మెట్రో పట్టాలెక్కేసింది.. స్కూల్స్ లాక్ తీస్తున్నారు.. వాట్ నెక్ట్స్!

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

మెట్రో పట్టాలెక్కేసింది.. రైల్వే సర్వీసులు కూడా పెంచారు. స్కూల్స్ కూడా లాక్ తీస్తున్నారు.. థియేటర్లు కూడా ఓపెన్ అయిపోతాయ్. ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ ఈవెంట్స్ కూడా స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే.. యూఎస్ ఓపెన్ హంగామా స్టార్ట్ అయ్యింది. మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతోంది.

6 నెలల కిందట చాలా భయపడ్డాం.. ఇప్పుడు నెమ్మదిగా కరోనా సంక్షోభం నుంచి బయటపడుతున్నాం. అబ్‌నార్మల్ నుంచి.. న్యూ నార్మల్‌లోకి వచ్చేశాం.. కరోనా వ్యాక్సిన్ కూడా లాస్ట్ స్టేజ్‌కి వచ్చేసింది.. మరి.. ఆఫ్టర్ సిక్స్ మంత్స్… దేశంలో సిచ్యువేషనేంటి? అదేంటో తెలుసుకుందాం..ఇండియాలో కరోనా కేసులు తగ్గలేదు.. పైగా.. రోజుకో రికార్డ్ క్రియేట్ అవుతోంది. భయం పూర్తిగా పోయిందని కాదు.. కానీ.. ఇంతకుముందు ఉన్నంత మాత్రం లేదు. పబ్లిక్‌కి కూడా కరోనా అలవాటైపోయింది. దేశం మొత్తం.. మార్చి నుంచి ఆగస్ట్ చివరి దాకా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు అనుభవించింది. కానీ.. ఇప్పుడిప్పుడే ఇండియా కరోనా సంక్షోభం నుంచి బయటకొస్తోంది. తిరిగి కోలుకుంటోంది. సాధారణ జీవితానికి అలవాటుపడుతోంది.

కానీ.. దేశంలో ఇప్పుడు సీన్ మారిపోయింది.. ఇండియా మొత్తం ఇప్పుడిప్పుడే కరోనా సంక్షోభం నుంచి బయటకొస్తోంది. భయమైతే ఉంది.. కానీ.. ఆ భయంలో మార్చి నాటి తీవ్రత లేదు. కరోనా సోకితే.. ఇక అంతే అన్న అభిప్రాయం లేదు. ఇప్పుడంతటా వైరస్ సోకితే ఏం చేయాలన్న దానిపై.. అందరికీ ఓ అవగాహన వచ్చేసింది.

పాజిటివ్ అని తేలితే.. చాలా పాజిటివ్‌గా తీసుకుంటున్నారు. సెల్ఫ్ ఐసోలేషన్‌లోకి వెళ్లిపోతున్నారు. ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నారు. క్వారంటైన్ ముగిశాక.. మళ్లీ నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఇప్పుడు కరోనా అంటే ఇంతే. అలాగనీ.. పూర్తిగా భయం పోయిందని కాదు. వైరస్ సోకకుండా.. ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలో అన్నీ తీసుకుంటున్నారు. అదృష్టం బాగోలేక.. వైరస్ సోకితే.. భయపడకుండా.. సాధారణ జ్వరం వచ్చినట్లే ఫీలవుతున్నారు.కరోనా కేసుల్లో.. ఇండియా ఇప్పుడు ప్రపంచంలోనే నెంబర్-2 పొజిషన్‌కి వెళ్లిపోయింది. కానీ.. జనంలో అంత భయమేమీ కనిపించడం లేదు. 6 నెలలుగా.. అందరికీ పరిస్థితులు అలవాటైపోయాయ్. అబ్ నార్మల్ నుంచి.. న్యూ నార్మల్ లోకి వచ్చేస్తున్నారు.

