ఎన్నిసార్లు జంటలు శృంగారంలో పాల్గోనాలి? సైన్స్ చెబుతోంది ఏంటి?

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

శృంగారం.. ఒక మధురమైన క్షణం.. జంటల్లో సాన్నిహిత్యానికి శృంగారమే పునాది. శృంగారంతో ఆరోగ్యపరంగా, మానసికపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇప్పటికే పలు అధ్యయనాలు తేల్చేశాయి. సెక్సాలిజిస్టుల నుంచి సైకాలిజిస్టులు.. సైన్స్ ఇదే విషయాన్ని గట్టిగా సూచిస్తున్నాయి. వాస్తవానికి శృంగారం అనేది రోజుకు ఎన్నిసార్లు చేయాలి? ఏయే విధానాల్లో శృంగారం సురక్షితం వంటి ఎన్నో పరిశోధనలు సూచిస్తున్నాయి. అసలు జంటలు ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొనాలి? ఈ విషయంలో సైన్స్ ఏమంటోంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.. ప్రతిఒక్కరిలో సెక్సువల్ డిజైర్ (లైంగిక వాంఛ) ఉంటుంది. పార్టనర్‌తో సాన్నిహిత్యాన్ని బలపరచడంలో శృంగారం అద్భుత ఔషధంలా పనిచేస్తుంది. జంటల్లో ఎవరైనా తన పార్టనర్‌తో ప్రతిరోజు శృంగారం చేసేలా ప్రేరేపించేందుకు ప్రయత్నిస్తుంటారు.
జంటల్లో లూసీ అనే పార్టనర్.. శృంగారంపై తన అభిప్రాయాన్ని ఇలా వ్యక్తం చేశారు.. తాము ఆరు నెలలు శృంగారం లేకుండా గడిపామని 27ఏళ్ల లూసీ చెప్పుకొచ్చారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి సగటును శృంగారంలో పాల్గొన్నట్టు తెలిపింది. ఇరువురి మధ్య శృంగారంపై కోరిక ఉన్నా పరిస్థితుల ప్రభావంతో వారిలో ఉద్వేగానికి కారణమవుతోంది. శృంగారంపై తన పార్టనర్‌కు ఆలోచన లేదని, ఉద్యోగంలో ఒత్తిడి కారణంగా ఆ ఆలోచనే అతనలో రావడం లేదని లూసీ ఆవేదన వ్యక్తం చేసింది. దీనిపై సెక్సాలిజిస్ట్ Armin Ariana కూడా వివరణ ఇచ్చారు. లైంగిక కోరిక అనేది నిరంతరం కొనసాగే ప్రక్రియని అరియానా అన్నారు. శృంగారం విషయంలో లైంగిక సంబంధాలపై ఎలాంటి అంచనాలు ఉంటాయి అనేదానిపై నిపుణులు ఏమంటున్నారో వారి మాటల్లోనే..

‘సాధారణ శృంగారమంటూ కొలమానమే ఉండదు :
సాధారణంగా జంటల్లో శృంగారంలో అంతరమనేది సర్వ సాధారణ విషయం.. ఎందుకంటే ప్రతిరోజు శృంగారంలో పాల్గొనడం సాధ్యపడని విషయంగా చెబుతున్నారు సెక్సాలిజిస్టులు. శృంగారానికి కొలమానాలేమి ఉండవని సెక్సాలజిస్ట్ వెనెస్సా మురాడియన్ వివరించారు. ఈ విషయంలో ఒక అధ్యయనం కూడా జరిగింది. పక్క వారికంటే తామే శృంగారాన్ని ఎక్కువగా ఎంజాయ్ చేస్తున్నామని భావిస్తే.. అలాంటి వారే మంచి లైంగిక జీవితాన్ని ఆశ్వాధిస్తున్నట్టు ఆమె తెలిపారు. కానీ, చాలామంది జంటల్లో శృంగారంపై భిన్నాభిప్రాయలను కలిగి ఉంటారు. లైంగిక జీవితాన్ని అంతా ఇంతా అన్ని కొలవడం సరికాదని అన్నారు. దీనిపై 27ఏళ్ల అనే యువతి తన అభిప్రాయాన్ని తెలిపింది..

