లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

పెళ్లయిన రెండేళ్లకే : భార్య, కూతురిని హత్య చేసి రైలు కింద పడి భర్త ఆత్మహత్య

కేంద్ర సంస్థలో ఉద్యోగం. మంచి జీతం. అందమైన భార్య. బంగారం లాంటి పాప.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఎవరూ ఊహించని దారుణం

Published

on

husband kills wife, daughter and commits suicide

కేంద్ర సంస్థలో ఉద్యోగం. మంచి జీతం. అందమైన భార్య. బంగారం లాంటి పాప.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఎవరూ ఊహించని దారుణం

కేంద్ర సంస్థలో ఉద్యోగం. మంచి జీతం. అందమైన భార్య. బంగారం లాంటి పాప.. ఇలా హ్యాపీగా సాగిపోతున్న ఆ కుటుంబం ఒక్కసారిగా చిన్నాభిన్నమైంది. ఎవరూ ఊహించని దారుణం జరిగింది. భార్య, కూతురిని దారుణంగా హత్య చేశాడు భర్త. ఆ తర్వాత రైలు కింద పడి భర్త కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. విశాఖలోని పోతినమల్లయ్య పాలెంలో ఈ దారుణం జరిగింది. ఒకే కుటంబంలో ముగ్గురి మృతితో వారి బంధువులు శోక సంద్రంలో మునిగిపోయారు.

వివరాల్లోకి వెళితే.. అతడి పేరు సుక్రజిత్. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ సీఐ) ఉద్యోగి. 2017 జనవరి 22న పెళ్లి చేసుకున్నాడు. 2018 నవంబర్ లో సుక్రజత్ దంపతులకు పాప పుట్టింది. ఫ్యామిలీ ఆనందంగా గడిచిపోతోంది. కాగా… ఇటీవల సుక్రజిత్ మద్యానికి బానిసగా మారాడు. పైగా ఆడపిల్ల పుట్టిందని భార్యను శారీరకంగా, మానసికంగా వేధించేవాడు. అలా కుటుంబంలో కలహాలు మొదలయ్యాయి. ఆ గొడవలు కాస్తా పెద్దవి అయ్యాయి. తరచూ భర్త వేధించడంతో తట్టుకోలేకపోయిన భార్య టీవల పుట్టింటికి వెళ్లింది. అయితే… తల్లిదండ్రులు ఆమెకు నచ్చచెప్పి భర్త దగ్గరికి పంపించారు. కాగా.. సెప్టెంబర్ 19న సుక్రజిత్ దారుణానికి ఒడిగట్టాడు. భార్యని దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అనంతరం కుమార్తెను ఊపిరాడకుండా చేసి చంపేశాడు. తర్వాత అక్కడి నుంచి పరారయ్యాడు. తన తల్లికి ఫోన్ చేసిన సుక్రజిత్.. నీ కోడలు, మనవరాలిని చంపేశానని తెలిపాడు. అనంతరం ఒడిశా వెళ్లిన సుక్రజిత్ అక్కడ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఈ ఘోరం స్థానికులను షాక్ కి గురి చేసింది. భార్య, కూతురిని భర్త హత్య చేశాడని తెలిసి భయాందోళన చెందారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇరు కుటుంబాలకు చెందిన వారిని ప్రశ్నిస్తున్నారు. సుక్రజిత్ ఇలా చేసి ఉండాల్సింది కాదని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరు అయ్యారు. తమ కూతురిని తమ దగ్గరే పెట్టుకుని ఉంటే ప్రాణాలతో ఉండేదని ఆమె తల్లిదండ్రులు విలపించారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *