తాళి కట్టేముందు వరుడికి షాకిచ్చిన వధువు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hours before wedding, bride elopes with boyfriend : కళ్యాణ మండపంలో అంతా హడావిడిగా ఉంది. మండపంలో పురోహితులు వేద మంత్రాలు చదువుతున్నారు. వరుడితో వివాహ తంతు నిర్వహిస్తున్నారు. మరి కొద్ది సేపట్లో వధువు మెడలో తాళి కట్టే సమయం ఆసన్నమవబోతోంది. ఇంతలో పోలీసులు వెంటపెట్టుకుని ప్రియుడు రంగ ప్రవేశం చేశాడు.

పెళ్లి ఆగిపోయింది. పీటలమీద నుంచి పెళ్లి కూతురు లేచి ప్రియుడి చెంతకు చేరింది. ఇదంతా సినిమా టిక్ గా…. తెలుగు సినిమాల్లో క్లైమాక్స్ సీన్ లా ఉంది కదా…. కానీ నిజం. తనకు ఇష్టంలేని పెళ్లి జరుగుతుండటంతో….. పీటలమీద కూర్చున్న వధువు, తన ప్రియుడి సాయంతో ఆఖరి నిమిషంలో వరుడికి షాకిచ్చి పీటల మీదనుంచి లేచి వెళ్లి పోయింది.చిత్తూరు జిల్లాకు చెందిన యువతి చెన్నైలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తోంది. ఆమె తల్లి తండ్రులు ఇటీవల కడప జిల్లాకు చెందిన యువకుడితో వివాహం నిశ్చయించారు. అయితే ఆమె చెన్నైలో వేరోక వ్యక్తిని ప్రేమించింది. ఆవిషయం కుటుంబ సభ్యులకు చెప్పకపోవటంతో పెళ్ళి అంగరంగ వైభవంగా చేసేందుకు ఏర్పాట్లు చేశారు. శుక్రవారం ఉదయం హర్తం నిశ్చయించారు. నవంబర్ 19 గురువారం రాత్రి రిసెప్షన్ జరిగింది.

బంధువులతో కళ్యాణ మండపం కళకళ లాడింది. ఇరువైపులా బంధువులు భారీగానే హాజరయ్యారు. రిసెప్షన్ ముగిసింది. పెళ్లి తంతు మొదలైంది. ఇంతలో అర్ధరాత్రి వేళ పోలీసులు కళ్యాణ మండపంలోకి ఎంటరవటంతో కధ అడ్డం తిరిగింది. తన ప్రియురాలికి ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని తమిళనాడు పోలీసులకు పిర్యాదు చేసిన ప్రిియుడు వారిని వెంటపెట్టుకుని చిత్తూరు వచ్చాడు. స్ధానిక  పోలీసులను వెంట పెట్టుకుని ఆమె ప్రియుడు కళ్యాణ మండపానికి వచ్చాడు.దీంతో పెళ్లి కొడుకు షాక్ కు గురయ్యాడు. పోలీసులు, ఇరు వైపులా పెద్దలు ఎంత నచ్చచెప్పినా వధువు ససేమిరా అంది. ప్రియుడితోనే వెళ్లిపోవటానికి నిశ్చయించుకుంది. దీంతో పోలీసులు పంచాయతీని తహసీల్దార్ వద్దకు చేర్చారు. అక్కడ వధువు స్టేట్ మెంట్ రికార్డు చేసుకుని ఆమెను ప్రియుడితో పంపించారు. ప్రేమించిన విషయం ముందే చెప్పొచ్చుకదా అంటూ నిట్టూరుస్తూ వరుడి తరుఫు బంధువులు వెనుతిరిగారు.


marraige fail chittoor

Related Tags :

Related Posts :