లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

సరిగ్గా చదువుకోవట్లేదని కొడుకుపై టార్పెంటాయిల్ పోసి నిప్పు పెట్టిన తండ్రి

Published

on

Hyderabad father set fire to son : హైదరాబాద్ KPHBలో దారుణం చోటుచేసుకుంది. కొడుకుపై తండ్రి నూనె పోసి నిప్పు పోసి నిప్పు పెట్టాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనతో బాలుడికి తీవ్రంగా గాయాలు కావటంతో స్థానికులు హుటాహుటిని గాంధీ హాస్పిటల్ కు తరలించారు.

ఎన్నిసార్లు చెప్పిన కొడుకు చదవకుండా టీవీ చూస్తు, వీడియో గేములు ఆడుతూ టైమ్ వేస్టు చేస్తున్నాడని..తండ్రి కొడుకును తీవ్రంగా మందలించాడు. చదువుకోకుండా ఆటలాడావంటే ఊరుకునేది లేదని హెచ్చరించాడు. ఈ క్రమంలో గత రాత్రి తండ్రి ఇంటికొచ్చేసరికి 10 ఏళ్ల కొడుకు చరణ్ టీవీ చూస్తున్నాడు. అది చూసిన తండ్రి ఆగ్రహంతో ఊగిపోయాడు. విచక్షణ మరచిపోయాడు. ఇంట్లో ఉన్న టార్పెంటాయిల్ పోసి చరణ్‌పై పోసి నిప్పంటించాడు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలరం రేపింది.

కాగా స్థానిక గవర్నమెంట్ స్కూల్లో 6th క్లాస్ చదువుతున్న 10ఏళ్ల చరణ్ కరోనా కష్టంతో స్కూళ్లు మూసివేటయంతో ఇంటిలోనే ఉండటంతో టీవీ చూడడం, ఫోన్ తో గేమ్స్ ఆడడం అలవాటైంది. టీచర్లు అడపాదడపా ఆన్ లైన్ క్లాసులు చెబుతున్నా పట్టించుకోవటంలేదు. ఎన్నో సార్లు తల్లితండ్రులు చదువుకోమని నచ్చజెప్పారు. తండ్రి మందలించాడు. అయినా కూడా చరణ్ తన పద్ధతి మార్చుకోలేదు.

ఈ క్రమంలో ఆదివారం రాత్రి చరణ్ తండ్రి బాలు ఇంటికి వచ్చిన సమయంలో చరణ్ ఇంట్లో టివి చూస్తుండటంతో ఒక్కసారిగా కోపంతో రగిలిపోయాడు. ఆవేశంతో ఇంట్లోఉన్న టర్పెంటాయిల్ తీసుకొచ్చి చరణ్‌పై పోసి నిప్పంటించాడు. దీంతో అది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే చరణ్ ను హాస్పిటల్ కి తరలించారు. ప్రస్తుతానికి చరణ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.