Horrific Torturing And Burning Daughter In Vishaka | 10TV

ఛీ..ఛీ కన్నతల్లేనా : ఏకాంతానికి అడ్డొస్తుందని

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

విశాఖజిల్లా : మాతృమూర్తి గురించి వర్ణించాలంటే..ఒక్క పదంలో సరిపోదు. నవమాసాలు మోసి కనిపెంచి పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన ఆ తల్లి…దారుణానికి తెగబడింది. తన ఏకాంతానికి అడ్డుగా వస్తుందనే కారణంతో కన్నకూతురినే చిత్ర హింసలకు గురి చేసింది. ఛీ..అనుకొనేలా జరిగిన ఈ ఘటన విశాఖపట్టణంలో చోటు చేసుకుంది. భర్త చనిపోవడంతో మరో పెళ్లి చేసుకుంది. అప్పటికే ఆమెకు కూతురు ఉంది. ఈమె మైనర్. పెళ్లి చేసుకున్నప్పటి నుండి కూతురు అడ్డుగా ఉంటోందని భావించిన ఆ కసాయి తల్లి హింసించడం మొదలు పెట్టింది. బాలికకు వాతలు పెట్టడం..ఇలా దారుణాలకు పాల్పడింది. తల్లి పెట్టే హింసకు భరించలేక ఆ బాలిక తల్లడిల్లిపోయేది. చివరకు బాలిక బాధను స్థానికులు గమనించారు. వెంటనే ఛైల్డ్ హుడ్ వారికి సమాచారం అందించారు. అక్కడకు పోలీసులతో చేరుకున్న ఛైల్డ్ హుడ్ వారు బాలికను స్వాధీనం చేసుకున్నారు. కర్కశంగా వ్యవహరించిన తల్లి…సహజీవనం సాగిస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

Related Posts