కలల్లో మనకు మనం ఎలా కనిపిస్తాం? మన శృంగార కలలు వెనుక అర్ధాలను కనిపెట్టారు సైంటిస్టులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Our Sexual Fantasies : శృంగారపు కలలు.. అనగానే శృంగార పురుషుల్లో ఎక్కడలేని నూతన ఉత్సాహం కనిపిస్తుంటుంది. కలలకు ఆడ, మగ మరి ఇతర లింగ భేదం అనే తేడా లేదు.. ఎవరైనా శృంగారాన్ని ఊహిస్తూ కలలు కంటూనే ఉంటారు. తనను తాను అలా ఊహించుకుంటూ పరవశించి పోతుంటారు. ఇంతకీ కలలు కనేవారిలో వారికి వారు ఎలా కనిపిస్తారు? మన శృంగార కలలు వెనుక అసలు రహాస్య వాటి అర్థాలను కనిపెట్టేశామంటున్నారు సైంటిస్టులు..
How We See Ourselves in Our Fantasies, and What It Meansశృంగారం గురించి అందమైన కలలు కనేవారిలో వారికి వారు ఎలా కనిపిస్తారు అనేదానిపై శాస్త్రవేత్తలు లోతుగా అధ్యయనం చేశారు. నిజ జీవితంలో కనిపించే విధంగా కనిపిస్తారా? లేదా ఏదో కొత్తగా కనిపిస్తారా? అనే కోణంలో అధ్యయనాన్ని కొనసాగించారు. ‘tell me what you want’ అనే పుస్తకంలో నుంచి 50 రాష్ట్రాలకు చెందిన 4,175 మంది అమెరికన్ల శృంగార కలలపై అధ్యయనం చేశారు.

97.1 శాతం మంది అవును అన్నారట : 
ఇందులో గుర్తించింది ఏమిటంటే.. చాలా మంది తమ శరీరం, వారి జననాంగాలు లేదా వారి వ్యక్తిత్వాన్ని సరికొత్తగా చూసుకున్నట్టు తెలిపారు. వేర్వేరు వ్యక్తులు తమను తాము చాలా భిన్నంగా కనిపించినట్టు చెప్పుకొచ్చారు.
How We See Ourselves in Our Fantasies, and What It Means

మీ సొంత శృంగారపు కలల్లో మీకు మీరు కనీసం కొంత సమయమైనా కనిపిస్తారా? అని సైంటిస్టులు అడిగినప్పుడు.. దాదాపు అందరూ (97.1 శాతం) అవును అని సమాధానమిచ్చారు. చాలా మంది తమ ఫాంటసీలలో ఎక్కువ సమయం కనిపిస్తామని తెలిపారు.

వయస్సు తక్కువ, అందంగా ఊహించుకుంటూ..  :

మనలో చాలా మంది సొంత ఫాంటసీలలో కనిపించినప్పటికీ.. వాస్తవానికి దూరంగా చాలా భిన్నమైన రూపాల్లో కనిపిస్తుంటారు. అందులో జననేంద్రియ స్వరూపం, వ్యక్తిత్వం లేదా సెక్సువల్ రోల్ భిన్నంగా కనిపించినట్టుగా నివేదించింది. దాదాపు సగం మంది తమ వయస్సును తక్కువగా మార్చుకుని ఊహాల్లో తేలుతున్నారని తెలిపింది.
How We See Ourselves in Our Fantasies, and What It Meansవయస్సు కు సంబంధించి పరిశీలిస్తే..
పురుషులు చిన్న వయస్సులోనే తమ గురించి అద్భుతంగా ఊహించుకోవడం చేస్తుంటే… మహిళలు కూడా తమ భవిష్యత్తు గురించి అద్భుతంగా చెప్పుకుంటారని అంటున్నారు. భిన్న లింగ పురుషులు తమను తాము యవ్వనంగా ఉండటాన్ని ఊహించుకున్నారు. ఎవరైనా ఒకరి (sexual fantasies) ఫాంటసీలలో తమను తాను అందంగా చూసుకోవడం చాలా సాధారణమే.

భిన్న లింగ మహిళలలో మూడింట ఒకవంతు మాత్రమే ఇదే విషయాన్ని చెప్పారు. పురుషులు ఎక్కువగా చిన్నవయస్సులో ఉండటాన్ని ఎక్కువగా ఊహించుకుంటారట. తమకు నచ్చినది వాస్తవంలో జరగని విషయాన్ని కలలో జరిగినట్టుగా ఊహించుకుని సంతృప్తి చెందుతున్నారంట.
How We See Ourselves in Our Fantasies, and What It Means వారు వాస్తవానికి కంటే ఎక్కువ ఆధిపత్యం చెలాయించడం గురించి ఊహించుకుంటారు. పురుషులు.. మహిళల కంటే ఎక్కువగా లొంగదీసుకోవడం గురించి ఊహించుకుంటున్నారు. స్వలింగ, ద్విలింగ పురుషులు తమ గురించి ప్రతిదీ (శరీరం, జననేంద్రియాలు, వ్యక్తిత్వం) నచ్చినట్టు మార్చుకోవడానికి భిన్న లింగ పురుషుల కంటే ఎక్కువగా ఊహించుకుంటున్నారట. వాస్తవంగా పరిశీలిస్తే.. లైంగిక మైనారిటీ పురుషులు.. తమ శరీరం, ప్రవర్తన ఆదర్శాలకు అనుగుణంగా చాలా ఒత్తిడిని ఎదుర్కొంటున్నట్టు తేలింది.

READ  ఒకటి కాదు రెండు కాదు.. పదుల సంఖ్యలో లక్షణాలు.. కరోనాను కనిపెట్టడం ఎలా? తలపట్టుకొంటున్న వైద్యులు

Related Posts