how you can avoid dark circles, and reduce them

కంటి కింద నల్లటి చారలా? బెస్ట్ టిప్స్ ఇదిగో!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రస్తుత జీవన విధానంలో కంటినిండా నిద్రపోయే పరిస్థితే లేదు. వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిని అధికంగా బాధించే ప్రధాన సమస్య నల్లటి చారలు. కంటి కింద నల్లగా కనిపించే చారలతో ఎంతోమంది బాధపడిపోతుంటారు. నలుగురిలో కలిసి తిరగాలన్నా తెగ ఇబ్బందిపడిపోతుంటారు. కళ్ల కింద నల్లటి వలయంలా ఏర్పడే వాటినే నల్లటి చారలు అంటారు.

ఒక్కొక్కరి చర్మం తీరునుబట్టి వారిలో ఈ చారలు కనిపిస్తాయి. ఇంతకీ ఈ నల్లటి చారలను ఎలా దూరం చేయాలి? వచ్చిన వాటిని ఎలా తగ్గించుకోవాలా? అని తెగ హైరానా పడుతుంటారు. అసలు ఈ నల్లటి చారలు ఎందుకు వస్తాయో తెలిస్తే.. నెమ్మదిగా వీటిని దూరం చేయవచ్చు. వచ్చిన చారలను తగ్గించుకునేందుకు ఎన్నో చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఓసారి చూద్దాం.

నల్లటి చారలు ఎలా వస్తాయంటే? :
కళ్ల కింద చర్మం చాలా పలచగా ఉంటుంది. ఆ ప్రాంతంలో ఎన్నోశోషరసగ్రంథులు లేదా సిరలు (నరాలు) ఉంటాయి. నల్లటి చారలు ఎక్కువగా.. ఫ్లూయిడ్ లోపం, రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం కారణంగా వస్తాయి. కళ్ల కింది చర్మం కాంతివంతంగా కనిపించాలి. కాంతివంతమైన చర్మంపై కేశనాళికలను స్పష్టంగా చూడవచ్చు. ఒకవేళ కంటి కింది చర్మంపై ఏమైనా కొవ్వు వంటి సెల్స్ ఉంటే మొత్తానికే కనిపించవు. 

వస్తే ఏం చేయాలి? :
ఒక్కటే సమాధానం.. మంచి ఆరోగ్యకరమైన జీవన విధానం. రోజుకు 8 గంటలు నిద్రపోవాలి. తద్వారా విటమిన్స్, మినరల్స్ అందేలా చూస్తుంది. ఎక్కువగా నీళ్లు తాగాలి. ఆల్కాహాల్, సిగరేట్ల నుంచి దూరంగా ఉండాలి. కనీసం.. మరుసటి రోజు ఉదయానికి ఒత్తిడి లేని కళ్లతో బిజినెస్ మీటింగ్‌ లో కూర్చొనేవరకు వదిలేయాలి.

ఆల్కాహాల్, ఉప్పు, సోడియం ఎక్కువగా ఉండే పదార్థాల కారణంగా చర్మంపై అధిక స్థాయిలో లవణాలు ఆయిల్ రూపంలో బయటకి వస్తాయి. తద్వారా మీ ముఖం చాలా డల్ గా పాలిపోయినట్టుగా కనిపిస్తుంది. పిజ్జా, బర్గర్లతో కూరగాయలు, ప్రత్యేకించి పప్పు దినుషులు ఉండేలా చూసుకోండి. అదనంగా రెగ్యులర్ వ్యాయామాలు చేయడం, స్వచ్ఛమైన గాలిని ఫీల్చడం ద్వారా ఈ నల్లటి చారల సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. 

క్రీమ్స్‌తో చెక్ పెట్టండిలా :
కంటి నిండా నిద్రలేకపోవడం, అనారోగ్యకరమైన డైట్ ద్వారా నల్లటి చారలపై ఎన్ని క్రీమ్స్ రాసినా ఫలితం ఉండదు అనే విషయాన్ని గుర్తించుకోవాలి. కానీ, కంటి చర్మంపై క్రీములతో  మెరుగైన ఫలితం తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. ప్రత్యేకమైన కంటి క్రీములను కంటి చుట్టూ రాయడం వల్ల మంచి ఫ్రెష్ లుక్ కనిపిస్తుంది.

READ  బ్యాంకుల హెచ్చరిక : UPI పేమెంట్ చేస్తున్నారా.. ఈ తప్పు చేయకండి!

క్రీమ్స్ లోని ఔషధ విలువలు చర్మాన్ని మరింత కాంతివంతగా కనిపించేలా చేస్తాయి. కంటికి అప్లయ్ చేసే క్రీమ్స్.. ప్రతిరోజు రెండూ పూటలా (ఉదయం లేదా సాయంత్రం) వాడితే మంచి ఫలితం ఉంటుంది. ఈ క్రీమ్స్ లోని కేఫెన్ మిశ్రమం.. కంటి కింద చర్మంపై విటమిన్స్ A, C తో పాటు రక్తప్రసరణ కలిగేలా ఉత్తేజపరుస్తుంది. 

