లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీంసినిమాOTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime

విడాకులివ్వమని భార్యను వేధిస్తున్న ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్

Published

on

Hyderabad based trainee ips maheshwar reddy suspended by home ministry

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర రెడ్డి భార్య భావన ఫిర్యాదు మేరకు కేంద్రం ఈనిర్ణయం తీసుకుంది.

ఏడాదిన్నర క్రితం మహేశ్వర్ రెడ్డి, భావన ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కీసర రిజిస్ట్రార్ కార్యాలయంలో వారిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు ఆధారాలు కూడా ఆమె చూపించింది. మహేశ్వర్‌రెడ్డి ఐపీఎస్కి సెలక్ట్ అయ్యాక డబ్బు మీద ఆశతో వేరే పెళ్లికి సిద్ధమయ్యాడని, విడాకులు ఇవ్వాలంటూ బెదిరించాడని భావన తన ఫిర్యాదులో తెలిపింది.
 

ఎక్కువ కట్నం వస్తుందని, తనకు విడాకులివ్వాలని మహేశ్వర్‌రెడ్డి వేధిస్తున్నాడని భావన ఆరోపించింది. మహేశ్వర్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని గతంలోనే పోలీసులకు, కేంద్ర హోంశాఖకు భావన ఫిర్యాదు చేసింది. జవహర్‌నగర్ పీఎస్‌లో భావన ఫిర్యాదు మేరకు మహేశ్వర్‌రెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది.

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *