చీరకట్టుతో చిన్నది ‘హూప్ డ్యాన్స్‌’ అద్దరగొట్టేసిందిగా..!!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సాహసాలు చేయాలన్నా..విన్యాసాలు చేయాలన్నా చీరకట్టు చాలా అడ్డమొస్తుంది బాబూ..కంఫర్ట్ గా ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ చీర కట్టుకుని ప్లారా గ్లైడింగ్ చేసిన మహిళలు ఉన్నారు. ఇష్టముంటే ఏదీ కష్టం కాదని..చీరకట్టుతో అందమే కాదు విన్యాసాలు కూడా చేయవచ్చని నిరూపించిది ఈ చిన్నది.


ఇటీవల ఓ అమ్మాయి చీరకట్టుతో జిమ్నాస్టిక్ విన్యాసాలు చేసి అదరగొట్టింది. మరో అమ్మాయి కూడా చీరలో నడుముకు రింగ్ వేసుకుని చేసే ‘‘హూప్ డ్యాన్స్‌’’ చేసింది. చీరలో రింగ్ కంటే వయ్యారంగా తిరిగిన ఈ అమ్మడి టాలెంట్ చూసి ప్రేక్షకులు నోళ్లు వెళ్ల బెడుతున్నారు. బాబ్డ్ హెయిర్ స్టైల్ తో చీరకట్టుతో వయ్యారంగా తిరగుతూ హూప్ డ్యాన్స్ చూస్తే కళ్లప్పగించాల్సిందే..


ఆమె పేరు ఈషా కుట్టీ. హూప్ డ్యాన్స్‌లో నడుము తిరిగిన కుట్టి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘జెండా పూల్’ పాటకు ఆమె లయ తప్పకుండా డ్యాన్స్ ఇరగదీసింది. ఆమె తల్లి చిత్రానారాయణ్ ఈ వీడియో తీసి పోస్ట్ చేయగా లక్షల మంది చూశారు. #SareeFlow అని హ్యాష్ టాగులు పెట్టి అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Related Posts