US deaf man files petition against porn websites in new york

భార్య నగ్న చిత్రాలు, ఫోన్ నెంబర్ పోర్న్ సైటులో పెట్టిన భర్త.. భార్యను వదిలించుకోవడానికి దురాఘతం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

జీవితాంతం తోడుగా ఉంటానని మాటిచ్చాడు. ఏ కష్టం రాకుండా చూసుకుంటానని వాగ్దానం చేశాడు. గుండెల్లో పెట్టుకుని చూసుకుంటానని చెప్పి అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయి మూడేళ్లు అయ్యిందో లేదో అప్పుడే ఆ భర్త మారిపోయాడు. పరాయి స్త్రీ మోజులో పడిన అతడు, ప్రేమించి పెళ్లాడిన భార్యను వదిలించుకోవడానికి దారుణానికి ఒడిగట్టాడు. భార్య నగ్నచిత్రాలను, ఫోన్ నెంబర్ ని పోర్న్ సైట్ లో అప్ లోడ్ చేశాడు ఆ నీచుడు.

మరో మహిళతో అక్రమ సంబంధం:
అతడి పేరు సునీల్. ముంబైలో ఫైవ్ స్టార్ హోటల్ లో మేనేజర్ గా పనిచేస్తున్నాడు. సునీల్ మూడేళ్ల క్రితం తాను ప్రేమించిన నైనాని పెళ్లి చేసుకున్నాడు. అయితే ఏడాదిగా సునీల్ లో మార్పు వచ్చింది. తాను పని చేసే హోటల్ లో మరో యువతితో పరిచయం ఏర్పడింది. అది కాస్తా వివాహేతర సంబంధానికి దారి తీసింది. వీరిద్దరి గురించి తెలుసుకున్న సునీల్ భార్య వారిని నిలదీసింది. అయినా మార్పు రాకపోవడంతో పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో భార్య నైనాపై సునీల్ కక్ష పెంచుకున్నాడు. ఆమె పరువు తీసేందుకు, వదిలించుకునేందుకు ఓ ప్రణాళిక రచించాడు.

భార్య నగ్నచిత్రాలు, ఫోన్ నెంబర్ పోర్న్ సైటులో పెట్టాడు:
గతంలో భార్య నైనాతో సన్నిహితంగా ఉన్న ఫొటోలను వ్యభిచార వెబ్ సైట్ లో అప్ లోడ్ చేశాడు. ఆమె ఫోన్ నెంబర్ కూడా కూడా పెట్టాడు. దీంతో నైనాకు వరుసగా విటుల నుంచి కాల్స్ రావడం మొదలయ్యాయి. షాక్ తిన్న నైనా వెంటనే పోలీసులను ఆశ్రయించింది. సైబర్ క్రైం పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టారు. అసలు నిందితుడు భర్త సునీల్ అని పోలీసులు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సునీల్ ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

కట్టుకున్న భర్తే తనను వదిలించుకోవడానికి ఇంతటి దురాఘతానికి పాల్పడినట్టు తెలుసుకుని భార్య నైనా షాక్ కి గురైంది. కన్నీరుమున్నీరుగా విలపించింది. భర్తను కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. ఏ భార్యకు ఇలాంటి దుస్థితి రాకూడదని వాపోయింది.

Related Posts