Hyderabad has UV rays Very High

ప్రమాదకరంగా యూవీ కిరణాలు.. హైదరాబాద్‌లో వార్నింగ్ బెల్స్

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

భానుడు భగ భగ మండిపోతున్నాడు. ప్రచండ కిరణాలు భూమిపైకి వస్తున్నాయి. ఎండల మాటున అతినీలలోహిత కిరణాలు(UV rays) భూమి మీదకు వస్తున్నాయి. గత కొన్ని రోజులుగా వీటి ప్రభావం హైదరాబాద్‌లో తీవ్రంగా ఉందని ప్రపంచ పర్యావరణ సంస్థ (WEO) ఆందోళన వ్యక్తం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్‌లో ప్రస్తుతం యూవీ కిరణాల స్థాయి ప్రమాదంగా తయారైంది. వేసవి ఎండలు పంజా విసురుతుండగా.. మరో వారం రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని అంచనా వేశారు అధికారులు.   

యూవీ సూచికలను గమనిస్తే ప్రమాదకరంగా ఉందని WEO తాజాగా ప్రకటించింది. యూవీ కిరణాలు శరీరంపై పడితే అలర్జీలు, కళ్లకు సంబంధించిన సమస్యలు వస్తాయి. వేసవిలో చర్మ, కళ్ల సంబంధ సమస్యలతో డాక్టర్లను ఆశ్రయించేవారు ఎక్కువ అవుతున్నారని నిపుణులు చెబుతున్నారు. 

Read: నేడు, రేపు తెలంగాణలో వడగాల్పులు

Related Posts