మీ క్రెడిట్ స్కోరు ఎంత ఉండాలి? ఇంతకీ ఎలా లెక్కిస్తారు?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మీకు మంచి క్రెడిట్ స్కోరు ఉందా? అయితే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చు. ఏదైనా లోన్ అప్లయ్ చేసినప్పుడు ఫైనాన్స్ సంస్థలు ముందుగా మీ క్రెడిట్ స్కోరు చెక్ చేస్తారు? మంచి క్రెడిట్ స్కోరు ఉన్న కస్టమర్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తాయి. ఇంతకీ క్రెడిట్ స్కోరు అంటే ఏంటి? అసలు ఎంత ఉండాలి? మంచి క్రెడిట్ స్కోరు ఉందా లేదా ఎలా లెక్కిస్తారో తెలుసుకుందాం..

క్రెడిట్ బ్యూరో (TransUnion CIBIL, Experian, CRIF High Mark and Equifax) మీ గత క్రెడిట్ హిస్టరీ తిరిగి ఎలా చెల్లిస్తున్నారనేదానిపై ఆధారపడి ఉంటుంది.  సకాలంలో గడువు తేదీకి ముందే క్రెడిట్ బిల్లులు చెల్లిస్తూ పోతే వారి క్రెడిట్ స్కోరు బాగా పెరుగుతుంది. క్రెడిట్ స్కోరు సాధారణంగా 300 నుంచి 900 మధ్య ఉంటుంది. 900 అత్యధిక స్కోరుగా లెక్కిస్తారు.అధిక స్కోరు కలిగి ఉంటే.. మీ పట్ల బ్యాంకులు, ఫైనాన్స్ సంస్థలు నమ్మకంగా ఉంటాయి. సాధారణంగా, మీరు ఏదైనా లోన్ కోసం అప్లయ్ చేస్తే.. బ్యాంకులు ఆమోదించడానికి 750 లేదా అంతకంటే ఎక్కువ స్కోరు ఉంటేనే ఆమోదిస్తారు. మీ క్రెడిట్ స్కోరును లెక్కించడంలో ముఖ్యమైన ఐదు అంశాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. అవేంటో ఓసారి చూద్దాం..

1. మీ రీపేమెంట్ హిస్టరీ బాగుండాలి:
తీసుకున్న రుణాన్ని సకాలంలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే రీపేమెంట్ హిస్టరీ ద్వారా మీ క్రెడిట్ స్కోర్‌ను ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. క్రెడిట్ బ్యూరో గత కొన్ని ఏళ్లుగా మీ బిల్లులు లోన్ తిరిగి చెల్లించే డేటాను మానిటర్ చేస్తుంటుంది. నెలవారీ ఈఎంఐలు ఎలా చెల్లిస్తున్నారో ప్రతిఒక్కటి వారు నిశితంగా పరిశీలిస్తుంటారు.

 is credit score calculated?సాధారణంగా గత 3 ఏళ్ల పేమెంట్ హిస్టరీ డేటాను అనుసంధానం చేస్తుంది. అప్పుడు క్రెడిట్ బ్యూరో.. మీ క్రెడిట్ స్కోర్‌ను లెక్కిస్తుంది. Bankbazar.com సీఈఓ అధిల్ శెట్టి చెప్పిన ప్రకారం.. EMIలు లేదా క్రెడిట్ కార్డ్ బకాయిల ఆలస్య చెల్లింపు మీ స్కోర్‌ను 100-ప్లస్ పాయింట్ల వరకు తగ్గించే అవకాశం ఉందని అంటున్నారు.2. మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి (CUR) :
CUR అనేది క్రెడిట్ కార్డ్ పరిమితి ఒక నెలలో ఉపయోగించవచ్చు. ఈ నిష్పత్తి మీ క్రెడిట్ స్కోర్‌పై పెద్ద ప్రభావాన్ని చూపుతుంది. మీరు మీ క్రెడిట్ కార్డును ఎంత ఎక్కువగా ఉపయోగిస్తే.. మీ CUR ఎక్కువగా ఉంటుంది. ఇదే మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గించడంలో ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ ప్లానర్లు ఒకరి CUR ను 30 శాతం లోపు ఉంచాలని, క్రెడిట్ కార్డ్ బకాయిలను పూర్తిగా సకాలంలో చెల్లించేలా చూడాలని సూచిస్తున్నారు.