ఒక తీవ్ర సంక్షోభం చూశాక.. ప్రాణాలు దక్కితే చాలు అనే ఆలోచన నుంచి.. ఇంతకు ముందెప్పుడూ కనని.. వినని.. పరిస్థితుల నుంచి.. ఇప్పుడంతా మళ్లీ సాధారణ జీవితంలోకి వచ్చేశారు. ఎవరి పనులు వాళ్లు చేసుకుంటున్నారు. మెతుకు కావాలన్నా.. బతుకు సాగాలన్నా.. ఇంటి నుంచి బయటకు రావాల్సిందేనని డిసైడ్ అయ్యారు. కరోనా వైరస్.. ఇప్పట్లో ముగిసే విషయం కాదని మైండ్‌లో ఫిక్స్ అయ్యారు. నెమ్మదిగా.. ఇబ్బందికర పరిస్థితుల నుంచి బయటకొస్తున్నారు. భారత్‌లో.. తొలి కరోనా కేసు మార్చిలో బయటపడింది. ఇక.. అప్పటి నుంచి ఆగస్ట్ చివరిదాకా దేశం మొత్తం చాలా ఇబ్బందులు పడింది. రోజురోజుకు పెరుగుతున్న కేసుల కౌంట్ చూసి.. అంతా హడలిపోయారు. కరోనా పేరు వింటేనే జడిసిపోయారు.దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించాయ్. ఇంతకు ముందెప్పుడూ చూడని పరిస్థితి ఇది. విదేశాల్లో అమలవుతుంటే.. పేపర్లలో వార్తలు, టీవీలో న్యూస్ చూసి అంతా ఏమో అనుకున్నారు. కానీ.. ఇండియాలో లాక్ డౌన్ అనగానే అందరికీ మైండ్ బ్లాంక్ అయ్యింది. జనతా కర్ఫ్యూతో మొదలైన బంద్.. లాక్ డౌన్‌తో నెలలపాటు కొనసాగింది. అన్నీ బంద్.. మీ ఇంట్లో మీరుండగానే.. మీరే తాళాలు వేసుకోని ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. కరోనా బారిన పడకుండా.. ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకుంటూ.. ఇంట్లో నుంచి కాలు బయటపెట్టకుండా మనల్ని మనమే కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్‌ అది. వాటన్నింటినీ దాటుకొని.. మళ్లీ కాలు బయటపెడుతున్నారు భారత ప్రజలు. భయాన్ని వీడి.. జాగ్రత్తలు పాటిస్తూ.. ఎవరికి వారు.. పరోక్షంగా కరోనాతో యుద్ధం చేస్తున్నారు.లాక్ డౌన్ స్టేజ్ నుంచి ఇండియా అన్ లాక్ దశలోకి వచ్చేసింది. అన్నీ.. ఒక్కొక్కటిగా ఓపెన్ అవుతున్నాయ్. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ.. ట్రాన్స్ పోర్ట్ కూడా మొదలైపోయింది. దుకాణాలు తెరచుకున్నాయ్. ఎవరి ఉద్యోగాలు వాళ్లు చేసుకుంటున్నారు. ఐటీ ఉద్యోగులు, ఇతర రంగాల ఎంప్లాయిస్ అంతా వర్క్ ఫ్రమ్ హోమ్‌లో బిజీ అయిపోయారు. గ్రామాల్లో రైతులు పొలంబాట పట్టారు. ఇలా.. ఎవరికి వారు.. ఎక్కడికక్కడ కరోనా నిబంధనలు పాటిస్తూ.. పనులు చేసుకుంటున్నారు. సేమ్ టైమ్.. స్వీయ జాగ్రత్తలు పాటిస్తున్నారు.మాస్కులు ధరించడం, శానిటైజర్లు వాడటం, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయడం, చేతులు కడుక్కోవడం లాంటివన్నీ.. ఇప్పుడు అందరి డైలీ లైఫ్‌లో రోటీన్ అయిపోయాయ్. కరోనా కారణంగా.. ఇవన్నీ మన సాధారణ జీవితంలో అలవాట్లుగా మారిపోయాయ్. కరోనా కారణంగా.. ఆరు నెలల పాటు ఉక్కిరిబిక్కిరైపోయిన ప్రజలు.. ఇప్పుడిప్పుడే మళ్లీ సాధారణ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు.

Related Tags :

Related Posts :