30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీపై అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయ రగడ జరుగుతోంది. ఈనేల 8వ తేదీన జరగాల్సిన కార్యక్రమం కోర్టు కేసులతో వాయిదా పడింది. ప్రభుత్వాలు పేదలకు పంపిణీ చేసిన డీ ఫారమ్ పట్టా భూములను ఇళ్ల స్థలాల కోసం సేకరించడాన్ని హైకోర్టు తప్పుబట్టింది. హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో అప్పీల్ కు వెళ్లింది. కరోనా నేపథ్యంలో కేసు సుప్రీంకోర్టులో ఇంకా పరిష్కారం కాలేదు. ఆగస్టు 15 వ తేదీ లోగా కేసు పరిష్కారం అవుతుందన్న ఆశాభావంతో ఉన్న ప్రభుత్వం ఆరోజు పట్టాలు పంపిణీ చేయాలని భావించింది. మరోవైపు ఇళ్ల పట్టాల భూసేకరణలో భారీ అవినీతి జరిగిదని చెప్పి టీడీపీ ఆరోపించింది. ఇదే అంశంపై నిర్వహించిన 10 టివి నిర్వహించిన చర్చా కార్యక్రమంలో వైసీపీ ఎంపీ భరత్ మాట్లాడారు. 30 లక్షల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నట్లు తెలిపారు.

30 లక్షల కుటుంబాలకు వారి స్వంత ఇంటి కల నెరవేరబోతుంటే టీడీపీ బినామీ పార్టీలను పెట్టుకుని పిల్స్ వేయించుకుని ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు నాయుడు పేదలకు తీరని ద్రోహం చేస్తున్నారని.. దీన్ని రాష్ట్ర ప్రజలందరూ గమనించాలన్నారు. ఇప్పటివరకు దేశంలో ఏ ప్రభుత్వం కూడా ఇవ్వలేని విధంగా ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడుతుందన్నారు. సుమారు 20 వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూమలు పేద ప్రజలకు అందిస్తుందన్నారు. ఒక కుటుంబంలో నలుగురుంటే కోటి ఇరవై లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్పారు. రాష్ట్ర జనాభా ఐదు, ఐదున్నర కోట్లు ఉంటే అందులో కోటి ఇరవై లక్షల మందికి లబ్ధి చేకూర్చుతుంటే టీడీపీ నేతలు ఏ రకంగా అడ్డుకుంటారని ప్రశ్నించారు. ఇది నిజంగా హేయమైన చర్య అన్నారు.

ప్రభుత్వాన్ని ముందుకు వెళ్తుందో చంద్రబాబు స్వాగతించాలన్నారు. మీకు కూడా ప్రతిపక్షంగా సమానమైన గౌరవం ఉంటుందన్నారు. అంతేకానీ ఏదో రంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే రాష్ట్ర ప్రజలెవ్వరూ ఒప్పుకునే పరిస్థితులు లేవన్నారు. కచ్చితంగా సుప్రీంకోర్టులో తమ తరపున వాదనలు వినిపిస్తామన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రజలకు మేలు చేసే కార్యక్రమం చేస్తున్నామన్నారు. కచ్చితంగా దేవుడు తమ పక్షాన ఉన్నాడని, రాబోయే రోజుల్లో మంచి తీర్పు వస్తుందని తాము ఆశాభావం వ్యక్తం చేస్తున్నామని చెప్పారు. టీడీపీ నేతలు ఏదో రకంగా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని..ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకునే పరిస్థితి ఉండదన్నారు.

ఏదోరకంగా ప్రభుత్వం ముందుకు వెళ్తుంటే.. తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు, తెలుగుదేశం పార్టీ వెనుక నుంచి వేయించే పిల్స్ తప్ప మరోటి కాదన్నారు.
కోవిడ్ కారణంగా సుప్రీంకోర్టులో కేసు బెంచ్ మీదకు రాలేదు కాబట్టి ఆగస్టు 15 లోపల కూడా అధికారులను ఆదేశించామని చెప్పారు. అదేవిధంగా అడ్వకేట్ జనరల్ కు కూడా చెప్పామని తెలిపారు. ఆగస్టు 15 కల్లా దీన్ని క్లియర్ చేసుకుని రాష్ట్ర ప్రజలందరికీ ఇళ్లు ఇచ్చే కార్యక్రమం చేపడుతున్నామని చెప్పారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మక కార్యక్రమం చేపడుతుంటే తెలుగుదేశం అడ్డుకుంటుందన్నారు. 30 లక్షల ఇళ్లను ఏ రకంగా అడ్డుకుంటుందో రాష్ట్ర ప్రజలు ఆలోచించాలన్నారు.

