భార్యతో విబేధాలు….హత్య చేసేందుకు సుపారీ ఇచ్చిన భర్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Husband paid supari for Wife”s Murder : భార్యతో గొడవపడి వేరుగా ఉంటున్న భర్త….. భార్యను హత్య చేయటానికి కిరాయికి మనుషులను ఏర్పాటు చేసాడు. సమాచారం పసిగట్టిన పోలీసులు ఒక మహిళ హత్యను ఆపగలిగారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గోదావరి ఖనికి చెందిన వేముల అశోక్. ఇల్లెందు కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గా పనిచేసే రజిత ఇద్దరూ దంపతులు. వీరిద్దరికీ మనస్పర్ధలు వచ్చి కుటుంబ కలహాల కారణంగా వేరు వేరుగా జీవిస్తున్నారు. కానీ భార్య మీద రాన్రాను పగ పెంచుకున్నాడు.


ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, ఎవరికి వారే గొంతు కోసుకున్నాం.. దివ్య తేజస్విని హత్య కేసులో మరో ట్విస్ట్


ఎలాగైనా భార్యను అంతమొందించాలని ప్లాన్ చేశాడు. ఇందుకోసం ఖమ్మం జిల్లా నేల కొండపల్లి కి చెందిన భూక్య వీరబాబు, కొత్తూరి ప్రసాద్ అనే ఇద్దరితో భార్యను హత్య చేయటానికి డీల్ మాట్లాడుకొని వారికి సుపారీ ఇచ్చాడు. ఇందులో భాగంగా వారికి రూ.3 లక్షలు ఇచ్చి తన భార్యను హత్యచేసి రమ్మని చెప్పాడు.

రజిత ను హత్యచేయటానికి నిందితులు ప్రయత్నిస్తున్నారని తెలుసుకున్న  ఇల్లందు సీఐ రమేష్ తన సిబ్బందితో నిందితులిద్దరినీ అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి కత్తులను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు.Related Tags :

Related Posts :