అక్రమ సంబంధం ఉందని రాసివ్వు….భర్త,అత్తమామల వేధింపులు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

వేరే వాళ్లతో తనకు అక్రమ సంబంధం ఉందని రాసివ్వమని అత్తమామలు వేధిస్తున్నారని  ఓ కోడలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన గుజరాత్ , అహ్మదాబాద్ లోని బాపు నగర్ లో చోటు చేసుకుంది.రాజస్దాన్ లోని  ఉదయ్ పూర్ లో  నివసించే భూపేష్, కిరణ్ ఆర్ద్వి దంపతులకు 14 ఏళ్ల క్రితం పెళ్లైంది.  వీరికి 14 ఏళ్లబాబు, 10 ఏళ్ల పాప ఉన్నారు. గతేడాది మార్చి లో భూపేష్ భార్య కిరణ్ ను కొట్టడంతో  ఆమె తన 10 ఏళ్ల కూతురుని తీసుకుని తల్లి తండ్రుల వద్దకు  అహ్మాదాబాద్ లోని  బాపూనగర్ వచ్చేసింది.14 ఏళ్ల కొడుకు  తండ్రి వద్ద రాజస్ధాన్ లోని ఉదయ్ పూర్ లోనే ఉంటున్నాడు. ఇటీవల ఆమె అత్తమామలు వేధించటం మొదలు పెట్టారు. తనకు వేరొకరితో వివాహేతర సంబంధం ఉందని రాసివ్వాలని  డిమాండ్ చేస్తున్నట్లు కిరణ్ బాపూనగర్  పోలీసులకు  ఫిర్యాదు  చేసారు.తన భర్తకు మళ్లీ పెళ్లి చేయాలని అత్తమామలు  ప్రయత్నిస్తున్నారని ఆమె ఫిర్యాదులో ఆరోపించారు.  భూపేష్ గతంలో తన కుమార్తెను కూడా చంపేందుకు యత్నించాడని  పేర్కోన్నారు. పోలీసులు ఆమె భర్త, అత్త,మామలపై  గృహహింస  కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Related Posts