హైదరాబాద్ కరోనా కేసులు పెరగడానికి కారణమిదే

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

కరోనా పాజిటివ్‌ కేసులు హైదరాబాద్‌లో భారీగా పెరగడానికి కారణం ఏంటి? తెలంగాణలో మిగతా ప్రాంతాలతో పోల్చినప్పుడు… ఒక్క హైదరాబాద్‌లోనే ఎందుకు పెరుగుతున్నాయి? కేసులు పెరగడానికి ప్రత్యేక కారణం ఉందా? ఈ కారణం చేతనే సిటీలో పాజిటివ్‌ కేసులు దండిగా పెరుగుతున్నాయా?

హైదరాబాద్‌లో కోరలు చాస్తోన్న కరోనా మహమ్మారి కారణంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతుండడం ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా… వైరస్‌ అదుపులోకి రావడం లేదు. తెలంగాణలో నమోదయ్యే కేసుల్లో దాదాపు 80శాతం కేసులు హైదరాబాద్‌లో ఉన్నాయి.

కేసులు పెరగడానికి కారణం విటమిన్‌-డి లోపమేనని హైదరాబాద్‌ వాసులకు కరోనా.. సోకడానికి ఇదే కారణమని వైద్యులు చెబుతున్నారు. విటమిన్‌-డి లోటు ఉన్నవారు సులువుగా కోవిడ్‌ బారిన పడుతున్నారు. అంతేకాదు.. వారు కోవిడ్‌తో పోరాడలేకు మృత్యువాత పడుతున్నట్టుగా చెబుతున్నారు. నగరంలో ప్రతి వంద మందిలో 70 నుంచి 80 మందిలో విటమిన్‌ -డి లోపం ఉందని వివిధ సర్వేల్లో తేలింది.

విటమిన్‌-డి లోపం ఉన్నవారిలో రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. దీంతో వారికి వైరస్‌ ఎక్కువగా సోకే అవకాశముంది. సమృద్దిగా -డి విటమిన్‌ ఉన్నవారికి.. కరోనా వచ్చినా… త్వరగానే కోలుకుంటున్నట్టు అధ్యయనంలో తేలింది. సూర్యరశ్మి తగలకుండా ఇళ్లు, కార్యాలయాలకే పరిమితం అయ్యే నగరవాసుల్లో సుమారు 80శాతం మందిలో విటమిన్‌ -డి లోపం ఉంటుందని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.

సాధారణంగా రోగికి ఏదైనా వైరస్‌ సోకినప్పుడు సైటోకీన్స్ అనేవి సైనికుల్లా పనిచేసి శరీరంలోకి వచ్చిన శత్రువుల్లాంటి వైరస్‌లపై దాడిచేసి వాటిని నశింపచేస్తాయి. కానీ డి-విటమిన్‌ లోపం ఉన్నవారిలో.. రోగిని వైరస్‌ నుంచి కాపాడాల్సిన ఈ సైటోకీన్సే… ఎదురుదాడి చేసి శరీరంలోని ఇతర మూలకణాలను దెబ్బతీస్తాయి. దానివల్ల రోగిలో రక్త కణాలు దెబ్బతిని, గుండె, కిడ్నీలు, కాలేయంలాంటి ప్రధాన అవయవాలు విఫలమవుతాయి. ఇది జరగకుండా సైటోకీన్స్‌ అనేవి సక్రమంగా పనిచేయాలంటే విటమిన్‌ -డి ఎంతో అవసరం.

సాధారణంగా విటమిన్‌ -డి లోపం ఉంటే.. ఎముకలు, కండరాలు పటుత్వం కోల్పోతాయి. గుండె వ్యాధులు, శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. సూర్య కిరణాలతోపాటు చేపలు, గుడ్లు, వెన్న, పాలలాంటి వాటిల్లో ఈ విటమిన్‌ పుష్కలంగా ఉంటుంది. డి-విటమిన్‌ లోపం ఉన్నవారు క్రమం తప్పకుండా వైద్యుడి సలహామేరకు తక్కువ డోస్‌లో కొంతకాలంపాటు విటమిన్‌ -డి మాత్రలను వినియోగించడం మంచిది. రోజూ కనీసం అరగంట ఎండలో ఉంటే సహజంగా డి విటమిన్‌ లభిస్తుంది. సో బీ అలర్ట్‌..

Related Posts