Hopeful Flights To Bring Americans From India Will Start In 3 Days: US

ఇండియాలోని అమెరికన్లను తీసుకెళ్లడానికి 3రోజుల్లో స్పెషల్ విమానాలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భారత్‌లో ఉన్న 2వేల మంది అమెరికన్లను తిరిగి తీసుకెళ్లేందుకు అమెరికా ప్రభుత్వం మూడు రోజుల్లో విమానాలను సిద్ధం చేయనుంది. లాక్ డౌన్ కారణంగా కొద్ది రోజులుగా విమాన సర్వీసులు రద్దు కావడంతో ఇండియాలో చిక్కుకుపోయారు అమెరికన్లు. కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని జనతా కర్ఫ్యూ తర్వాత మరో మూడు వారాలు లాక్ డౌన్ ను పొడిగించింది. ప్రపంచ వ్యాప్తంగా 26వేల మంది కరోనా బాధితులు ఉన్నారు. కాన్యులర్ ఎఫైర్స్ బ్యూరో డిప్యూటీ అసిస్టెంట్ సెక్రటరీ అయాన్ బ్రౌన్లీ కొవిడ్ 19పై స్పందించారు. న్యూ ఢిల్లీలో ఉణ్న 1500మంది అమెరికన్లు, ముంబైలో ఉన్న 700మంది, మిగిలిన ప్రాంతాల్లో ఉన్న 400మందిని గుర్తించి తీసుకెళ్లే ఏర్పాట్లు చేస్తున్నారు.

‘అక్కడికి వెళ్లేందుకు చాలా ఆప్షన్లు పరిగణనలోకి తీసుకున్నాం. ఓ చర్చి గ్రూప్ ను సంప్రదించి పెద్ద ఎయిర్‌క్రాఫ్ట్  తీసుకోవాలనుకుంటున్నాం. అత్యవసర అనుమతుల కోసం అప్లై చేశాం. 150లేదా అంతకంటే ఎక్కువమందిని తీసుకెళ్లడానికి అనుమతులు ఉన్నాయి. అమెరికా, విదేశీ శాఖలందరి నుంచి ఒకేసారి పర్మిషన్ కోసం చూస్తున్నాం. ఇండియా, అమెరికా ప్రభుత్వాలు స్పందించాలని కోరుకుంటున్నాం. ఇది చాలా క్లిష్టమైనదని తెలిసే ప్రరయత్నిం చేస్తున్నాం. ఈ సర్వీసును పొడిగిస్తూ ఉన్న అమెరికన్లందరినీ తీసుకెళ్లడమే టార్గెట్ గా పెట్టుకున్నారు. దీనికి 3రోజుల వరకూ పట్టొచ్చని అంచనా’ అని అన్నారు. 

అమెరికాకు సంబంధించిన 33వేల మంది విదేశాల్లో చిక్కుకుపోయారు. లాక్ డౌన్ కారణంగా రాలేకపోతున్న వారిని తిరిగి తీసుకురావాలని ప్లాన్ చేస్తుంది అమెరికా గవర్నమెంట్. కొందరు అమెరికన్లు కర్ఫ్యూ నుంచి లేదా క్వారంటైన్ కు దూరంగా ఉండాలని ప్లాన్ చేస్తున్నారు. ఇదే క్రమంలో వారు ఇళ్లు, దేశం నుంచి దూరంగా కరోనా ప్రభావం తక్కువగా ఉన్న దేశాలకు పారిపోతున్నారు. భారత్ కు వెళ్లిన అమెరికన్లలో ఓ చిన్నారిని దత్తత తీసుకున్న మైకేల్, వైట్నీ సావిల్లే ఉన్నారు. వీళ్లు అమెరికా రాష్ట్రమైన జార్జియా నుంచి ఇండియాకు వచ్చారు. 

వాళ్లు మార్చిలో ఇండియాకు వచ్చి గ్రేస్ హోమ్ లో చిన్నారిని దత్తత తీసుకున్నారు. గురువారం ప్రక్రియ పూర్తి చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. దత్తత పూర్తి అయిన తర్వాత ఇంటికి చేరుకోవడానికి 48గంటల సమయం మాత్రమే ఉంది. మిగిలిన పిల్లలతో కలిసి ఇంటికి వెళ్లడానికి చేసే ప్రయత్నంలో భాగంగా అందరి టిక్కెట్లు బుక్ అయ్యాయి. చివరి నిమిషంలో లాక్ డౌన్ ప్రకటించడంతో విమానాలు రద్దు అయ్యాయి. 

Also Read | కరోనా అంటే భయం వద్దు..ఇలా చేయండి చాలు

Related Tags :

Related Posts :