‘ఎన్నో అందమైన జంటలను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశాను.. నిజ జీవితంలోనూ  చూశాను. ఎన్నో ఏళ్లు కలిసి జీవించిన తర్వాత కూడా వారు నిజంగా ప్రేమలో ఉన్నారా? ఇంకా సెక్స్‌లో పాల్గొంటున్నారా అని ఆశ్చర్యపోతుంటున్నాను’.

తన ప్రియుడు కూడా తనతో వారానికి చాలాసార్లు శృంగారం చేయాలని తాను భావిస్తోంది. చిన్నతనంలో శృంగారంపై ఆసక్తి ఎక్కువగా ఉండేదని, కానీ, పెద్దాయ్యాక ఒత్తిడితో కూడిన జీవితం కారణంగా శృంగారాన్ని విలువైనదిగా గుర్తించలేకపోయినట్టు ఆమె చెప్పారు.
Sex drive mismatch is common. Here's how to find a balance

READ  చలో చార్మినార్ : మండే ఎండల్లో ‘మత్వాల’ లస్సీ 

లైంగి కోరికపై ఒత్తిడి ఎక్కువగా ప్రభావం చూపిస్తుందని, అదే జీవితంగా మారిపోయింని Muradian తెలిపారు. ఒత్తిడి కారణంగా శరీరంలో శృంగార భావన కలగదని ఆమె చెప్పుకొచ్చారు. ఇంతకీ మీ లైంగిక జీవితం సాధారణమైనదా? లేదా అసాధారణమైనదా అనే ఆందోళన అవసరం లేదని అరియానా సూచించారు.

ఎన్నిసార్లు, ఎంతసేపనికాదు…. ఎంతగా ఏంజాయ్ చేశామన్నది ఎందుకు ముఖ్యమంటే? :
లైంగిక సాన్నిహిత్యం ఎంతో ప్రాధానమైనదిగా చెప్పవచ్చు.. ఇదే ఇద్దరి పార్టనర్లలో ప్రేమను, నమ్మకాన్ని తెలియజేస్తుంది. రోజుకు ఎక్కువ సార్లు శృంగారంలో పాల్గొంటే వారిలో సాన్నిహిత్యం ఎక్కువగా ఉందని అర్థం కాదు.. అలా అని రోజుకు లేదా వారంలో తరచుగా కాకుండా అరుదుగా శృంగారంలో పాల్గొనే జంటల్లో సాన్నిహిత్యం సరిగా లేదని కాదని మురాడియన్ చెప్పారు. తరచూ శృంగరంలో పాల్గొనే సమయంలో నాణ్యమైన సాన్నిహిత్యం అనేది తప్పనిసరిగా ఆమె పేర్కొన్నారు. నాణ్యమైన కోరిక.. (క్వాంటిటీ కంటే క్వాలిటీ) ఎంతో ఉత్తమమని ఆమె అభిప్రాయపడ్డారు. రోజులో ఎన్నిసార్లు శృంగారంలో పాల్గొన్నాము అనేదాని కంటే… కలిసి ప్రతి కలయిలో ఎంత నాణ్యమైన లైంగిక కోరిక ఉందనది ముఖ్యమని మురాడియన్ వివరించారు.

