లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Latest

నాలుగేళ్ల క్రితం ప్రేమ వివాహాం – కుటుంబాలకు దూరమయ్యామనే బాధతో దంపతులు ఆత్మహత్య

Published

on

man-who-lived-for-five-days-with-the-corpse-of-a-dead-mother1

Husband committed suicide, after 24 hours, wife also jumped in front of truck and killed, both of them had a love marriage : పెద్దలనెదిరించి పెళ్లి చేసుకున్న ఓజంట కుటుంబాలకు దూరమయ్యమనే బాధతో ఆత్మహత్య చేసుకున్న ఘటన ఉత్తరప్రదేశ్ లోని వారణాశిలో వెలుగు చూసింది. భర్త ఆత్మహత్య చేసుకున్న 24 గంటల్లో భార్య కూడా బలవన్మరణానికి పాల్పడి తనువు చాలించింది.

వారణాశిలోని శివపురి పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే అఖిలేష్ (29) కిరణ్(25)లు నాలుగేళ్ల కిందట పెద్దల నెదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఇరుకుటుంబాలకు దూరంగా జీవిస్తున్నారు. వివాహం చేసుకున్నతర్వాత ఈ జంట ఢిల్లీలో కాపురం పెట్టారు. ఆతర్వాత అక్కడి నుంచి ఉత్తర ప్రదేశ్ లోని శివపురి లోని తార్నా ఏరియాకు వచ్చారు. ఇద్దరు చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ జీవించసాగారు.

అఖిలేష్ మంగళవారం రాత్రి బలియా పరిధిలోని చిత్ బడ్ గావ్ లో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా కిరణ్ కూడా అదే సమయంలో ఓవర్ బ్రిడ్జిపైనుంచి దూకి ఆత్మహత్యచేసుకోవాలనుకుంది. కానీ ధైర్యం చాలక ట్రక్ కు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

అఖిలేష్ జేబులో డైరీ లభించింది. అందులో సూసైడ్ నోట్ ఉంది. తమ ఆత్మహత్యకు ఎవరూ బాధ్యులు కారని అఖిలేష్ పేర్కోన్నాడు. అమ్మా నిన్ను చాలా బాధపెట్టాను అని తల్లి ఉద్దేశించి ఒకచోట రాసాడు. అఖిలేష్ పెళ్లి తర్వాత ఇంటికి రాలేదని వారి కుటుంబ సభ్యులు తెలిపారు. ఇంట్లో వారికి దూరమయ్యామనే భాధలోనే ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.