కుటుంబ సమస్యలతో కానిస్టేబుల్ ఆత్మహత్యాయత్నం

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

cop suicide attempt rescued by colleagues : పోలీసులు సకాలంలో స్పందించటంతో ఓ నిండు ప్రాణం బతికి బయటపడింది. కుటుంబ సమస్యలతో సూసైడ్ చేసుకున్న కానిస్టేబుల్ ని పోలీసులు వెంటనే గుర్తించి ఆస్పత్రిలో చేర్పించారు. హైదరాబాద్ చైతన్యపురి పోలీసు స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న నరేష్(2000 బ్యాచ్) అనే కానిస్టేబుల్ కుటుంబ సమస్యలతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని హయత్ నగర్ లోని ఇంటికి బయలు దేరాడు.స్టేషన్ నుంచి బయటకు వచ్చి …తనకు కుటుంబ సమస్యలు ఉన్నాయని.. తాను ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతున్నానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. అలర్టైన చైతన్యపురి పోలీసులు నరేష్ ను గడ్డి అన్నారం ఫ్రూట్ మార్కెట్ లో కనుగొన్నారు. అప్పటికే అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుని స్పృహ కోల్పోయాడు. వెంటనే ఇతర సిబ్బంది నరేష్ ను కొత్తపేటలోని ఓజోన్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
 


Related Tags :

Related Posts :