hrithik-roshan-helps-to-dancer-kamal-singh1

ప్రతిభకు పేదరికం అడ్డుకాకూడదు.. డ్యాన్సర్‌కు హృతిక్ సాయం..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hrithik Roshan Helps to Dancer: బాలీవుడ్‌ స్టార్‌ హీరో హృతిక్‌ రోషన్‌ ఓ డ్యాన్సర్‌కు సాయం చేసి తన గొప్ప మనసును చాటుకున్నారు. ఢిల్లీలోని వికాస్ పురికి చెందిన బాలే డ్యాన్సర్‌ కమల్‌సింగ్‌కు లండన్‌లోని ప్రతిష్టాత్మక ‘ద ఇంగ్లిష్‌ నేషనల్‌ బాలే స్కూల్‌ ఆఫ్‌ లండన్‌’లో ఏడాది పాటు శిక్షణ తీసుకునే అవకాశం వచ్చింది. కానీ పేదరికం వల్ల కమల్‌సింగ్‌ ఆ ఫీజు చెల్లించలేక ఆ అరుదైన అవకాశం వదులుకునేందుకు సిద్ధపడ్డాడు.


ఈ విషయం తెలుసుకున్న హృతిక్‌రోషన్‌ అవసరమైన డబ్బును కమల్‌ సింగ్‌ బ్యాంక్‌ఖాతాలో వేశారు. కాగా కమల్ తండ్రి రిక్షా నడుపుతూ కొడుకుని గవర్నమెంట్ బాయ్స్ స్కూల్లో చదివించారు.


పట్టుదలతో తనకాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తున్న కమల్‌కు హృతిక్ సాయం చేసి అతని ఎదుగుదలకు దోహదపడినందుకు కమల్ టీచర్ హృతిక్‌కు థ్యాంక్స్ తెలిపారు. దాంతో నెటిజన్లు సోషల్‌ మీడియాలో హృతిక్‌రోషన్‌ను అభినందిస్తున్నారు.

Related Posts