లాక్‌డౌన్‌లో సెక్స్ వర్కర్లు కస్టమర్ల కోసం ఎలాంటి టెక్నాలజీని వాడుతున్నారంటే?

How sex workers are using technology to service clients during the lockdown

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపై తీవ్రంగా పడింది. భారతదేశంలో కరోనాను కట్టడి చేసేందుకు లాక్ డౌన్ విధించింది కేంద్ర ప్రభుత్వం. లాక్ డౌన్ కారణంగా జనజీవనం స్తంభించిపోయింది. ఉపాధి కోల్పోయిన వలసదారులు తీవ్రంగా నష్టపోయారు. వీరే కాదు చాలామంది తమ ఉపాధి కోల్పోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారిలో సెక్స్ వర్కర్లు కూడా ఉన్నారు. కానీ, వీరిది భిన్నంగా ఉంటుంది. ప్రత్యేకించి ముంబైలోని గ్రాంట్ రోడ్ ప్రాంతంలోని రెడ్ లైట్ ఏరియాలో సెక్స్ వర్కర్లకు ఉపాధిపరంగా చిక్కులొచ్చి పడ్డాయి. లాక్ డౌన్ సమయంలో తమ కస్టమర్లను ఆకర్షించేందుకు సెక్స్ వర్కర్లు డిజిటిల్ టెక్నాలజీని వినియోగిస్తున్నారు. రియా ( పేరు మార్పు) సెక్స్ వర్కర్‌... రెడ్ లైట్ కాంప్లెక్స్‌లో 750 మందికి పైగా సెక్స్ వర్కర్లు ఉన్న రన్-డౌన్ భవనంలో నివసిస్తోంది.

మార్చి 25న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ప్రారంభమైనప్పటినుంచి ఆమె కస్టమర్లు అందరూ అదృశ్యమయ్యారు. ఇప్పుడు తన కస్టమర్లను తిరిగి ట్రాక్ చేయడం మొదలుపెట్టింది. ఫోన్ ద్వారా తన కస్టమర్లను సంప్రదిస్తూ వస్తోంది. ఒకరినొకరు తాకడం ద్వారా కరోనా వస్తుందనే భయంతో చాలామంది తమ దగ్గరకు రావడం మానేశారని చెప్పుకొచ్చింది. ఇలాంటి పరిస్థితుల్లో తమ భవిష్యతు గురించి భయపడినట్టు తెలిపింది. టచ్ ద్వారా వైరస్ సోకే కరోనా.. ఎయిడ్స్ కంటే మరింత బాధపెడుతోందని వాపోయింది.‘యే ఎయిడ్స్ కా భీ బాప్ ఆ గయా’ అని తెలిపింది. ఎయిడ్స్ సోకకుండా కండోమ్ సాయంగా ఉండేదని, ఇప్పుడు కరోనాకు రెయిన్ కోట్ ఉపయోగిస్తున్నట్టుగా చెప్పుకొచ్చింది. ఫోన్ రొమాన్స్ ద్వారా కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. కస్టమర్లతో ధర మాట్లాడుకున్న తర్వాత నగదును గూగుల్ పే ద్వారా చెల్లించాల్సిందిగా సూచిస్తున్నారు.

ఇప్పుడు ఫోన్ రొమాన్స్ అనేది.. రియా దినచర్యలో భాగంగా మారింది. ఫోన్ కాల్ అయితే ఒక రేటు.. వీడియో చాట్‌ అయితే ఒక రేటు ఛార్జ్ చేస్తుంది. తన ముఖాన్ని ఎవరూ రికార్డ్ చేయకుండా ఉండేందుకు ఆమె దుపట్టాతో కప్పేస్తుంది. ఆమె సాధారణ ఫోన్ కాల్‌కు రూ. 300, వీడియో చాట్ కోసం రూ. 500 వసూలు చేస్తుంది. రెండూ 30 నిమిషాల వరకు ఉంటాయి. నమ్మకమైన కస్టమర్లతోనే సెక్స్ వర్కర్లు ఈ చర్యకు పాల్పడుతున్న పరిస్థితి నెలకొంది. రియా పరిసరాల్లోని కనీసం తొమ్మిది మంది సెక్స్ వర్కర్లు ఫోన్‌లో ఇలాంటి సేవలను అందిస్తున్నారని ముంబైలో వారిలో పనిచేసే ఆస్త పరివార్ అనే ఎన్జీఓ సభ్యురాలు దేవతా మెథ్రే చెప్పారు. వీరిలో ఎక్కువ మంది కాల్స్ కోసం.. ఫేస్‌బుక్ మెసెంజర్, వాట్సాప్‌ను ఉపయోగిస్తున్నారు. గూగుల్ పే లేదా పేటీఎం ద్వారా చెల్లింపులను అంగీకరిస్తారు. 

భారతీయ నగరాల్లో, వలస వచ్చిన సెక్స్ వర్కర్లు తమ సొంత పట్టణాలకు తిరిగి వెళ్లారు. ఢిల్లీలో మాత్రమే 60శాతం మంది సెక్స్ వర్కర్లు నగరాన్ని విడిచిపెట్టినట్లు ఆల్ ఇండియా నెట్‌వర్క్ ఆఫ్ సెక్స్ వర్కర్స్ (AINSW) అంచనా వేసింది. కొంతమంది అద్దె చెల్లించలేకపోవడంతో యజమానులు వారిని వెళ్లగొట్టేశారు. మరికొందరు ఆహారం  మందులు కొనడానికి చాలా కష్టాలు పడుతున్నారు. దేశంలో 650,000 మంది సెక్స్ వర్కర్లు ఉన్నారని సంయుక్త UN ప్రోగ్రామ్ ఆన్ HIV / AIDS (UNAIDS) అంచనా వేసింది. యేల్ స్కూల్ ఆఫ్ మెడిసిన్ హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకులు ఇటీవల చేసిన మోడలింగ్ అధ్యయనం ప్రకారం.. రెడ్-లైట్ ప్రాంతాలలో వాణిజ్య లైంగిక పని, తిరిగి ప్రారంభించడానికి అనుమతిస్తే.. అంటువ్యాధులు వేగంగా పెరగడానికి కారణమవుతాయని హెచ్చరించారు. 

మరిన్ని తాజా వార్తలు