hoomans create double decker bus slide for dog with arthritis to climb down stairs cute video

పెంపుడు కుక్కకు కీళ్లనొప్పులు: మెట్లు ఎక్కి దిగటానికి..యజమాని ఏం చేశాడో చూస్తే షాక్ అవ్వాల్సిందే..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మ‌నుషుల కంటే కుక్క‌ బతుకులే ఎంతో బాగా ఉన్నాయి అనిపిస్తుంది ఓ యజమాని పెంచుకునే పెంపుడు కుక్కనుచూస్తే. కుక్కలు ఒక‌సారి య‌జ‌మానిని న‌మ్మాయంటే వాటి ప్రాణాలనైనా ఇచ్చేస్తాయి. యజమాని కోసం ఎంతో న‌మ్మ‌కంగా ఉంటుంది. అటువంటి పెట్‌కు ఆరోగ్యం బాగోలేక‌పోతే య‌జ‌మాని చేసిన పని చూస్తే..ఆహా..మనిషిలా పుట్టడం కంటే ఇటువంటి యజమానులకు కుక్కలుగా పుట్టటమే సో బెటర్ అనిపిస్తుంది. అనారోగ్యం వచ్చిన తన పెంపుడుకుక్క కోసం ఓ యజమాని ఏకంగా డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ స్లైడ్ ను క్రియేట్ చేశాడు. ఏంటీ ఈ డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ అనుకుంటున్నారా!ఇంకెందుకు లేట్ చూసేద్దాం..

ఓ యజమని పెంచుకునే  పెంపుడు కుక్క కీళ్ల నొప్పుల‌తో ఇబ్బందులు పడుతోంది. ఇంట్లోని మెట్లు కూడా ఎక్క‌లేక తెగ ఇబ్బంది పడుతోంది. పశువుల డాక్టర్ కు చూపెట్టారు. ఎంత ఖర్చు అయినా ఫరవాలేదు…ట్రీట్ మెంట్ చేయండి అంటూ వేడుకున్నాడు. కానీ ఫలితం లేకపోయింది. 

కానీ కీళ్లనొప్పులతో సతమతమయ్యే తన కుక్క ప‌రిస్థితికి యజమాని ఏదన్నా చేయాలనుకున్నాడు. ఇంట్లో లిప్ట్ పెట్టించ‌డానికి వీలు లేదు. దీంతో ఆ యజమానికి ఓ ఐడియా వచ్చింది. మెట్లు ఎక్క‌డానికి దిగ‌డానికి ఈజీగా ఉండేలా  ఓ ‘‘డ‌బుల్ డెక్క‌ర్ బ‌స్ స్టైడ్‌’’ను తయారుచేయించాడు. 

ఇది జారుడు బండ ఆట‌లా ఉండ‌డంతో ఆ కుక్కు భలే భ‌లే న‌చ్చేసింది. ఎంతో హుషారుగా పైకి కింద‌కి తెగ దిగుతూ..ఫుల్ హ్యాపీగా తిరిగేస్తోంది. నొప్పులతో నడవటానికే ఇబ్బంది పడే తమ కుక్క హ్యాపీగా ఉండటంతో  ఇంట్లో వాళ్లంతా కూడా ఆనందంగా ఉంటారు. ఈ వీడియోను అమెరిక‌న్  బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మన్ షేర్ చేశారు. పెట్స్‌ను ప్రేమిస్తారు కాని మ‌రీ ఇంత‌లా అనుకోలేదు అంటూ నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని చూస్తే మనం కూడా అనుకుంటాం. మనిషిలా కంటే కుక్కలా పుట్టటం సోబెటర్అని.

Read:  7వ తరగతి విద్యార్థి పేపర్ ట్రైన్ పై రైల్వే శాఖ ప్రశంసలు

Related Posts