లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

హైదరాబాద్‌లో నెలకోసారి అల్లర్లు, కర్ఫ్యూ.. ఇప్పుడా పరిస్థితి లేదు

Published

on

Hushar Hyderabad With KTR Event: ఆరేళ్లుగా హైదరాబాద్‌ ఎంతో ప్రశాంతంగా ఉందన్నారు మంత్రి కేటీఆర్‌. ఎలాంటి మత ఘర్షణలు, ప్రాంతీయ విభేదాలు లేవన్నారు. తాను చదువుకునే రోజుల్లో హైదరాబాద్‌లో కర్ఫ్యూల కారణంగా సెలవులు వచ్చేవని గుర్తు చేశారు మంత్రి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అరగంట కూడా కర్ఫ్యూ పెట్టలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 24గంటలు నాణ్యమైన విద్యుత్‌ను అందిస్తున్నామని చెప్పారు మంత్రి.

వ్యాపార వర్గాలతో హుషార్ హైదరాబాద్:
బుధవారం(నవంబర్ 25,2020) లోయర్ ట్యాంక్ బండ్‌లోని మారియట్ కన్వెన్షన్ సెంటర్‌లో వ్యాపార వర్గాలతో నిర్వహించిన ‘హుషార్ హైదరాబాద్’ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్సీ దయానంద్ గుప్త, టూరిజం కార్పోరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, పోలీసు హౌజింగ్ కార్పొరేషన్ చైర్మన్ దామోదర్ గుప్తా, హ్యాండ్ క్రాఫ్ట్ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్ చైర్మన్‌ సంపత్ కుమార్ గుప్తా పలువురు వ్యాపారులు పాల్గొన్నారు.

హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలు:
కోవిడ్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ, వాణిజ్యం దెబ్బతిందని కేటీఆర్ అన్నారు. కోవిడ్ ప్రభావం అన్ని రంగాల మీద పడిందని, నష్టపోయిన వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు కేటీఆర్. ముఖ్యమంత్రి సహాయనిధిని నగరంలో నష్టపోయిన చిన్న పరిశ్రమలకు కూడా అందిస్తామని అన్నారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని, హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్:
కేంద్ర ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌’ పథకం కింద ఎంత మందిని ఆదుకుందో తెలియదని మంత్రి కేటీఆర్ అన్నారు. డీ మానిటైజేషన్ వల్ల చిరు వ్యాపారులు ఎన్నో కష్టాలు పడ్డారని గుర్తు చేశారు. గతంలో పవర్ లేక చిరు వ్యాపారులు చాలా ఇబ్బందులు పడేవారని, కరెంట్ కోసం ధర్నాలు కూడా చేశారని కానీ ఇప్పుడు పరిస్థితిని పూర్తిగా మార్చామన్నారు. తెలంగాణ వచ్చాక 24 గంటలు విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. జిల్లాల్లోనూ ఇన్వెస్ట్ చెయ్యాలని వ్యాపారవేత్తలను కోరుతున్నామని, ఆగ్రో ప్రొస్సేసింగ్ ఇండస్ట్రీకి మంచి డిమాండ్ ఉందన్నారు. పాడి పరిశ్రమల్లో మనం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, వరి, పప్పు ధాన్యాలు బాగా పండుతున్నాయన్నారు. వివిధ జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీలను నెలకొల్పేలా చూస్తామని కేటీఆర్‌ అన్నారు.

సిటీలో నెలకోసారి అల్లర్లు జరిగేవి:
సిటీలో తన చిన్నతనంలో నెలకోసారి అల్లర్లు జరిగేవని, స్కూల్స్, పరిశ్రమలు బంద్ చేయించేవారన్నారు. దాని వల్ల విద్యార్థులతో పాటు వ్యాపారులు ఇబ్బంది పడ్డారని గుర్తుచేశారు. ఇప్పుడు సిటీలో అల్లర్లు చెలరేగకుండా చూస్తున్నామని, శాంతి భద్రతలు అదుపులోకి తెచ్చామని చెప్పారు. హైదరాబాద్‌ని అభివృద్ధి పథం వైపు తీసుకెళ్తున్నామని, సిటీ శివారుల్లో కొత్తగా వస్తున్న టౌన్ షిప్ లకు రోడ్లు వేస్తున్నామని తెలిపారు. ఏరో స్పేస్ ఇండస్ట్రీ, లైఫ్ సైన్స్, ఫార్మా, ఐటీ ని హైదరాబాద్‌కి తీసుకొచ్చామని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్‌తో పాటు టూటైర్ సిటీల్లోనూ ఇండస్ట్రీలను నెలకొల్పేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. నగరంలో అందుతున్న వైద్యం, విద్య, ఉద్యోగ అవకాశాలను జిల్లాల్లోనూ కల్పిస్తున్నామని తెలిపారు.

అమెజాన్ లాంటి సంస్థలు, ఆన్ లైన్ వ్యాపారాల వల్ల చిన్న సంస్థలు దెబ్బతినవు:
లాక్ డౌన్ లో సీఎంఆర్ఎఫ్ నిధికి భారీగా విరాళాలు వచ్చాయని కేటీఆర్ తెలిపారు. మానవీయ కోణంలో పెద్ద ఎత్తున పేదలను ఆదుకున్నామని చెప్పారు. ఆత్మనిర్భర్ అభియాన్ కింద కేంద్రం రూ.20లక్షల కోట్లు కేటాయిస్తే ఎంతమందికి సాయం అందిందో తెలియదన్నారు. ఈ ఆరేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. హైదరాబాద్ లో అభివృద్ధి వికేంద్రీకరణ సాగుతోందన్నారు. ఉప్పల్ ప్రాంతంలో 5 ఐటీ పార్కులు, శిల్పారామం, మెట్రో రైలు ప్రాజెక్టుకు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగ, ఉపాధి కల్పన లక్ష్యంగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నామని చెప్పారు. అమెజాన్ లాంటి సంస్థలు, ఆన్ లైన్ వ్యాపారాల వల్ల చిన్న సంస్థలు దెబ్బ తినవని కేటీఆర్ చెప్పారు. తెలంగాణలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయన్న కేటీఆర్ ఏ వర్గం పట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వివక్ష లేదన్నారు.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *