hyderabad cp sensational comments

ఆర్టీసీ కార్మికులు మావోయిస్టులతో చేతులు కలిపారు : సీపీ సంచలన వ్యాఖ్యలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సీపీ అంజనీ

తెలంగాణ ఆర్టీసీ కార్మికులపై హైదరాబాద్ పోలీసులు సంచలన ఆరోపణలు చేశారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారని హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ అన్నారు. మావోయిస్టు అనుబంధ సంస్థలతో సంబంధాలు ఉన్నందునే చలో ట్యాంక్ బండ్ కు అనుమతి ఇవ్వలేదని వివరించారు. పోలీసుల నిషేధం ఉన్నా మావోయిస్టు సంఘాలతో కలిసి ఆర్టీసీ కార్మికులు పోలీసులపైకి రాళ్లు రువ్వారని సీపీ ఆరోపించారు. 

మావోలతో చేతులు కలపడం వల్లే ట్యాంక్ బండ్ పై విధ్వంసం జరిగిందన్నారు. ట్యాంక్ బండ్ పై రాళ్లు రువ్వింది వాళ్లే అని సీపీ చెప్పారు. మావోయిస్టుల ఎంట్రీపై అనుమానాలతోనే చలో ట్యాంక్ బండ్ కు పర్మిషన్ ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఆందోళనకారుల రాళ్ల దాడిలో ఏడుగురు పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయని సీపీ చెప్పారు. పోలీసులపై దాడి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామన్నారు.

నగర పోలీస్‌ కమిషనర్‌ ఆరోపణలను ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి ఖండించారు. ఆర్టీసీ కార్మికులు నిషేధిత మావోయిస్టు సంఘాలతో చేతులు కలిపారంటూ చేసిన వ్యాఖ్యలను ఆయన తోసిపుచ్చారు. ‘మావోయిస్టలు ఉన్నారంటూ అనవసర ఆరోపణలు చేసి సమ్మెపై ఉక్కుపాదం మోపాలని చూస్తున్నారు. మావోయిస్టులు ఉన్నారంటూ పోలీస్‌ కమిషనర్‌ అనడం దురదృష్టకరం. సీపీ మాటలు మమ్మల్ని బాధించాయి. చలో ట్యాంక్‌బండ్‌ కార్యక్రమంలో పాల్గొన్నదంతా కార్మికులే.

ఎన్ని నిర్బంధాలు ఎదురైనా చలో ట్యాంక్‌బండ్‌ విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. సహకరించిన రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలకు కృతజ్ఞతలు. పోలీసుల దమనకాండకు నిరసనగా నల్లబ్యాడ్జీలతో ఆదివారం(నవంబర్ 10,2019) బస్సు డిపోల ముందు నిరసన కార్యక్రమం చేపడతాం’ అని అశ్వత్థామరెడ్డి చెప్పారు.

Related Posts