కట్నం కోసం భార్యకి నిప్పంటించాడు……సెల్ఫీ వీడియోతో దొరికిపోయిన భర్త

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. అయినా భార్య నుంచి కట్నం ఆశించాడు. భార్య కుటుంబం నుంచి ఎటువంటి ఆర్దిక లాభం చేకూరదని తెలుసుకున్నాడు. పెళ్లైన రెండు నెలలకే ఆమెను కాటికి పంపించాలనుకున్నాడు కిరాతక భర్త. కానీ భార్య తీసిన సెల్ఫీవీడియోతో చేసిన నేరం వెలుగులోకి వచ్చింది.

తమిళనాడులోని  పుదుచ్చేరి లోని వన్నూరులో నివాసం ఉండే జీవా(21), నైనార్ పాళ్యంలో ఉండే రాజేశ్వరి(18) మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుని ఇంట్లో చెప్పారు. రాజేశ్వరి కుటుంబ సభ్యులు వీరి పెళ్లిని వ్యతిరేకించారు. దీంతో వీరిద్దరూ జూన్ 3న పెళ్ళి చేసుకుని కాపురం పెట్టారు. పెళ్ళయ్యాక కూతురు కోసం వాళ్ళే వస్తారు. తనకు డబ్బు ముట్టచెపుతారని జీవా ఆశించాడు. అయినా వాళ్లేమి పట్టించుకోలేదు.తనకు అత్తమామల నుంచి కట్నకానుకలు ఏవీ రాకపోవటంతో జీవా మనస్తాపం చెందాడు. కట్న కానుకల విషయమై రాజేశ్వరి తల్లి తండ్రులను అడిగినా వారు స్పందించలేదు. దీంతో జీవా రాజేశ్వరితో గొడవ పడటం మొదలెట్టాడు. ఆగస్టు3, సోమవారం రాత్రి కూడా వారిద్దరి మధ్య గొడవ జరిగింది. ఘర్షణ తీవ్రమయ్యింది. జీవా తన భార్యపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు.ఈ విషయం ఎవరికైనా చెపితే ఆమ తండ్రి, సోదరుడిని చంపుతానని బెదిరించాడు. తానే ఆత్మహత్య చేసుకున్నానని చెప్పమని సలహా ఇచ్చాడు. అత్తమామలకు ఫోన్ చేసి తన భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుందని చెప్పి ఏడ్చాడు. 80 శాతం కాలిన గాయాలతో ఉన్న రాజేశ్వరిని పుదుచ్చేరి లోని ఆస్పత్రిలో చేర్పించాడు.ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్న రాజేశ్వరి సెల్ప్ వీడియో తీసి తల్లి తండ్రులకు పంపింది. భర్త జీవా నాపై కిరసనాయిల్ పోస నిప్పంటించాడని. ఎవరికీ చెప్పద్దని బెదిరించాడని ఆ వీడియోలో బాధితురాలు వాపోయింది. ఇప్పడు ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావటంతో వన్నూరు పోలీసులు జీవా మీద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రాజేశ్వరి ఆస్పత్రిలో చికిత్సపొందుతోంది.


Related Posts