అక్రమ సంబంధం….సెల్ ఫోన్ ఛార్జర్‌తో ఉరి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

సెల్ ఫోన్ చార్జర్ తో ఉరి వేసి హత్యచేశాడు ఓ వ్యక్తి. తన భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే కోపంతో ఈ దారుణానికి ఒడి గట్టాడు. ఈ ఘటన విశాఖ జిల్లా పరవాడ మండలంలో జరిగింది.

పరవాడ మండలం హస్తినాపురం గ్రామానికి చెందిన ధర్మరాజు అనే వ్యక్తి ఫార్మా కంపెనీలో పని చేస్తుంటాడు. అతనికి మద్యం అలవాటు ఉంది. దిబ్బపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళ ఇంటికి వెళ్లి రోజు సారా తాగేవాడు. ఈ క్రమంలో వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది.

రోజూ కంపెనీలో డ్యూటీ ముగించుకుని, మహిళ ఇంటికి వెళ్లి సారా తాగడం…ఇద్దరూ కల్సి సమీపంలోని జీడి తోటలోకి రహస్యంగా వెళ్లి రాసలీలలు ఆడటం ఆనావాయితీ మారింది. కొన్నాళ్లకు ఈ విషయం ఆ మహిళ భర్త కుళ్లయ్య పసి గట్టాడు. అతనికి భార్య ప్రవర్తన మీద అనుమానం వచ్చింది. ఆమె పై నిఘా పెట్టాడు. వీరిద్దరి మధ్య అక్రమసంబంధం ఉందనేది ధృవ పరుచుకున్నాడు. సమయం కోసం వేచి చూశాడు.

ఎప్పటిలాగానే ఆగస్టు 2న ధర్మరాజు సారా తాగాటానికి మహిళ ఇంటికి వెళ్లాడు. సారా తెమ్మని చెప్పి ధర్మరాజు జీడిమామిడి తోటలోకి వెళ్ళాడు. ఆ మహిళ సారాయి తీసుకుని  తోటలోకి వెళ్ల్గింది. ఇదంతా గమనించిన కుళ్ళయ్య భార్యకు తెలీకుండా ఆమెను అనుసరించాడు.

అక్కడ ధర్నరాజుకి సారా పోసిన భార్య అతడితో కులకటం చూశాడు. వారిద్దరి రాసలీలలు చూసి పట్టలేని కోపంతో ధర్మరాజును చంపేశాడు. తన జేబులో ఉన్న సెల్ ఫోన్ చార్జర్ బయటకు తీసి ధర్మరాజు మెడకు బిగించాడు. ధర్మరాజు కుళ్ళయ్య  నుంచి విడిపించుకోటానికి  ప్రయత్నించాడు.

సారా తాగిన మత్తులో ఉన్న ధర్మరాజుకి వల్ల కాలేదు. వీరి అక్రమ సంబంధం పై కోపంతో ఉన్న కుళ్ళయ్య గట్టిగా నొక్కి పట్టి ఉంచటంతో… వైరు ధర్మరాజు మెడకు బిగుసుకు పోయింది. దీంతో ఊపిరాడక అక్కడికక్కడే మరణించాడు.

సమాచారం తెలుసుకున్న పోలీసులు ధర్మరాజు మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు,. పరారీలో ఉన్న కుళ్ళయ్యను అరెస్టు చేయగా హత్యకు గల కారణాలు వివరించాడు.

 

 

Related Posts