లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story

ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్‌ను Accept చేయాలా వద్దా? ఆన్‌లైన్ ఫ్రెండ్స్‌ను ఎలా ఎంచుకోవాలి? ఈ పరిశోధనే సమాధానం..

Published

on

ఆన్ లైన్ స్నేహితులతో చెలిమి చేయడం కామన్ అయిపోయింది. కరోనా లాక్ డౌన్ ప్రభావంతం ఇప్పుడంతా ఆన్ లైన్‌లోనే ఎక్కువ సమయం గడిపేస్తున్నారు. స్నేహితులు, కుటుంబ సభ్యులు, కొత్త స్నేహితులతో సోషల్ మీడియా ప్లాట్ ఫాంనే వేదికగా ఎంచుకుంటున్నారు. మంచి స్నేహితుడిని ఎంచుకోవడంలో సోషల్ యూజర్లు ఎలా ఆలోచిస్తున్నారు? ఎవరైనా ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలా? లేదా? ఆన్ లైన్ ఫ్రెండ్స్ ఎంచుకుంటున్నారో ఓ పరిశోధన వివరిస్తోంది.

How Do People Decide to Accept a Facebook Friend Request?

స్నేహితుల విషయంలో సోషల్ యూజర్లు ఎలాంటి అభిప్రాయాలను కలిగి ఉన్నారు? తెలిసిన లేదా తెలియని వారి నుంచి కూడా ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లు వస్తుంటాయి. వీరిలో మంచి స్నేహితుడిని ఎంచుకోవడం ఎలా అనేదానిపై ఈ పరిశోధన ద్వారా ఒక అభిప్రాయానికి రావొచ్చుని అంటున్నారు విశ్లేషకులు.. ఆన్ లైన్ స్నేహితులను ఎంచుకోవడంలో ఎలా నిర్ణయించు కోవాలో ఈ పరిశోధనకు కొన్ని సమాధానాలు ఉన్నాయి. అవేంటో ఓసారి లుక్కేయండి..ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉండటం సాధ్యమేనా? :
ప్రస్తుత రోజుల్లో ఎక్కువమంది స్నేహితులను పొందడమంటే.. అది కేవలం సోషల్ మీడియా ద్వారా మాత్రమే సాధ్యమయ్యే రోజులివి.. మీరు ఫేస్‌బుక్‌లో లేకుంటే తప్ప మీకు ఎక్కువ మంది స్నేహితులు సంపాదించుకోలేరు. వాస్తవానికి ఒక పర్సనల్ ఫేస్ బుక్ ప్రొఫైల్ అకౌంటుకు కేవలం 5,000 మంది స్నేహితులు ఉండేందుకు అనుమతి ఉంది.

అందుకే సరైన స్నేహితులను ఎంచుకోంటోంది. మీ స్నేహితులను జాగ్రత్తగా ఎంచుకోవాలి. బాగా తెలిసిన స్నేహితులను ఎంచుకోవడం చాలామంది చేస్తుంటారు. హెల్దీ ఫ్రెండ్ షిప్ మరింత ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది. కానీ చాలావరకు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్టులు మనకు బాగా తెలిసిన వ్యక్తుల నుంచి రావు. అందుకే వీటి విషయలో కాస్తా జాగ్రత్తగా ఎంచుకోవాల్సిన అవసరం ఉంది.


ప్రొఫైల్ ఫొటో.. వారేంటో చెప్పేస్తోంది :
ఫేస్‌బుక్‌లో పర్సనల్ వివరాలు ప్రధానమైనవి. మీ స్నేహితుల రిక్వెస్ట్‌ను అంగీకరించాలా వద్దా అని నిర్ణయించుకోవాలి. మీ ఫోటోతో సహా మీ ప్రొఫైల్‌ను చూడండి. మీరు అవతార్ ఉపయోగిస్తే.. అది సూపర్ హీరో అయినా.. ఏ ఫొటో అయినా కావొచ్చు.. ఫొటోను చూసే మీరు వారి అభ్యర్థనను స్వీకరించాలో లేదో నిర్ణయించుకోవచ్చు. వారి భావజాలం లేదా ఆసక్తి ఆధారంగా వారు వెంటనే స్నేహితులుగా చేసుకోవచ్చు. లేదంటే.. మీరు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టినా కూడా కనీసం ప్రొఫైల్ కూడా చూడకుండానే రిజెక్ట్ చేసేస్తుంటారు.

ఆకర్షణీయమైన వారినే ఎందుకు ఎంచుకుంటారు? :
అసలు ఫేస్‌బుక్ ఫ్రెండ్ రిక్వెస్ట్ అంగీకరించాలా వద్దా అనేది ముందుగా నిర్ణయించుకోవాలి. రాజకీయ ప్రొఫైల్స్ కావొచ్చు.. శారీరక ఆకర్షణ ఉన్న స్నేహితులు ఎవరైనా ఎంచుకోవచ్చు. దీనికి సంబంధించి ఒక అధ్యయనం నిర్వహించగా.. ఇందులో 120 మంది విద్యార్థులు పాల్గొన్నారు. వీరి ఫేస్ బుక్ ప్రొఫైల్స్ ద్వారా స్నేహితులను ఎంచుకోవాలన్నారు.. ఇందుకు 6 కండీషన్స్ పెట్టారు. అందరూ ఒకేదాన్ని ఎంచుకున్నారు.


ఫేస్‌బుక్ ప్రొఫైల్ పిక్ బాగున్నవి.. శారీరక ఆకర్షణగా, రాజకీయ అనుబంధం ఉన్న యూజర్లనే తమ స్నేహితులుగా ఎంచుకున్నారు. ఆకర్షణీయం కాని యూజర్‌తో పోలిస్తే శారీరకంగా ఆకర్షణీయమైన వారినే ఎక్కువగా స్నేహితుల అభ్యర్థనను ఎంచుకునే అవకాశం ఉందని కనుగొన్నారు. నమ్మకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండేవారినే ఎక్కువగా విశ్వసిస్తుంటారని రచయితలు వివరిస్తున్నారు.

సోషల్ మీడియాలో మీరు షేర్ చేేసే వ్యక్తిగత వివరాలను సెక్యూర్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యమంటున్నారు. మీరు ఎవరిని మీ స్నేహితుడిగా ఎంచుకుంటున్నారో సరైన నిర్ణయం తీసుకోవాలి. రిక్వెస్ట్ పంపిన వారిని అంగీకరించడం చాలా సులభమే.. కానీ, కనిపించిన వారి వ్యక్తిత్వం వెనుక ఉన్న అసలైన వ్యక్తిని నమ్మడానికి అవసరమైనా విషయాన్ని ప్రతిబింబించేలా చేయాలి.. అప్పుడే నిజమైన స్నేహానికి పునాది పడుతుంది.. క్రమంగా బలపడుతుందని అంటున్నారు.


Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *