లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

పంచాయతీ ఎన్నికలు ఎలా ? ఉద్యోగులు వద్దు అనడం సరికాదు – నిమ్మగడ్డ

Published

on

AP panchayat elections : నోటిఫికేషన్ వచ్చేసింది..రెడీగా లేమని ఏపీ సర్కార్ అంటోంది. ఉద్యోగులు తమ వల్ల కాదంటున్నారు..వేల మంది సిబ్బంది కావాలి..పోలీసులు ఒకే అనేలా లేరు…సుప్రీంకోర్టులో తేడా వస్తే..? ఎన్నికలు ఎలా..??? సిబ్బంది లేరు…నిధులు కొరత ఉంది..సవాళ్లు చాలానే ఉన్నాయి..వీటన్నింటినీ అధిగమించి..రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఎన్నికలు ఎలా నిర్వహిస్తుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. అన్ని అవరోధాలు ఎదుర్కొని ఎన్నికలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ స్పష్టం చేస్తున్నారు.

మొదటి విడత పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ను 2021, జనవరి 23వ తేదీ శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించారు. దేశమంతా ఎన్నికలు జరుగుతుంటే..ఏపీలో ఉద్యోగులు వద్దనడం సరికాదన్నారు. ప్రజాసంకల్పానికి విరుద్ధంగా వెళితే..దుష్పలితాలు ఉంటాయని ఉద్యోగులు గమనించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియలో అవరోధాలు తలెత్తితే దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ఇదే విషయాన్ని రాష్ట్ర గవర్నర్ కు తెలియచేస్తామన్నారు. ఏపీలో జరుగుతున్న పరిణామాలను సుప్రీంకోర్టుకు తెలిచేయనున్నట్లు, పంచాయతీ ఎన్నికల కోసం ప్రజలు ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారని, ప్రజల ఆకాంక్షలను అందరూ గౌరవించాలన్నారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ.