Hyderabad Floods: బడా హీరోల భారీ విరాళాలు..

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hyderabad Floods: భారీ వర్షాలతో అతలాకుతలమవుతున్న ప్రజలను ఆదుకోవడానికి భారీ విరాళాలందిస్తూ తెరవెనుక కూడా హీరోలమని నిరూపిస్తున్నారు మన తెలుగు హీరోలు. తాజాగా తెలంగాణ సీఎం సహాయ నిధికి టాలీవుడ్ సినీ ప్రముఖులు వరుసగా విరాళాలు ప్రకటిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, సూపర్‌స్టార్ మహేష్ బాబు రూ.1 కోటి రూపాయలు, కింగ్ నాగార్జున, యంగ్ టైగర్ ఎన్టీఆర్ రూ. 50 లక్షలు, రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ రూ.10 లక్షలు, డైరెక్టర్ హరీష్ శంకర్ రూ.5 లక్షలు విరాళం ప్రకటించారు.

విపత్కర పరిస్థితుల్లో ప్రజలను ఆదుకోవడానికి సినీ పరిశ్రమ ఎప్పుడూ ముందుటుందని.. హైదరాబాద్ ప్రజలను ఆదుకోవడానికి సహృదయంతో విరాళాలు అందించిన వారందరికీ థ్యాంక్స్ అంటూ తెలంగాణ ఐటి మరియు అర్బన్ డెవలప్‌మెంట్ మినిస్టర్ కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

Related Tags :

Related Posts :