లైంగిక సంబంధాల్లో శృంగార ప్రేరణకు  3 మార్గాలు :

1. ముందు మాట్లాడుకోవాలి :
అన్నింట్లో కంటే కమ్యూనికేషన్ ప్రధానమైనది.. ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకోవడం ద్వారా అది శృంగారానికి ప్రేరేపిస్తుంది. జంటల్లో సాన్నిహిత్యాన్ని పెంచుకోవాలంటే ప్రతి జంట తప్పనిసరిగా ముందు మాట్లాడుకోవాలి. ఒకరి మాటలను ఒకరు గౌరవించుకోవాలి. మాట్లాడుకోవడం లేని జంటల్లో తీవ్రమైన టెన్షన్ కు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు అరియానా. మీ పార్టనర్‌తో శృంగారం గురించి మాట్లాడటానికి కష్టంగా అనిపిస్తే.. వారిలో ఆనందం కలిగించే అంశాలపై మాట్లాడుతూ వారిని తమవైపు ఆకర్షించేలా చేసుకోవచ్చునని సెక్సాలిజిస్ట్ Tanya Koens తెలిపారు. అలా చేయలేనప్పుడు సెక్స్ థెరపిస్ట్‌ను సంప్రదించడమే ఉత్తమమని అన్నారు.

2. శృంగారానికి సమయాన్ని కేటాయించండి :
శృంగారం చేయాలనే బలమైన కోరిక ఉన్నప్పటికీ జంటల్లో ఎవరికైనా సమయం అనుకూలంగా ఉండకపోవచ్చు. ఒకరికి కుదిరినా మరొకరు సిద్ధంగా ఉండకపోవచ్చు. ఇలాంటి సమయాల్లో శృంగారంపై ఆసక్తి చూపలేకపోతారు. అందుకే సరైన సమయం ఎప్పుడు దొరుకుతుందా? అని ఆలోచిస్తుంటారు. అందుకే ఇలాంటి సమస్యలను అధిగమించాలంటే ముందుగా ఒక ప్రణాళిక సిద్ధం చేసుకోండి. ఏయే సమయాల్లో, ఏయే ప్రదేశంలో శృంగారానికి అనుకూలంగా ఉంటుందో ముందుగానే షెడ్యూల్ ప్లాన్ చేసుకోవడం మంచి ఫలితాన్ని ఇస్తుందని మురాడియన్ సూచించారు. శృంగారం అనేది లక్ష్యంగా ఉండాల్సిన పనిలేదంటున్నారు. సంభోగం లేకుండా సాన్నిహిత్యాన్ని మరింత పెంచుకోవచ్చునని అంటున్నారు.

3. రోజంతా మీలో ఆనందాన్ని రేకిత్తిస్తుంది :
శృంగారం అనేది ప్రతి జంటలో రెట్టింపు ఆనందాన్ని అందిస్తుంది. లైంగిక సంపర్కం సగటున ఐదు నిమిషాల సమయం ఉంటుంది. అందుకే సరైన సమయంలో శృంగారాన్ని ఆశ్వాధించాలని లేదంటే ఆ సుఖాన్ని ఆస్వాధించలేపోతారని అరియానా వివరించారు. శృంగారం మొదలు నుంచి భావ ప్రాప్తి పొందేవరకు ప్రతి క్షణం ఎంతో ముఖ్యమని, అదే శృంగార ప్రయాణాన్ని సజావుగా విజయవంతంగా ముగిసేలా ప్రేరేపిస్తుందని అరియానా తెలిపారు.

READ  చిహ్నాలే అక్షరాలా? : సింధు లోయ లిపి emojis లాంటిదా? 

అదే శృంగారంలో ఇరువురు పార్టనర్లు సంతృప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు. శృంగారంలో అతి ముఖ్యమైన ఘట్టం.. ఫోర్ ప్లే.. ముద్దులు, కౌగిలింత, డర్టీ టాక్స్ మరింత సంతృప్తిని పొందేలా ప్రేరేపిస్తాయని అంటున్నారు. ఒకరినొకరు ఆకర్షించుకోవడం.. గౌరవించుకోవడం ద్వారా ఇరువురిలో శృంగారంపై ఆసక్తిని పెంచుతుందని తెలిపారు. ప్రతిరోజులో ఆనందంగా ఉండేందుకు ప్రయత్నించాలి. అప్పుడే శరీరం కూడా లైంగిక ఆనందాన్ని కోరుకుంటుందని సెక్సాలిజిస్టులు సూచిస్తున్నారు.

Related Posts