ముందుగా అత్యవసర చర్యలివే :
పిజ్జా, వైన్ ఎక్కువ మొత్తంలో తీసుకున్నట్టయితే.. రక్తంలో ఆక్సీజన్ మెరుగయ్యేవరకు మెల్లగా మసాజ్ చేస్తుండాలి. ఉంగరపు వేలితో ముక్కు దగ్గరలో మెల్లగా నొక్కుతుండాలి. కంటి కిందిభాగం మొత్తం తగిలేలా పలుమార్లు నొక్కుతుండాలి. చల్లదనం కూడా బాగా పనిచేస్తుంది. రిఫ్రిజిరేటర్లలోని చల్లని వస్తువులతో తొందరగా ఉపశమనం పొందవచ్చు. కంటి ప్రాంతంలో ఎక్కువ మొత్తంలో చల్లదనం మంచిది కాదు. సౌకర్యం కోసం కంటి అద్దాలను కాసేపు ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఆ తర్వాత కళ్లకు పెట్టుకోవడం ద్వారా తక్షణ ఉపశమనం పొందవచ్చు.

ఇంటి చిట్కాలు ఇదిగో :
నల్లటి చారలకు ఇంటి చిట్కాలు అద్భుతంగా పనిచేస్తాయి. ఇందులో తొలి చిట్కా అంటే.. దోసకాయ మాస్క్ కళ్లకు మంచి ఉపశమనం కలిగిస్తుంది. కీరదోసకాయను సన్నగా కట్ చేసిన తర్వాత ఒక్కో ముక్కను మూసిన కళ్లపై పెట్టాలి. కాసేపు రిలాక్స్ అవ్వండి. పచ్చి కూరగయాలు కూడా చల్లగానూ మాయిశ్చరైజర్ గా పనిచేస్తాయి. వెంటనే కళ్లు ప్రెష్ గా కనిపిస్తాయి. పెరుగు వంటి పదార్థాలను పెట్టరాదు. బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. క్వార్క్ కూడా బాగానే పనిచేస్తుంది.

ఇది కూడా పెరుగు వంటి పదార్థమే అయినప్పటికీ మంచి ఉపశమనం ఉంటుంది. ఒక టేబుల్ స్పూన్ క్వార్క్ ను ఒక్కో కంటిపై అప్లయ్ చేయండి. 10నిమిషాల పాటు ఉంచండి. కళ్లలోకి వెళ్లకుండా జాగ్రత్తగా క్వార్క్ తొలగించండి. ఇంటి చిట్కాల్లో ఏది కూడా పనిచేయకపోతే మాత్రం కచ్చితంగా వైద్యుని సంప్రదించాల్సి ఉంటుంది. నల్లటి చారలు వచ్చాయంటే.. మినరల్ లేదా ఐరన్ సాంద్రత తక్కువగా ఉన్నట్టు సంకేతం. 

నల్లటి చారలు- వాపుకు తేడా ఇదే:
నల్లటి చారలు.. కంటి కింద ఉబ్బు (వాపు)గా ఉండటం రెండు ఒకటే కాదు. కంటి కిందిభాగంలోని చర్మంపై నల్లటి రక్తపు నాళలు కనిపిస్తాయి. శోషరసగ్రంథి వ్యవస్థ పరిమితంగా ఉంటే కళ్లలో వాపు కనిపిస్తుంది. దీనికారణంగా కంటి టిష్యూలోని ఫ్య్లూయిడ్ ఎక్కువ సమయం వెళ్లదు. దీనికో మంచి ట్రిక్ ఉంది. గ్రీన్ లేదా బ్లాక్ టీ బ్యాగులను బాగా నీళ్లలో మరిగించండి. ఆ తర్వాత టీ బ్యాగ్స్ చల్లగా కాగానే కళ్లపై కాసేపు పెట్టుకోంటే చాలు.. మంచి ఉపశమనం పొందవచ్చు.

READ  భారత్‌లో పంజా విసురుతున్న కరోనా.. పాజిటివ్ కేసులు 28,380, మృతులు 886

Concealerతో చారలు దాచేయండి :
మీకు ఓ ముఖ్యమైన అపాయింట్ మెంట్ ఉందనుకోండి. కంటి కింద నల్ల చారలు చూడటానికి ఇబ్బందిగా ఉన్నాయా? అయితే ఇలా చేయండి.. సాధారణంగా పురుషులు మేకప్ వాడేందుకు ఇష్టపడరు. కానీ, ఇలాంటి పరిస్థితుల్లో మేకప్ చేసుకోవడమే శరణ్యం.

Concealer అనేది చిన్న వ్యాండ్. కేవలం చిన్న బ్రెష్ సాయంతో మీ కళ్ల కింద ఉన్న నల్లటి చారలపై అద్దండి. చారలు కనిపించకుండా పోయేంతవరకు అలానే అప్లయ్ చేయండి. మీ చర్మ కాంతికి సరిగ్గా సరిపోయే Concealer ఎంచుకోంటే చాలు.. నల్లటి చారలను దాచుకోవచ్చు. 

Related Posts