Hyderabad Gets relief as temperatures dip slightly

చల్లని వార్త : హైదరాబాద్ లో తగ్గుతున్న ఉష్ణోగ్రతలు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

హైదరాబాద్: గత కొన్ని రోజులుగా 43 డిగ్రీల సెల్సియస్ ని మించిన ఉష్ణోగ్రతలు క్రమేపీ తగ్గాయి. మంగళవారం నాడు (మే 12019) నాటికి తగ్గి 40 డిగ్రీ సెల్సియస్ కు చేరుకున్నాయి.
కాగా మే నెలలో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకూ చేరాయి. గత కొన్ని రోజుల నుంచి 41 డిగ్రీలకు తగ్గిపోయాయి. ఇలా మంగళవారం నాడు  నగరంలో పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సుమారు 40 డిగ్రీల వరకు తగ్గిపోయాయి.

శ్రీనగర్ కాలనీలో 41 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా..ఖైరతబాద్ 40.9 డిగ్రీల సెల్సియస్, బీహెచ్ఈఎల్ 40.9,  మైత్రివనం 40.8 గా ఉండగా..బేగంపెటలో సగటు ఉష్ణోగ్రత 40.3 డిగ్రీల సెల్సియస్స్గా నమోదయ్యాయి. ఈ వాతావరణం గత కొన్ని రోజుల్లో ఉష్ణోగ్రతలు 40-41 డిగ్రీ సెల్సియస్ గా నమోదవుతుందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది.

 

కాగా మే 15వ తేదీ నుండి బుధవారం నుండి మే 18 తేదీ శనివారం వరకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. వాయువ్య, ఉత్తర భారత ప్రాంతాల నుంచి పొడిగాలులు వీస్తున్నాయని తెలిపింది. దీంతో టెంపరేచర్స్ పెరుగుతున్నాయని, 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు రికార్డయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. రాత్రి వేళ సాధారణంగా కన్నా 4 డిగ్రీలు టెంపరేచర్స్ అధికంగా రికార్డవుతున్నాయి. వడగాల్పుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. వీలైనంత వరకు చల్లని ప్రదేశాల్లోనే ఉండాలని సూచించింది. 

Related Posts