వాట్సాప్, టెలిగ్రామ్ లాంటి మెసేజింగ్ యాప్ డెవలప్ చేస్తే… ఎంత ఖర్చు అవుతుందో తెలుసా?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుతం సోషల్ యాప్ ప్లాట్ ఫాంలదే ట్రెండ్. ప్రపంచవ్యాప్తంగా సోషల్ యాప్స్‌ను బిలియన్లకు పైగా యూజర్లు వాడుతున్నారు. పాపులర్ యాప్స్‌లో ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్స్ చాలా ఉన్నాయి. అందులో ఫేస్ బుక్ సొంత మెసేంజర్ యాప్ వాట్సాప్ సహా టెలిగ్రామ్ వంటి ఇతర యాప్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇలాంటి యాప్స్ ఎలా పనిచేస్తాయి. అసలు ఈ యాప్స్ అభివృద్ధి చేయడానికి ఎంత మొత్తంలో ఖర్చు అవుతుందో తెలుసా? 2020లో మీరు ఒకవేళ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ లేదా టెలిగ్రామ్ డెవలప్ చేయాలనుకుంటే ఎంతవరకు ఖర్చు అవుతుందో ఒక్కొక్కటిగా తెలుసుకోందాం..

50వేల డాలర్లు పైమాటే : 
మీరు వాట్సాప్ లేదా టెలిగ్రామ్ యాప్ అభివృద్ధి చేయాలనుకుంటే… యాప్ అభివృద్ధికి అయ్యే ఖర్చు దాదాపు 50,000 డాలర్లు పైమాటే.. ప్రత్యేకించి మీరు రెండు ప్రముఖ ప్లాట్‌ఫారమ్‌ల (ఆండ్రాయిడ్, iOS) కోసం యాప్ డెవలప్ చేస్తున్నారా? అప్పుడు యాప్ డెవలప్ మెంట్ అయ్యే ఖర్చు మరింత ఎక్కువగా పెరిగిపోతుంది.
How Much Does It Cost to Develop a Messaging App Like Whatsapp or Telegram in 2020

వాట్సాప్ వంటి మెసేజింగ్ యాప్ అభివృద్ధికి అయిన ఖర్చు 2013 నుంచి 3 రెట్లు పెరిగిందని అంటున్నారు టెక్ నిపుణులు. ఎందుకంటే.. యాప్ డెవలప్ చేయగానే సరిపోదు.. అందులో ఎప్పటికప్పుడూ ఫీచర్లను అప్ డేట్ చేస్తుండాలి. కొత్త అప్ డేట్లను తీసుకొస్తుండాలి. అప్పుడే యాప్ పనితీరు సెక్యూర్ గా సమర్థవంతంగా పనిచేస్తుంది.

అసలు వాస్తవం ఏమిటంటే..
Whatsapp, Telegram, WeChat, Viber వంటి మెసేజింగ్ యాప్స్ ఇప్పుడు వివిధ ఆధునిక ఫీచర్లను తమ యాప్‌ల్లోకి ఇంటిగ్రేట్ చేస్తూ వస్తున్నాయి. యూజర్లను ఆకర్షించేందుకు తమ ప్లాట్ ఫాంలను ఇంటిగ్రేట్ చేసే దిశగా ముందుకు కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్ యాప్స్ వాట్సాప్, టెలిగ్రామ్, వైబర్, వెచాట్ ఇతరులతో సహా మెసేజింగ్ యాప్స్ ఇంతగా పాపులారిటీ సాధించాయో తెలియాలంటే కొన్ని గణాంకాలు, వాస్తవాలను తెలుసుకోవాల్సిందే..
How Much Does It Cost to Develop a Messaging App Like Whatsapp or Telegram in 2020మార్చి 2020 నాటికి , వాట్సాప్‌లో 2000 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. 2013తో పోలిస్తే 10 రెట్లు ఎక్కువనే చెప్పాలి. ప్రతి నెలా సుమారు 2 మిలియన్ యాక్టివ్ యూజర్లు ఈ మెసేజింగ్ యాప్ వాడుతున్నారు. ఫేస్‌బుక్‌ యాప్ డౌన్ అయిన సమయంలో టెలిగ్రామ్ యాప్ 24 గంటల్లో 3 మిలియన్ల మంది కొత్త యూజర్లను చేర్చుకున్నట్లు మార్చి 2019లో ఓ నివేదిక తెలిసింది. మార్చి 2019నాటికి , టెలిగ్రామ్‌లో 200 మిలియన్ల నెలవారీ యూజర్లు ఉన్నారు.