READ  3 రాజధానుల రగడ : జగన్ మైండ్ గేమ్.. ఇరకాటంలో పవన్ కళ్యాణ్

గత ప్రభుత్వం ఐదు సంవత్సరాలు ప్రభుత్వంలో ఉండి 4300 కోట్లు టిట్కో హౌసెస్ కు ఇంకా బిల్స్ పేమెంట్ చేయాల్సిన అవసరముదన్నారు. ఆ బిల్స్ పేమెంట్ చేయకుండా సాలరీ కూడా ఇచ్చుకోని పక్షాన వారు ఖజానాను తమకు అప్పజెప్పారని విమర్శించారు. వంద కోట్ల రూపాయలు కూడా లేకుండా ఖజానాను తమకు అప్పగిస్తే సాలరీలను ఏరకంగా ఇచ్చుకుని ముందుకెళ్లాలని ప్రశ్నించారు. టిట్కో హౌసింగ్, రూరల్ హౌసింగ్, అర్బన్ హౌసింగ్ కు సంబంధించి సుమారు 4300 కోట్లు బకాయిలున్నాయన్నారు. 13 లక్షల ఇళ్లు కట్టించామని చంద్రబాబు ప్రగల్బాలు చెబుతున్నారని..పూర్తి అయిన ఇళ్లళ్లో అర్బన్, రూరల్ కలుపుకుంటే 4 లక్షల ఇళ్లు లేవన్నారు. ఇప్పుడు తాము 30 లక్షల ఇళ్ల స్థలాను ఇస్తున్నామంటే ఇది సామాన్య విషయం కాదన్నారు. ముఖ్యమంత్రి చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఇళ్లను ఇచ్చే కార్యక్రమం చేపట్టారని తెలిపారు.

టిట్కో ఇళ్లు, ఇందిరమ్మ ఇళ్లళ్లో చూసినట్లైతే పది, ఇవరై సంవత్సరాల వెనక్కి వెళితే… ప్రస్తుతం ఉన్న రోజున కాలనీలు అన్ని కూడా స్లమ్స్ కింద తయారయ్యాయని చెప్పారు. వీటన్నింటిలో మార్పు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి ఆలోచన చేసి ప్రతి ఒక్కరికి సెంటున్నర భూమి ఇచ్చే కార్యక్రమం చేపట్టారని తెలిపారు. అంటే సుమారు సెంటున్నర అంటే 75 గజాలు ఇళ్లు వస్తాయని చెప్పారు. ఆ 75 గజాల్లో రాష్ట్రంలో ఎక్కడైనా కూడా ఇళ్లు తీసుకుంటే గజం 5 వేల రూపాయలు లోపల ఎక్కడా కూడా ఉండదన్నారు.
సుమారు 3 లక్షల నుంచి 4 లక్షలు విలువ చేసే భూమిని ప్రతి పేద వారికి అందిస్తున్నామని తెలిపారు.

ఐదు సంవత్సరాల తర్వాత కనీసం ఆ ల్యాండ్ విలువ డబుల్ అవుతుందని, అంటే 8 లక్షల నుంచి 10 లక్షల విలువ అవుతుందన్నారు. పది లక్షల రూపాయల ఆస్తి తనకు ఉందని పేదవాడు ధైర్యంగా ఉంటాడని చెప్పారు. దీన్ని ప్రతిపక్షం ఆలోచన చేయాలన్నారు. జన్మభూమి కమిటీలు ఒక్కొక్క ఇల్లుకు రూ.50 వేల నుంచి లక్ష వరకు తీసుకుని ఇచ్చారని ఆరోపించారు. రాష్ట్ర ప్రజల్లో ఎవరిని అడిగినా చెబుతారన్నారు.

Related Posts