లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Hyderabad

టీ అడిగిన మహిళా IPS..కప్పుతో ఫీట్లు చేసి నవ్వించిన ఛాయ్ వాలా

Published

on

Hyderabad chai Wala style sumathi ips  : తెలంగాణ ఉమెన్‌సేఫ్టీ వింగ్‌ డీఐజీ సుమతి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మహిళల భద్రత గురించి..తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి..ఆయా సమయాన్ని ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచనలిస్తూ..ఆమె చేసే పోస్ట్ లు ఎంతగా ఆకట్టుకుంటుంటాయి. ఈక్రమంలో సుమతి లేటెస్ట్ గా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఛాయ్ వాలా స్కిల్స్ చూసి సుమతి భలే నవ్వుకున్నారు. ఆమె టీ కప్ తీసుకోవటానికి యత్నిస్తుంటే ఆ చాయ్ వాలా మాత్రం ఆ కప్పు ఆమె అందుకోకుండా చేసిన ఫీట్లు చూస్తే వావ్ అనాల్సిందే..సాక్షాత్తూ డీఐజీ ముందే ఫీట్లు చేసిన ఆ ఛాయ్ వాలా ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే..

వీడియో వివరాల్లోకి వెళితే..డీఐజీ సుమతి ఇరానీ ఛాయ్ తాగడానికి ఓ షాపు దగ్గర ఆగారు. అప్పుడు ఆ ఛాయ్ వాలా మాత్రం ఆమె అడిగిన పనిచేయకుండా ఫీట్లు చేశారు. ఫాస్కులోంచి కప్ లోకి టీ పోసాడు. ఆ కప్ ను ఆమె తీసుకోవటానికి యత్నించారు. కానీ సాధ్యం కాలేదు. ఛాయ్ వాలా చేతిలో నుంచి టీ తీసుకోవాడానికి మహిళా ఐపీఎస్ నానా తంటాలు పడ్డారు.

ఆ టీ కప్ ను వేళ్లమీద ఆడిస్తూ ఫీట్లు చేశాడా ఛాయ్ వాలా. అలా ఫీట్లు చేస్తుండగా కప్ తీసుకోవటానికి సుమతి యత్నించారు.కానీ సాధ్యంకాలేదు. కానీ ఛాయ్ వాలా చేసిన ఫీట్లకు సుమతి నవ్వుకున్నారు. చివరికి ఎలాగైతేనే ఆ టీ కప్ తీసుకుని నవ్వుకుంటూనే తాగారామె. ఈ వీడియోను సుమతి తన ట్విట్టర్ లో పోస్ట్ చేయటంతో అదికాస్తా వైరల్ గా మారింది.

ఈ వీడియోకు డీఐజీ సుమతి ” ఇరానీ ఛాయ్ అతని స్టైల్ లో సర్వ్ చేశాడు. అలాగే..ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా ప్రమోట్ చేస్తున్నాడు” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియో నెటిజన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు. పోలీసులు ఇలా ఉంటే సమాజం ఎంతో బాగుంటుందని కామెంట్లు చేస్తున్నారు. మరి పోలిస్ డ్రెస్ లో కాకుండా సాధారణ డ్రెస్ లో ఉన్న ఆమెను మరి ఆ ఛాయ్ వాలా ఆమె డీఐజీ అని గుర్తించాడో లేదో..మరి గుర్తించే చేశాడో గానీ అలా తెలిసే చేసుంటే మాత్రం ఆ ఛాయ్ వాలా ధైర్యానికి మెచ్చుకోవాల్సిందే. సాక్షాత్తూ డీఐజీ ముందే ఈ ఫీట్లు చేసినందుకు..

కాగా..ఈవ్ టీజింగ్ నుంచి గృహ హింస వంటి తీవ్రమైన నేరాలకు పాల్పడే వారిలో సత్ప్రవర్తన కలిగించేందుకు తెలంగాణాలోని షీ టీమ్స్ విశేష కృషి చేస్తోంది. మహిళల రక్షణకు సంబంధించిన చట్టాలపై అవగాకహన కల్పించేందుకు ఎన్నో కార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేకతను చాటుకుంటోంది.

దీని ఫలితంగా గతంతో పోలిస్తే టీజింగ్ కేసులు తక్కువ నమోదు కావటం షీ టీమ్స్ చేసిన కృషికి నిదర్శనమని చెప్పాల్సిందే. షీ టీమ్స్‌పై మహిళల్లో నమ్మకంగా కలిగించడంలో రాష్ట్ర మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి కృషి అద్భుతం..అనిర్వచనీయమని చెప్పి తీరాల్సిందే…

Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *