Mask వ్యర్థాలతో రిస్క్..ఎందుకో తెలుసా

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం Corona Fever నెలకొంది. చైనా నుంచి వచ్చిన ఈ రాకాసి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసింది. భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తోంది. వైరస్ ను కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. కానీ ఎక్కడా వైరస్ స్టాప్ కావడం లేదు. లక్షల సంఖ్యలో ప్రజలు వైరస్ బారిన పడుతున్నారు. ఒకరి నుంచి మరొకరికి వైరస్ సోకుతుండడంతో తప్పనిసరిగా Mask, సోషల్ డిస్టెన్స్, తదితర జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

ప్రధానంగా Mask ల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కరోనా వైరస్ కట్టడికి విశేషంగా పోరాడుతున్న వైద్య సిబ్బంది, పోలీసులు, వైద్య సిబ్బంది, ప్రభుత్వ అధికారులతో పాటు సామాన్య ప్రజలు మాస్క్ లను తప్పనిసరిగా ధరిస్తున్నారు. వీటిలో ఎన్నో రకాల మాస్క్ లు (N-95, Surgical Mask..Etc) మార్కెట్ లో లభిస్తున్నాయి.

కొంతమంది మాస్క్ లు వాడి ఎక్కడ పడితే అక్కడే పడేస్తున్నారు. దీనిపై WHO, కేంద్ర ప్రభుత్వ సాలీడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ నిబంధనలు, విధానాలను నిర్దేశించాయి. వైద్యులు, వైద్య సిబ్బంది వాడిన మాస్కులను 850 డిగ్రీల సెల్సియస్ నుంచి 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద ప్రత్యేక గ్యాస్ క్లీనింగ్ ఎక్విప్ మెంట్ తో కాల్చివేయాలని సూచించింది.

ఇక సాధారణ ప్రజలు వాడేసిన Maska లను ఇతర వ్యర్థ పదార్థాలతో కలుపకూడదని, వీటిని బయో మెడికల్ వేస్ట్ ట్రీట్ మెంట్ ఫెసిలిటీతో కాల్చివేయాలి. లేనిపక్షంలో 10 అడుగుల లోతు తవ్వి భూమిలో పాతిపెట్టాలని వెల్లడించింది.

మాస్క్ ల వ్యర్థాలతో పర్యావరణానికి తీవ్ర హాని నెలకొంటుందని హెచ్చరించింది. మాస్క్ లను రీ సైక్లింగ్ చేయడం ఆచరణ సాధ్యం కాదని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఇలా చేయడం చాలా ఖరీదు అని, రీ సైక్లింగ్ సాధ్యం కాదని యూనివర్సిటీ ఆఫ్ లండన్ నిపుణులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

పర్యావరణ ముప్పును తప్పించాలంటే..ప్రత్యామ్నాయ మాస్క్ ల వాడకాన్ని ప్రోత్సాహించాలని, వైద్య సిబ్బంది మినహా..అందరూ కాటన్ మాస్క్ లను వాడాలని సూచిస్తున్నారు. కాటన్ మాస్క్ లను డిటర్జెంట్ / డెటాల్ లతో ఉతికి ఎండలో ఆరవేసి మరలా వాడుకోవచ్చని, ఫైబర్ తో తయారైన రీయూజబుల్ మాస్క్ లు కూడా మార్కెట్ లో అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

Related Posts