In Hubei Province, corona virus Infections Skyrocket to Nearly 50,000

డేంజర్ బెల్స్.. ఒక్కసారిగా 50వేల మందికి కరోనా వైరస్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్

కోవిడ్-19.. అదేనండి కరోనా వైరస్.. చైనాలో ఇంకా తన ప్రతాపం చూపుతోంది. కోవిడ్ వేగంగా విస్తరిస్తోంది. మృతులు, బాధితుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. కోవిడ్ వైరస్ రాకెట్ స్పీడ్ వేగంతో వ్యాపిస్తోంది. ఒక్క హుబే ప్రావిన్స్ లోనే.. ఒక్కసారిగా కరోనా వైరస్ బాధితుల సంఖ్య పెరిగింది. తాజా లెక్కల ప్రకారం 50వేల మందికి కరోనా సోకింది. మృతుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. ఒకే రోజు 14వేల 840 కరోనా కేసులు నమోదు కావడం కలకలం రేపుతోంది. 

రోజురోజుకి పెరుగుతున్న కేసులు:
చైనాలో రోజురోజూకీ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. వేల మంది ఇప్పటికే కరోనా వైరస్ బారినపడి మరణించారు. భారత్ పాటు మరో 20 దేశాలకు కరోనా వైరస్ విస్తరిస్తోంది. కరోనా వైరస్ కారణంగా చైనాలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజలు ఇళ్లల్లో బందీలుగా మారారు. గడపదాటి బయటకు వచ్చే సాహసం చేయడం లేదు.

ఆర్థిక వ్యవస్థపై ప్రభావం:
ఇప్పటికే కరోనా వైరస్ కారణంగా పలు రంగాల్లో కార్యకలాపాలు స్థంభించిపోయాయి. ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడింది. అత్యంత త్వరగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే అవకాశం ఉండడంతో చైనాలో విద్యాసంస్థలతో పాటు ఆఫీసులు సెలవులు ప్రకటించాయి. దీనికితోడు చైనాకు సమీపంలోని దేశాలపైనా కరోనా ప్రభావం స్పష్టంగా కన్పిస్తోంది. పరిశ్రమలతో పాటు పర్యాటక రంగం ఇప్పటికే నెమ్మదించింది. ఆయా దేశాలు చైనాకు వెళ్లిన పర్యాటకులను తమ దేశాల్లోకి రాకుండా చర్యలు తీసుకుంటున్నాయి.

దగ్గినా, తొమ్మినా భయపడుతున్నారు:
ఈ వైరస్ సోకిన రోగులు ఎవరు, మంచి వారు ఎవరూ అనేది తెలియకుండా పోయింది. జలుబు చేసినా, జ్వరం వచ్చినా, దగ్గుతూ కనిపించినా.. అనుమానించే పరిస్థితి వచ్చింది. కరోనా వైరస్ కు ఇటీవలే ప్రపంచ ఆరోగ్య సంస్థ పేరు పెట్టింది. దీన్ని COVID-19 (కరోనా వైరస్ డిసీజ్ 2019) అని పిలవాలని ప్రతిపాదించింది. 2019 చివర్లో ఈ వైరస్ మొదలు కావడంతో.. సీవోఐడీ-19 అని పిలవాలని నిర్ణయించారు.

ఎండలపైనే ఆశలు:
చైనాలో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. నిన్న ఒక్కరోజే 15వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. చైనాలో పర్యటించని వారికి కూడా కరోనా వైరస్ సోకడాన్ని బట్టి ఇది ఎంత వేగంగా వ్యాప్తి చెందుతుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే 25 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్… ప్రపంచ దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోతున్నవారి సంఖ్య అంతకంతకూ పెరగడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ అప్రమత్తమయ్యింది. చైనాలో పరిస్థితిని అంచనా వేసేందుకు ఓ బృందాన్ని పంపింది. ఎండలు పెరిగితే వైరస్ కాస్త కంట్రోల్‌లోకి వస్తుందని కొందరు అంచనా వేస్తుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం దానిపై ఇప్పుడే స్పష్టత ఇవ్వలేమంటోంది. 

READ  ట్రంప్ కామెంట్స్: అమెరికా టార్గెట్ యుద్ధం కాదు.. ఇరాన్‌ను వదిలేది లేదు

దేశం కోసం నర్సుల త్యాగం:
ప్రాణాంతక కరోనా వైరస్‌ను తరిమికొట్టే పోరాటంలో… చైనా వైద్య సిబ్బంది సాహసోపేతంగా పనిచేస్తున్నారు. రాత్రింబవళ్లు ఆస్పత్రుల్లోనే ఉంటూ బాధితులకు వైద్య సేవలందిస్తున్నారు. దేశ పౌరుల్ని కాపాడుకొనేందుకు అహర్నిశలూ శ్రమిస్తున్నారు. ఇందుకోసం కేవలం తమ సమయాన్ని మాత్రమే త్యాగం చేయడం కాదు.. బాధితులకు వైద్య సేవలందించే క్రమంలో తమ ప్రాణాల్ని సైతం లెక్కచేయకుండా పనిచేస్తూ నిజమైన హీరోలు అని నిరూపించుకుంటున్నారు. తల నుంచి సహజసిద్ధంగా రాలే వెంట్రుకల ద్వారా కరోనా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందన్న అనుమానంతో చైనాలోని నర్సులు తమ శిరోజాలను సైతం తొలగించుకుంచుకొనేందుకు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. 

ఎడారిని తలపిస్తున్న వీధులు:
చైనాలోని ఆస్పత్రులకు రోగుల తాకిడి రోజురోజుకీ పెరగడంతో వైద్య సిబ్బందిపై ఒత్తిడి పెరుగుతోంది. నిద్ర కూడా సరిగా లేకపోవడంతో చాలామంది వైద్యులు, నర్సులు ఆస్పత్రిలోని కుర్చీలు, బెంచీల పైనే కాసేపు ఒరిగి సేదతీరుతున్నారు. నిత్యం జన సంచారంతో నిండిపోయి కిటకిటలాడే చైనాలోని పలు నగరాల వీధులన్నీ కరోనా దెబ్బకు బోసిపోయాయి. ఎడారిని తలపించేలా మారాయి. జనం బయటకు వచ్చేందుకే భయపడటంతో రోడ్లన్నీ ఖాళీ అయిపోయాయి. అనేక పరిశ్రమలు మూసివేయడంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్న చైనా.. తీవ్ర ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది.

Related Posts