How River Yamuna Cleaned Itself In 60 Days Of Coronavirus Lockdown

పాతికేళ్లలో రూ.5వేల కోట్లు ఖర్చు చేసినా జరగని పని, లాక్ డౌన్ చేసి పెట్టింది.. స్వచ్చంగా మారిన యమునా నది

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. మావవాళి మనుగడకు సవాల్

కరోనా వైరస్. యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న ప్రాణాంతక మహమ్మారి. మావవాళి మనుగడకు సవాల్ విసురుతున్న మహమ్మారి. 213 దేశాల ప్రజలకు నిద్ర లేకుండా చేస్తున్న వైరస్. మన దేశంలోనూ కరోనా తీవ్రత అధికాంగానే ఉంది. కరోనా వైరస్ కు వ్యాక్సిన్ లేకపోవడంతో ఈ మహమ్మారి కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అస్త్రాన్ని సంధించింది కేంద్రం. దేశవ్యాప్తంగా లాక్ డౌన్ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రెండు నెలల పాటు లాక్ డౌన్ అమల్లో ఉంది. ప్రజలు ఇళ్లకే పరిమితం అయ్యారు. షాపులు, పరిశ్రమలు, ప్రజా రవాణ ఇలా అన్నీ బంద్ అయ్యాయి. లాక్ డౌన్ కారణంగా కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయగలిగామా లేదా అనే వాదలను పక్కన పెడితే.. లాక్ డౌన్ వల్ల చాలా మంచే జరిగిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా పర్యావరణానికి, జీవ నదులకు చాలా మేలు జరిగిందని నివేదికలు చెబుతున్నాయి.

పాతికేళ్లలో కానిది 60 రోజుల్లో అయ్యింది, స్వచ్చంగా మారిన యమున:
లాక్ డౌన్ కారణంగా అసాధ్యం అనుకున్న పని సుసాధ్యమైంది. యమునా నది పరిశ్రుభ్రమైంది. యుమునా నది స్వచ్చతను సంతరించుకుంది. గత 25 సంవత్సరాల్లో రూ.5వేల కోట్లు ఖర్చు చేసినా జరగని పని లాక్‌డౌన్ చేసి పెట్టింది. ఆంక్షల నేపథ్యంలో ఫ్యాక్టరీలు, కంపెనీలన్నీ మూతపడటంతో యమునా నది స్వచ్ఛతను సంతరించుకుంది. ఎవరి ప్రమేయం లేకుండా దానికదే శుభ్రపరచుకుంది. కాలుష్యం తగ్గడంతో వేలాది పక్షులు నదికి వలస కట్టాయి. ప్రకృతి ధర్మం మేరకు చేపల్ని, ఇతర నీటి ప్రాణుల్ని వేటాడుతూ తమ ఆకలి తీర్చుకుంటున్నాయి.

1400 కిమీ పొడవు, 7 రాష్ట్రాల మీదుగా ప్రవాహం:
దాదాపు 1400 కి.మీ పొడవుండే యమునా నది ఏడు రాష్ట్రాల మీదుగా ప్రవహిస్తుంది. ఈ క్రమంలో నదీ ఒడ్డున ఉన్న కాలనీల మురుగు నీరు, కర్మాగారాల నుంచి వెలువడే రసాయనాలు అందులో వచ్చి చేరుతుంటాయి. హరియానాలోని పానిపట్‌, ఢిల్లీ మధ్య దాదాపు 300 ఫ్యాక్టరీల నుంచి వ్యర్థాలు నదిలో వచ్చి చేరుతాయి. దీంతో దేశంలోనే అత్యంత కాలుష్యమైన నదిగా యమునా నది నిలిచింది. 80 శాతం కాలుష్యం ఢిల్లీ, ఆగ్రా, మధుర మధ్యే జరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.

గత 30 ఏళ్లలో యమునా నదిని ఇంత స్వచ్చంగా చూడలేదట:
అయితే లాక్‌డౌన్‌ వల్ల క్రితంతో పోలిస్తే ఢిల్లీ ప్రాంతంలో నది 33శాతం స్వచ్ఛతను సంతరించుకుందని ‘ఢిల్లీ పొల్యూషన్‌ కంట్రోల్‌ కమిటీ’ తేల్చింది. ఇంకా.. మధుర దిశగా సాగితే నది మరింత శుభ్రంగా మారిందని తెలిపింది. గత 30 ఏళ్లలో తాను నదిని ఇంత స్వచ్ఛంగా ఎప్పుడూ చూడలేదని ‘యమునా యాక్షన్‌ ప్లాన్‌’లోని ఓ సభ్యుడు తెలిపారు. ఇది సహజసిద్ధంగా నదులకు ఉండే సామర్థ్యం వల్లే సాధ్యమైందని కమిటీ పేర్కొంది. దీన్ని ఇలాగే కొనసాగించాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. వ్యర్థాలు నదిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపింది. క్రమంగా పారిశ్రామిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో వెంటనే దీనిపై ప్రభుత్వ యంత్రాంగాలు దృష్టి సారించాలని హితవు పలికింది.

పర్యావరణానికి మేలు చేసిన లాక్ డౌన్:
60 రోజుల లాక్ డౌన్ కారణంగా కొన్ని ఇబ్బందులు, కష్టాలు ఎదురైన మాట వాస్తవమే. కానీ లాక్ డౌన్ కారణంగా ఎక్కువ లబ్ది కలిగింది పర్యావరణానికే. ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నా జరగని పనులు లాక్ డౌన్ చేసి పెట్టింది. దేశంలోని పలు జీవ నదులు స్వచ్చంగా మారాయి. ఎవరి ప్రమేయం లేకుండానే తమను తాము శుభ్రపర్చుకున్నాయి. ఎంతో దూరం నుంచి కూడా హిమాలయాలు కంటికి కనిపిస్తున్నాయి. గాలిలో కాలుష్యం తగ్గి నాణ్యత పెరిగింది. ఇలా పర్యావరణానికి లాక్ డౌన్ చేసిన మేలు అంతా ఇంతా కాదంటున్నారు పర్యావరణ వేత్తలు. ఇక ముందు కూడా ప్రభుత్వాలు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇవన్నీ ఇలానే స్వచ్చంగా, పరిశుభ్రంగా ఉంటాయని చెబుతున్నారు.

Related Posts