రాక్షసుడు : డంబెల్ తో కొట్టి భార్యను హత్య చేయబోయిన ఆర్టీసి ఉద్యోగి

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కాకినాడ రూరల్ మండలం కొవ్వూరులో దారుణం జరిగింది. తాళి కట్టిన భార్యని  డంబెల్ తో కొట్టి చంపబోయాడు కాకినాడకు చెందిన ఆర్టీసీ ఉద్యోగి శ్రీను. డంబెల్‌తో భార్యను కొట్టే ముందు శ్రీను….. కుమార్తెను 100కు ఫోన్ చేసుకో అని చెపుతూ భార్య తలపై డంబెల్‌తో కొట్టాడు. తీవ్ర గాయాల పాలైన మాధవి ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
కొంతకాలంగా భార్య మాధవిని శ్రీను వేధిస్తున్నాడు. భర్త వేధింపులు తట్టుకోలేని మాధవి ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు పెడితే ఆర్టీసీలో డ్రైవర్ ఉద్యోగం పోతుందని పెద్దలు నచ్చజెప్పడంతో.. మాధవి ఫిర్యాదును వెనక్కి తీసుకుంది. అప్పటి నుంచి ప్రతి రోజూ మద్యం సేవించి భార్యతో పాటు కుమార్తెలను శ్రీను వేధిస్తున్నాడు.

కోడలికి దెయ్యం పట్టింది అందుకే పోలీస్ కేసులు పెడుతోందంటూ భూతవైద్యుడితో పూజలు


బ్లూ ఫిలిమ్స్ తెచ్చి కుమార్తెలతో శ్రీను అసభ్యంగా ప్రవర్తించాడు. తండ్రి తీరుతో కుమార్తెలు విసిగిపోయారు. భర్త డంబెల్ తో కొట్టి చంపే ప్రయత్నం చేశాడని కేసు నమోదు చేయమని మాధవి ఇంద్రపాలెం పోలీసుస్టేషన్ ఎస్ఐకు ఫిర్యాదు చేయబోగా ఎస్సై పట్టించుకోకుండా మాధవిపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఎస్సై కేసు నమోదు చేయకపోవటం పట్ల పలు అనుమానాలువ్యక్తం అవుతున్నాయి.


భర్త ద్వారా తనకు తన పిల్లలకు ప్రాణహాని ఉందంటున్న బాధితురాలు మాధవి…. గతంలో ఏం జరిగిందో వివరించింది. శ్రీను తో మాధవికి 20 ఏళ్లక్రితం పెళ్లయ్యింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. పెళ్లైన నాటినుంచి చిన్నా చితకా గొడవలు వస్తూనే ఉన్నాయి. సంసారంలో గొడవలు సహజమే సర్దుకుపొమ్మని పెద్దలు చెప్పటంతో అప్పటి నుంచి మాధవి శ్రీను ఆగడాలు భరిస్తూ పిల్లలకోసంకాపురం చేస్తున్నట్లు తెలిపింది.

కానీ గత మూడేళ్లనుంచి శ్రీను సైకో లా వ్యవహరిస్తున్నాడని మాధవి ఆవేదన వ్యక్తంచేసింది. తనని చంపి వేరే పెళ్లిచేసుకోవాలనే ఉద్దేశ్యంతో శ్రీను ఉన్నట్లు మాధవి ఆరోపించింది. విడాకులిచ్చేసి వెళ్పిపొమ్మని  బెదిరించేవాడని…. పిల్లలతో అసభ్యంగా ప్రవర్తించటం…ఇంట్లో అసభ్య పదజాలం వాడటం…. పోర్న్ వీడియోలు పిల్లలకు చూపిస్తూ రాక్షసానందం పొందేవాడని మాధవి చెప్పింది.10 ఏళ్ల క్రితం మాధవి పిన్ని కూతురైన మైనర్ బాలిక పై అత్యాచారం చేశాడని బాధితురాలు తెలిపింది. ఆ ఘటనకు సంబంధించి పోలీసు కేసు పెట్టారని… అది మనసులో పెట్టుకుని అప్పటినుంచి,  నన్నూ, పిల్లల్ని కొట్టటం, తిట్టటం వంటి దారుణాలు చేస్తున్నాడంది మాధవి.

2019 లో ఒకసారి మాధవి, ఆమె ఇద్దరు కూతుళ్లమీద కూడా కత్తితో దాడిచేసి చంపబోయాడని వివరించింది. ఈ ఘటనపై పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పెద్దలు మరోసారి రాజీ కుదిర్చారు.ఈ క్రమంలో గత శుక్రవారం సెప్టెంబర్ 3వ తేదీన వచ్చి నిన్ను చంపేస్తానని… నువ్వు చచ్చిపోతే ఈ ఇల్లు నాకే వస్తుందని…. నేను మళ్లీ పెళ్ళి చేసుకుని ..కొడుకుని కంటానని ఆమెను బెదిరించాడు. సమీపంలోని డంబుల్స్ తీసి…108 అంబులెన్స్ కు ఫోన్ చేయ్ అని కూతురుకు  చెప్పి భార్య తలపై డంబుల్స్ తో బలంగాకొట్టాడు.

READ  ప్రధాని మోడీ, యూపీ సీఎం యోగి వారి భార్యలతోనే వెళ్లి పూజలు చేస్తున్నారా? కొడాలి నాని

దీంతో మాధవి కళ్లు తిరిగి పడిపోయింది. బార్యను కొట్టిన శ్రీను అనంతరం ఇంట్లో గ్యాస్ లీక్ చేసి పరారయ్యాడు. కూతుళ్లు మేనమామకు ఫోన్ చేయగా వారు వచ్చి మాధవిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మాధవి తలకు 12 కుట్లు పడ్డాయి.ఈ ఘటనపై మరో సారి మాధవి ఇంద్రపాలెం పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.కాగా ఈకేసులో పోలీసులు ఎఫ్ ఐఆర్ నమోదు చేయకుండా…భర్తతో రాజీ చేసుకోమని పోలీసులు వత్తిడి తెస్తున్నారని ఆమె తెలిపింది. భర్త నుంచి తనకు,తన పిల్లలను రక్షించాలని…భర్త ద్వారా మాకు ప్రాణహాని ..మమ్మల్ని రక్షంచమని మాధవి వేడుకుంది.

Related Posts