READ  ఖాతాదారులకు SBI షాక్ : డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గింపు

3. క్రెడిట్ అకౌంట్లు ఎక్కువగా ఉండటం:
మీ సిబిల్ స్కోరు మీ రుణ పోర్ట్‌ఫోలియో ఆధారపడి ఉంటుంది. మీ రుణ పోర్ట్‌ఫోలియోలో సెక్యూర్ లోన్లు, అన్ సెక్యూర్ లోన్ల శాతాన్ని బట్టి ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్‌పై తక్కువ ప్రభావాన్ని చూపుతుంది. ఎక్కువ రకాల క్రెడిట్‌ కార్డులను కలిగి ఉంటే మంచి కంటే చెడు ఎక్కువగా ఉండొచ్చు . ఫలితంగా అధిక క్రెడిట్ స్కోర్‌కు దారితీస్తుందని శెట్టి అన్నారు.4. క్రెడిట్ లైన్ల వయస్సు / వ్యవధి :
మీ క్రెడిట్ స్కోర్‌పై మీడియం ప్రభావం చూపుతుందని శెట్టి అన్నారు. మీ loan లేదా క్రెడిట్ కార్డ్ పాతది, మీ స్కోరు పారామితి వెయిటేజీకి అనులోమానుపాతంలో ఉంటుంది. మీ బకాయిలను సకాలంలో తిరిగి చెల్లించడం ద్వారా మీరు ఎక్కువ కాలం క్రెడిట్‌ను బాధ్యతాయుతంగా ఉపయోగించారని సూచిస్తుంది.5. క్రెడిట్ స్కోరు కోసం ఎంక్వైరీలు చేయడం :
మీరు కొత్త క్రెడిట్ కార్డ్ లేదా రుణం తీసుకున్న ప్రతిసారీ లేదా ఇప్పటికే ఉన్న రుణాన్ని రీఫైనాన్స్ చేయడానికి చూస్తున్నారా? ఇలా అయితే కాస్తా ఆలోచించండి.. మీకు తెలియకుండానే మీ క్రెడిట్ స్కోరు డేంజర్ జోన్ లోకి వెళ్తుందని మరిచిపోవద్దు..

క్రెడిట్ స్కోరు పదేపదే చెక్ చేసుకోవడం చేయరాదు.. ఇలా చేస్తే మీ క్రెడిట్ స్కోరు క్రమంగా తగ్గిపోతుంది. కొత్త రుణమిచ్చే బ్యాంకుదారులు కస్టమర్ల క్రెడిట్ స్కోరు చెక్ చేస్తారు. ఇలా చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ స్కోరు భారీగా తగ్గిపోతుందని అంటున్నారు నిపుణులు.మీరు రుణం లేదా క్రెడిట్ కార్డ్ అప్లయ్ చేసినప్పుడు లోన్ చేసే వ్యక్తి.. మీ క్రెడిట్ నివేదికను క్రెడిట్ బ్యూరో నుంచి మీ క్రెడిట్ విలువను అంచనా వేస్తారు. ఇలాంటి క్రెడిట్ రిపోర్ట్ రిక్వెస్టులను క్రెడిట్ బ్యూరోలు సాఫ్ట్ ఎంక్వైరీలుగా పిలుస్తారు. ఇలా చేసిన ప్రతిసారి మీ క్రెడిట్ స్కోర్‌ను తగ్గిస్తుంది. మీ క్రెడిట్ స్కోరు ఆధారంగా ఎక్కువ క్రెడిట్ ఎంక్వైరీలను నేరుగా రుణదాతలకు సమర్పించాల్సిన అవసరం లేదు.

వివిధ లోన్, క్రెడిట్ కార్డ్ ఆఫర్లను మీ క్రెడిట్ స్కోరు, ఆదాయంతో పోలుస్తారు. ఆ తర్వాత సరైన క్రెడిట్ కార్డ్ లేదా లోన్ ఆప్షన్‌ను ఎంచుకోవడానికి అర్హత ప్రమాణాలకు లోబడి ఆన్‌లైన్ ఫైనాన్షియల్ మార్కెట్‌లను విజిట్ చేయాలి. ఇక్కడి కంపెనీలు మీ క్రెడిట్ రిపోర్టులను పరిశీలిస్తాయి. క్రెడిట్ కార్డు లేదా సాఫ్ట్ ఎంక్వైరీల ద్వారా లోన్ కోసం అప్లయ్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్‌ను ప్రభావితం చేయదు.

Related Posts