2022లో 1 బిలియన్ యూజర్లను చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2020 నాటికి, మెసేజింగ్ యాప్‌ల నుండి వచ్చే సగటు ఆదాయం ప్రతి యూజర్‌కు 15 డాలర్లను అధిగమిస్తుందని అంచనా. వీచాట్ 15.64 డాలర్లను ఉత్పత్తి చేస్తుందని, వాట్సాప్ ఒక యూజర్‌కు 15 డాలర్లు చొప్పున సంపాదిస్తుందని, ఫేస్ బుక్ ప్రతి వినియోగదారుకు 5 డాలర్లు సంపాదించవచ్చని అంచనా వేస్తోంది.

READ  కరోనా ఎఫెక్ట్..WhatsApp చేయండి : సరుకులు ఇంటికే తెస్తాం

2020లో చాట్ అప్లికేషన్‌ డెవలప్‌కు తెలుసుకోవలసిన ముఖ్యమైన విషయాలు? :
యాప్ డెవలప్ ప్రాజెక్టును ప్రారంభించడానికి ముందు..ఈ కింది కొన్ని ముఖ్యమైన అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి సంస్థ ఎల్లప్పుడూ యాప్ ప్రొడక్ట్ MVPని రూపొందించాలి. యాప్ అభివృద్ధి ప్రక్రియను పూర్తి చేయడానికి మీకు అనుభవజ్ఞులైన యాప్ డెవలపర్లు, డిజైనర్లు, నాణ్యత హామీ ఇంజనీర్లు, ప్రాజెక్ట్ నిర్వాహకులు, UX / UI డిజైనర్లు తప్పనిసరిగా ఉండాలి.
How Much Does It Cost to Develop a Messaging App Like Whatsapp or Telegram in 2020

చాట్ యాప్ అభివృద్ధి ఖర్చు ప్రాథమిక ఫీచర్లతో కలిపి 10,000 డాలర్ల నుంచి ప్రారంభమవుతుంది. మీ బడ్జెట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యాప్ అభివృద్ధి అవసరాలను తీర్చడానికి యాప్ అభివృద్ధి సంస్థను నియమించాల్సిన అవసరం ఉంటుంది. చాట్-ఆధారిత యాప్ డెవలప్ చేయడానికి మొత్తం ఖర్చు 20,000 డాలర్ల నుంచి 30,000 డాలర్ల వరకు ఉంటుంది అంచనా. ఇంటిగ్రేట్ చేయడానికి ఎంచుకున్న ఫీచర్లు, వాటి డెవలప్ మెంట్‌కు ఖర్చు మరింత పెరగొచ్చు. సాధారణంగా యాప్ ధరను లెక్కించాలంటే ఈ సాధారణ సూత్రాన్ని ఫాలో అవ్వాలి.

యాప్ డెవలప్ మొత్తం గంటలు X గంటకు డెవలపర్ ఖర్చు = తుది అభివృద్ధి ఖర్చుగా పరిగణిస్తారు. మీ యాప్ క్రియేట్ చేసేందుకు గంటకు 12 డాలర్ల నుండి 18 డాలర్ల వరకు UX / UI డిజైనర్‌ను నియమించుకోవాలి. యాప్ ఇంటర్‌ఫేస్‌ను రూపొందించడానికి సుమారు 60-70 గంటలు పడుతుంది.

యాప్ డెవలపర్ ఖర్చు కూడా యాప్ ప్రారంభానికి OS ఎంపికపై ఆధారపడి ఉంటుంది. యాప్ డెవలపర్ సగటు ధర గంటకు 18 డాలర్ల నుండి 30 డాలర్ల వరకు ప్రారంభమవుతుంది. ఈ ఫీచర్లను అభివృద్ధి చేయడానికి అయ్యే ఖర్చు అభివృద్ధి బృందం గంట ఖర్చు, ఫీచర్లను రూపొందించడానికి వారు తీసుకునే సమయాన్ని బట్టి ఉంటుంది. ఫీచర్ అభివృద్ధి మొత్తం వ్యయాన్ని అంచనా వేయాలంటే.. యాప్ అభివృద్ధికి గంటకు అయ్యే ఖర్చుతో మొత్తం అభివృద్ధి గంటలను లెక్కించవచ్చు.

Related Posts