయని జేనర్ అంటున్నారు. అతను ఒంటరివాడు కాదని హ్యాంక్ గ్రీలీ అనే స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీకి చెందిన బయోఎథిసిస్ట్ అన్నారు. వ్యాక్సిన్ డెవలప్‌మెంట్ లో భాగంగా జేనర్స్ ప్రయోగానికి ఆశించనంతమేర ప్రశంసలు దక్కలేదు. నిజానికి వ్యాక్సిన్ తయారుచేయడం అంత కష్టమేమీ కాదు. టెస్టింగ్ చేయడానికి.. అది సేఫ్ గానో ఉందో లేదో ఎంత ప్రభావవంతంగా ఉందో తెలుసుకోవడమే అసలు సమస్య అని చెప్పారు.



జేనర్ ప్రయోగం ప్రకారం.. వ్యాక్సిన్ టెస్టింగ్ అనేది మనుషులపై ప్రయోగాత్మకంగానే ఆగిపోయింది. ఇప్పటికీ అతను చేసిన దానిపై నమ్మకంగానే ఉన్నారు. ప్రత్యేకించి జబ్బుతో ఉన్నప్పుడు, ట్రీట్‌మెంట్ అప్రూవ్ అవకపోవడమే ఇబ్బంది అని నమ్ముతున్నారు. కానీ, ఇప్పుడు ఆయనపైనే ప్రయోగం చేసుకుని వ్యాక్సిన్ రెడీ చేయాలనుకుంటున్నారు.

‘ఇది చాలా గందరగోళంగా ఉందని చాలా పెద్ద మొత్తంలో క్లినికల్ ట్రయల్స్ చేయాల్సి ఉంది’ అని జేనర్ అంటున్నారు.

Related Tags :

Related Posts :