పుట్టినరోజునాడు పులిని దత్తత తీసుకున్న 12 ఏళ్ల పిల్లాడు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

పుట్టినరోజు వస్తోందంటే చాలు పిల్లలు తెగ సంబరపడిపోతారు. అదే 10 ఏళ్ల దాటినవాళ్లైతే..కొత్త బట్టలు కొనుక్కోవాలి.. కేకు ఏ ఫ్లేవర్ కొనుక్కోవాలి..చాక్లెట్లు కొనాలి..ఫ్రెండ్స్‌ను పిలవాలి..అని ప్లాన్స్ వేసేసుకుంటుంటారు. లేదా డాడీ నా బర్త్ డేకి ఏ గిఫ్టు ఇస్తావ్..మమ్మీ నా బర్త్ డేకి ఏమేమి వండుతావ్ అని అడుగుతారు. కానీ ఓ 12 ఏళ్ల పిల్లాడుమాత్రం తన వయస్సు మించి ఆలోచించాడు. గొప్ప మనస్సు చూపించాడు.


తన పుట్టిన రోజు నాడు ఓ పులిని దత్తత తీసుకున్నాడు. హైదరాబాద్ కు చెందిన చిన్మయి సిద్ధార్త్ అనే పిల్లాడు నెహ్రూ జులాజికల్ పార్క్ లోని రాయల్‌ బెంగాల్‌ టైగర్‌ను మూడు నెలలపాటు దత్తత తీసుకున్నాడు. దత్తత తీసుకోవటం అంతే దానికి అయ్యే..పోషణకు అయ్యే మొత్తం ఖర్చును భరించడం అన్నమాట. అది తినే తిండి నుంచి అన్నీ ఖర్చులు భరించటం. బాధ్యత వహించటం.


హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థ్‌ షా 7th class తరగతి చదువుతున్నాడు. తన బర్త్ డే రోజున నెహ్రూ జువాలాజికల్‌ పార్కుకు తన ఫ్యామిలీతోను..ఫ్రెండస్ తో కలిసి వెళ్లాడు. అక్కడ ఉండే ‘సంకల్ప్‌’ అనే రాయల్ బెంగాల్ టైగర్‌ను చూసి సిద్ధార్థ చాలా ముచ్చటపడ్డాడు. డాడీ దాన్ని మనం దత్తత తీసుకుందామని అదే నా బర్త్ డేకి మీరు నాకిచ్చే గిఫ్ట్ అని కోరాడు.


దానికి వాళ్ల నాన్న కాంటి లాల్ షాతోఅంగీకరించటంతో సిద్ధార్థ తెగ ఆనందపడిపోయాడు. అదే విషయాన్ని జూ క్యూరేటర్ అధికారుల దగ్గరకెళ్లి చెప్పారు. ‘సంకల్ప్’ను దత్తత తీసుకుంటామని చెప్పారు. రూ.25 వేల చెక్కును ఇచ్చారు. ఫార్మాలిటీస్ అన్నీ పూర్తి చేసుకున్నారు. సిద్ధార్థ్ చేసిన పనికి అతనితో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా స్ఫూర్తి పొంది ఇద్దరు విద్యార్థులు హర్విషా జైన్, విహాన్ అతుల్ జైన్, మరో ముగ్గురు అక్కాచెల్లెళ్లు ప్రేక్ష, ప్రియాల్, భక్తి నాగ్డా కూడా కొన్ని జంతువులు, పక్షులను దత్తత తీసుకున్నట్లు జూ అధికారులకు చెప్పారు.


వీరు ఒక్కొక్కరు రూ.5 వేల చెక్కును అధికారులకు అందజేశారు. వన్య ప్రాణుల పట్ల విద్యార్థులు చూపిస్తున్న ఇష్టం..శ్రద్ధ చూసిన అధికారులు వారిని ప్రశంసించారు. దత్తతకు ముందుకు రావడంపై నెహ్రూ జంతు ప్రదర్శనశాల డిప్యూటీ క్యూరేటర్ ఆనందం వ్యక్తం చేస్తూ అభినందనలు తెలిపారు.

Related Posts