లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

International

పూడ్చి పెట్టాక శవాలు కదులుతాయట : బల్లగుద్ది చెబుతున్న మహిళా శాస్త్రవేత్త

Published

on

Australian dead bodies moves research : కన్ను తెరిస్తే జననం..కన్ను మూస్తే మరణం. ఈ కనురెప్ప పాటు మధ్యలో జీవితంలో ఎన్నో చూస్తాం..అనుభవిస్తాం. మరణిస్తాం. అలా మరణించిన తరువాత ఏం జరుగుతుందనే విషయంపై ఎన్నో పరిశోధనలు జరిగాయి.

కానీ మనిషి ప్రాణం ఉన్నంత సేపు మనిషి అంటాం.ప్రాణం పోయాక మృతదేహం అంటాం. మరణించిన తరువాత ఆ మృతదేహాన్ని కొంతమంది దహనం చేస్తారు. మరికొంతమంది పూడ్చి పెడతారు. అది వారి వారి ఆచారాలను బట్టి జరుగుతుంటుంది. వాటినే అంత్యక్రియలు అంటారు.మార్పు మంచిదే : ఇక అన్నీ డబుల్ డెక్కర్ విమానాలే


మరి ఆ అత్యక్రియలు జరిగాక ఏం జరుగుతుంది? ఆ మృతదేహాన్ని పూడ్చిపెడితే కాలక్రమేణా కుళ్లిపోయి మట్టిలో కలిసిపోతుంది. కానీ..ప్రాణం ఉండగా కదిలే మనిషి మృతదేహం అయ్యాక కూడా కదులుతుందా? అనే ప్రశ్నకు ‘‘అవును మృతదేహం కదులుతుందని పక్కాగా బల్ల గుద్ది మరీ వాదిస్తున్నారు ఓ మహిళా శాస్త్రవేత్త.

 

శవాలపై పరిశోధనలు చేసిన ఆ మహిళా శాస్త్రవేత్త మృతదేహాలను పూడ్చి పెట్టిన తరువాత కూడా కదులుతాయంటున్నారామె. ఏంటీ భయమేస్తోందా? ఆశ్చర్యంగా ఉందా? మరి పూడ్చపెట్టాక శవాలు కదలటం ఏంటో దానికి గురించి పక్కగా చెబుతున్న ఆ మహిళా శాస్త్రవేత్త ఎవరు? ఏ నమ్మకంతో ఆమె కచ్చితం అంటోందో తెలుసుకుందాం..శవాలు కదులుతాయి!నమ్మితీరాల్సిందేనంటున్న మహిళా శాస్త్రవేత్త
పూడ్చి పెట్టాక శవాలు కదులుతాయని వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నమ్మతీరాల్సిందే అంటున్నారు ఆస్ట్రేలియాకు చెందిన మహిళా శాస్త్రవేత్త ఎలిసన్ విల్సన్.

మనిషి చనిపోయాక మృతదేహం సంవత్సం పాటు పేటికలో కదులుతుందని ఎలిసన్ విల్సన్ బల్లగుద్ది మరీ వాదిస్తున్నారు. ఒక శవంపై పరిశోధనలు చేసి 17 నెలల పాటు ఫొటోలు తీసి, ఆ ఫలితాలు పలు రకాలు విశ్లేషించానని క్యూ యూనివర్సిటీలో ఆమె క్రిమినాలజీలో పట్టా పుచ్చుకున్న ఎలిసన్ ఈ విషయాన్ని చాలా కచ్చితంగా చెబుతున్నారు.సిడ్నీ శివారులోని శ్మశాన వాటికలో ఎలిసన్ విల్సన్ ఓ మృతదేహంపై ఈ అధ్యయనం చేశారు. శవాలు పూడ్చిపెట్టాక రసాయనిక చర్యల వల్ల కొంతమేరకు కదులుతాయని తన పరిశోధనలో తేలినట్లు విల్సన్ తెలిపింది. పరిశోధన కోసం తాము ఎంచుకున్న శవాన్ని ప్రతి అర గంటకు ఒకసారి ఫోటో తీశాం అలా 17 నెలలపాటు ఫోటోలు తీశాం. ఆ తీసిన మొతత్తం ఫొటోలను విశ్లేషించాక శవం కదిలినట్లు తేలిందని అంటున్నారు ఎలిసన్.


శవం చేతుల్లోని కండరాలు, ద్రవాలు క్షీణించడం వల్ల శవం భంగిమలో తేడాలు వస్తాయి.. పీనుగలు వాటి ఉంచిన స్థలంలో ఉండవు. కుళ్లిపోవడడం, లిగమెంట్ ద్రవాలు ఎండిపోవడం వల్ల కాస్త పక్కకు జరుగుతాయని తెలిపారామె. విల్సన్ అధ్యయన ఫలితాలను ఫోరెన్సిక్ సైన్స్ ఇంటర్నేషనల్.. సినర్జీ పత్రికలో ఓ ఆర్టికల్ కూడా వచ్చింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *