లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

వచ్చే సమ్మర్ వరకు ఎన్ని మిలియన్ల మంది కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూడాలి?

Published

on

ప్రపంచమంతా కరోనా వ్యాక్సిన్ కోసం ఆశగా ఎదురుచూస్తోంది. కరోనాను అంతం చేసే వ్యాక్సిన్ అందరికి అందుబాటులోకి రావాలంటే వచ్చే ఏడాది 2021 సమ్మర్ వరకు మిలియన్ల మంది ప్రజలు వేచిచూడాల్సిందే అంటున్నారు నిపుణులు. ఫైజర్ కరోనా వ్యాక్సిన్ కోసం ఇప్పటికే 40 మిలియన్ల డోస్‌లు ఆర్డర్ చేసేసింది యూకే.



డిసెంబర్ ఆరంభం నుంచే వ్యాక్సిన్ పంపిణీ కానుంది. అయితే ముందుగా NHSలతోనే వ్యాక్సినేషన్ మొదలు పెట్టనుంది. మొత్తం 40 మిలియన్ల డోస్ నుంచి ఈ ఏడాది క్రిస్మస్ నాటికి పది మిలియన్ల డోస్ లు అందుబాటులోకి రానున్నాయి.

మిగిలిన 30 మిలియన్ల డోస్‌లతో వ్యాక్సిన్ వచ్చే ఏడాది సమ్మర్ నాటికి అందుబాటులోకి రానుంది. ఒక్కొక్కరికి కరోనా టీకా రెండు మోతాదుల్లో ఇవ్వనున్నారు.

అంటే.. 20 మిలియన్ల బ్రిటన్లకు ఈ మోతాదు సరిపోతుందని అన్నారు బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. కోవిడ్ టీకాను ప్రతిఒక్కరికి నేరుగా ఇవ్వడం జరగదని ఆరోగ్య కార్యదర్శ మ్యాట్ హ్యాన్ కాక్ తెలిపారు.



వ్యాక్సిన్ ఆమోదం పొందిన వెంటనే 2021 నాటికి అందరికి అందుబాటులోకి రావొచ్చునని అభిప్రాయపడ్డారు. ముందుగా ఆరోగ్య భద్రతా సిబ్బంది, హోం కేర్లలోని వారికి తొలి మోతాదు ఇవ్వనున్నారు.

50 ఏళ్ల లోపు వారు తర్వాతి క్రమంలో వ్యాక్సినేషన్ పొందే అవకాశం ఉంది. కానీ, ఇంతకీ ఎవరికి ముందుగా కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది? ఎప్పటికీ ఈ కరోనా టీకాను ప్రవేశపెట్టనున్నారో తెలుసుకుందాం.

తొలి వ్యాక్సిన్ అందుబాటులోకి ఎప్పుడు రావొచ్చు? :
అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్, జర్మనీ బయోటెక్ కంపెనీ BioNTech సంయుక్తంగా నిర్వహించిన ట్రయల్స్ లో తమ కరోనా వ్యాక్సిన్ సమర్థవంతంగా పనిచేస్తుందని వెల్లడించాయి. ఆరు దేశాలకు చెందిన 43,500 మందిపై కరోనా వ్యాక్సిన్ పరీక్షలు నిర్వహించారు.



వ్యాక్సిన్ సురక్షితానికి సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు రాలేదు. కరోనా టీకాతో 90 శాతం కరోనా కేసులను అడ్డుకోవచ్చునని మధ్యంతర ఫలితాల్లో తేలింది.

ఫైనల్ సేఫ్టీ డేటా వచ్చిన తర్వాతే కంపెనీ ఆమోదం కోసం దరఖాస్తు చేయాలని చూస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 200 కరోనా వ్యాక్సిన్లలో ఫైజర్ వ్యాక్సిన్ ఒకటిగా ఉంది.

ఎన్ని డోస్‌లు కావాలి?
ఫైజర్ వ్యాక్సిన్ ఒకసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వెంటనే.. డిసెంబర్ ఆరంభం నుంచే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది.

మొత్తంగా 40 మిలియన్ల డోస్‌లలో ఫైజర్ టీకాను క్రిస్మస్ నాటికి 10 మిలియన్లు సిద్ధం చేయనుంది. ఫైజార్ టీకా రెండు మోతాదులు అవసరం.



ఐదు మిలియన్ల మందికి ఈ ఏడాది ఆఖరులోగా అందుబాటులోకి వచ్చేస్తుంది. బ్రిటన్లలో 3.5 మిలియన్ల మంది 85ఏళ్ల వయస్సు ఉన్నవారే ఉన్నారు. 1.5 మిలియన్ల మంది NHS సిబ్బంది, వీరికే ముందుగా ఫైజార్ తొలి డోస్ ఇవ్వనున్నారు.

మూడో వంతు జనాభా గల దేశంలో మొత్తం 20 మిలియన్ల బ్రిటన్లకు 30 మిలియన్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లు సరిపోతాయని, వచ్చే ఏడాది జనవరికి సిద్ధమయ్యే అవకాశం ప్రధాని బోరిస్ ఆశాభావం వ్యక్తం చేశారు.

ఎవరికి ముందుగా వ్యాక్సిన్? :
అది.. వారి వయస్సును బట్టి ఉంటుంది. వయస్సు ఎక్కువగా ఉన్నవారికి కరోనా ముప్పు అధికంగా ఉంటుంది. అందుకే వీరికి ముందుగా వ్యాక్సిన్ ఇచ్చే అవకాశం ఉంది.



85ఏళ్ల వయస్సు వారితోపాటు హెల్త్ కేర్ వర్కర్లకు కూడా తొలి డోస్ ఇవ్వనున్నారు. 50ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్నవారికి చివరిగా వ్యాక్సిన్ ఇవ్వనున్నారు.



NHS, టీకాలను ఉచితంగా అందిస్తారా? :
మూడు వారాల వ్యవధిలో రెండు డోస్ ల ఫైజార్ వ్యాక్సిన్ అవసరం ఉంటుంది. ఏడు రోజుల తర్వాత రెండో మోతాదు ఇచ్చిన తర్వాత అమెరికా, జర్మనీ, బ్రెజిల్, అర్జెంటీనా, సౌతాఫ్రికా, టర్కీ వంటి దేశాల్లో ట్రయల్స్ 90శాతం సక్సెస్ సాధించాయి.

NHS ఇమ్యూనైజేషన్ ప్రొగ్రామ్ ద్వారా ఈ టీకాలు అందుబాటులోకి రానున్నాయి.



ఒకదానికి ప్రైవేటుగా చెల్లించవచ్చా? :
NHS ద్వారా మాత్రమే ఈ కరోనా వ్యాక్సిన్లు అందుబాటులో ఉంటాయి. యూకేలో ప్రైవేటుగా వ్యాక్సిన్ దొరకదు. భవిష్యత్తులో ఆ పరిస్థితి రావొచ్చు.

అమెరికాలో ఫైజార్ 100 మిలియన్ల డోస్ ల టీకా అందించేందుకు అంగీకరించింది. ఒక్కో డోస్ 1.95 బిలియన్ డాలర్లు లేదా 19.50 డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *