పేదలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్, ఇళ్ల స్థలాల పంపిణీకి ముహూర్తం ఫిక్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

house sites: ఏపీలో ఇళ్ల స్థలాల పంపిణీకి ప్రభుత్వం ముహూర్తం ఫిక్స్ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 25న ఇళ్ల స్థలాలను పంపిణీ చేయనుంది ప్రభుత్వం. కోర్టు స్టే ఉన్న ప్రాంతాల్లో మినహా మిగతా చోట్ల ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనున్నారు. లబ్దిదారులకు డి ఫామ్ పట్టా ఇచ్చి ఇంటి స్థలం కేటాయిస్తారు. అదే రోజున ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తారు. తొలి దశలో దాదాపు 15లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టనుంది జగన్ ప్రభుత్వం. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 30లక్షల 68వేల 281మంది లబ్దిదారులను ప్రభుత్వం గుర్తించింది.

ఇప్పటికే నాలుగు సార్లు వాయిదా:
పేదలకు సొంతిల్లు కలగా మారింది. ఆ కలను నేరవేర్చేందుకు జగన్ ప్రభుత్వం సిద్ధమైంది. వాస్తవానికి ఇళ్ల పట్టాల పంపిణీ ఎప్పుడో జరగాల్సింది. కానీ వాయిదా పడుతూ వచ్చింది. ఇప్పటికే ఈ కార్యక్రమం నాలుగు సార్లు వాయిదా పడింది. తొలుత ఉగాది రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. కొవిడ్ కారణంగా వాయిదా పడింది. ఆ తర్వాత వైఎస్ఆర్ జయంతి రోజున అనుకున్నారు. కానీ వాయిదా పడింది. ఆ తర్వాత అంబేద్కర్ జయంతి రోజున పంపిణీ చేద్దామని అనుకున్నారు. ఆ తర్వాత గాంధీ జయంతి రోజున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావించింది. అయితే కరోనా పరిస్థితులు, కోర్టు కేసుల నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది.

డిసెంబర్ 25న ఇళ్ల పట్టాల పంపిణీ, అదే రోజున ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన:
చివరికి కొత్త ముహూర్తాన్ని ప్రభుత్వం ఫిక్స్ చేసింది. డిసెంబర్ 25న లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు కేసులు ఉన్న ప్రాంతాలు మినహా మిగిలిన ప్రాంతాల్లో లబ్దిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయనుంది ప్రభుత్వం. ఇప్పటికే లబ్దిదారుల ఎంపిక, భూముల కేటాయింపు, లే ఔట్ల ప్రక్రియ అంతా పూర్తయింది. కాగా, కోర్టు కేసులు ఉన్న నేపథ్యంలో ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా పడుతూ వచ్చింది. డిసెంబర్ 25న లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇస్తారు. అదే రోజున సీఎం జగన్ చేతుల మీదుగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి శంకుస్థాపన జరిగే అవకాశం ఉంది. ఇప్పటివరకు నాలుగు సార్లు ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమం వాయిదా పడుతూ వచ్చింది. చివరికి ముహూర్తం ఫిక్స్ కావడంతో లబ్దిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related Tags :

Related Posts :