లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Big Story-1

కొవిడ్-19ను జంతువులకు అంటిస్తున్న మనుషులు

Published

on

మనుషులు SARS-CoV-2 వైరస్ ను జంతుజాలానికి వ్యాప్తి చేసి COVID-19కు కారణమయ్యేలా ఉన్నారని ఓ ప్రధాన స్టడీలో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జీవజాలంలో కొన్ని జీవులకు మాత్రం చాలా ప్రమాదకరం కానుందని రీసెర్చర్లు అంటున్నారు. ఈ మేరకు వ్యాప్తిని అడ్డుకోవడానికి కృషి చేయాలంటున్నారు.
ఈ మెటా అనాలసిస్ లో భాగంగా.. పలు రకాల కాంబినేషన్లపై పరిశోధన జరుపుతున్నారు. SARS-CoV-2 ఇన్ఫెక్షన్ ప్రయోగం, జంతువుల మోడళ్లను, పాలిచ్చే జంతువులు, స్వభావం, ఏసీఈ2, సెల్ లైన్, కరోనావైరస్, వైల్డ్ లైఫ్ ల గురించి స్టడీ చేశారు. దాంతో పాటు proMED అనే ఓ కమ్యూనిటీని స్కాన్ చేశారు.

SARS-CoV-2 వైరస్ ను మనుషుల్లో కంట్రోల్ చేయడమే కష్టంగా ఉన్నప్పుడు.. పాలిచ్చే జంతువుల్లో కంట్రోల్ అవడం చాలా కష్టం. అని సహ రచయిత కేయూ ల్యూవెన్ అంటున్నారు. ‘అవి కూడా అనారోగ్యానికి గురవుతాయి.. సాధారణంగా జంతువులను అనుమానించం కాబట్టి వాటిల్లో వైరస్ చక్కర్లు కొడుతూ మళ్లీ మనుషులకు వ్యాప్తి అవుతుంది. ఎందుకంటే జంతువులను మాస్క్ ధరించాలని చెప్పలేం కదా’ అని అంటున్నారు.
ఫీల్డ్ రీసెర్చర్లు లేదా ఇతర ప్రజలు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా జంతుజాలాలు SARS-CoV-2 వ్యాప్తికి చైన్ మెయింటైన్ చేస్తున్నాయని తెలిపారు. ఇందులో పాలిచ్చే జంతువులను నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఇతర హ్యూమన్ వైరస్ ల కంటే దీని వ్యాప్తి వేగంగా ఉంటుంది. దానికి కారణం SARS-CoV-2కు ఉన్న ప్రత్యేక స్వభావమే.

ఇప్పటికే ప్రపంచంలో వైరస్ చాలా మంది మనుషులకు ఉంది. చాలా పెద్ద ఎత్తులో ఇది వ్యాప్తి చెందుతుంది. డైరక్ట్ గా కాకపోయినా పరోక్షంగానైనా లక్షణాలు డెవలప్ అవుతున్నాయి. కొందరిలో మాత్రం లక్షణాలు కనిపించకుండానే ఉంటున్నాయి. సంబంధిత పాలిచ్చే జంతువులకు కూడా వైరస్ ఇన్ఫెక్ట్ అవుతుంది.
ప్రత్యక్ష, పరోక్ష కాంటాక్ట్ ల ద్వారా మనుషులు.. SARS-CoV-2 వ్యాప్తిని ప్రోత్సహిస్తున్నారు. అదే జంతువులకు సంక్రమిస్తే ఫిజికల్ డిస్టెన్స్, మాస్క్ లు ధరించడం, క్వారంటైన్ లో ఉండటం వంటివి చేసినా ఉపయోగం ఉండదు. తప్పనిసరి పరిస్థితుల్లో జంతువులకు కరోనా పేషెంట్ సెలైవా, ముక్కులో నుంచి వచ్చే నీరు, వాడేసిన మాస్క్‌లు అందకుండా దూరంగా ఉంచాలి’ అని రీసెర్చర్లు అంటున్నారు. ఈ స్టడీని మమ్మల్ రివ్యూ అనే జర్నల్ ప్రచురించింది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *