రామమందిరం కోసం చెప్పులువేసుకోలేదు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

అయోధ్యలో రామ మందిరం కోసం ఎంతోమంది పలురకాలుగా దీక్షలు చేశారు. వారి దీక్షల ఫలితంగా ఈరోజు మందిర నిర్మానానికి శంకుస్థాపన జరిగింది.
రామమందిర నిర్మాణం కోసం దీక్షలు చేసినవారిలో హైదరాబాద్‌కు చెందిన రాంరావ్ విఠల్ రావ్ షేరీకార్ అనే వ్యక్తి కూడా ఉన్నారు. రామమందిరనిర్మాణం కల సాకారం అయ్యేదాకా పాదరక్షలు వేసుకోనని దీక్ష పూనారు. దీక్షలో భాగంగా దశబ్దాల నుంచి ఆయన చెప్పులు ధరింటంలేదు.రాం రావ్ కుటుంబం ఆయన చిన్నతనంలోనే బీదర్ నుంచి హైదరాబాద్ వచ్చి స్థిర పడింది. టీ స్టాల్ నడుపుతూ జీవనం సాగించే ఆయనకు శ్రీరాముడంటే ఎంతో భక్తి. అలాగే తుల్జాభవానీ మాత మీద అమితమైన భక్తిభావం.

అయోధ్యలో రామ మందిర నిర్మాణం పూర్తి కావాలని రాం రావ్ తుల్జాభవానీని కోరుకున్నారట. అలాగే పురానాపూల్ ప్రాంతంలో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని కూడా కోరుకున్నారు. ఈ రెండు కోరికలు నెరవేరే వరకు పాదరక్షలు ధరించనని దీయబూనారు.ఈక్రమంలో వీహెచ్‌పీ పిలుపుతో 1990లో అయోధ్యలో జరిగిన కరసేవ కార్యక్రమంలో పాల్గొన్న అతను హైదరాబాద్‌లో శివాజీ విగ్రహాన్ని ప్రతిష్టించారు. ఆ తర్వాత తుల్జా భవానీని దర్శించుకున్న రాంరావ్ శివాజీ విగ్రహ ప్రతిష్టాపన సంతోషంలో రామమందిర నిర్మాణం విషయాన్ని మర్చిపోయి పాదరక్షలు వేసుకోవటం మొదలుపెట్టారు. కొన్నాళ్లు రాంరావ్ చేతులు, పాదాల్లో పెద్ద పెద్ద పగుళ్లు వచ్చి చాలా బాధపడ్డారు. నొప్పులు భరించలేక ఎంతోమండి డాక్టర్లు కలిసాడు. ఎన్నో మందులు వాడాడు. అయినా ఫలితం లేదు.

చివరకు తుల్జాభవానీ కలలో కనిపించి..రామ మందిరం విషయాన్ని గుర్తుకు చేసిందట..దీంతో దీక్షను ఉల్లంఘించినందుకే ఇలా జరిగిందని భావించిన రాంరావ్ తన తప్పును గ్రహించి అప్పటి నుంచి పాదరక్షలు వేసుకోవటం మానేశాడు. ఆ తర్వాత కొన్నాళ్లకే ఆయన కాళ్లు, చేతులపై వచ్చిన పగుళ్లు తగ్గిపోయాయి. నొప్పులు తగ్గిపోయాయి. దీంతో ఇదంతా రాముడి మహిమేనని..రామ మందిర నిర్మాణానికి భూమిపూజ జరగడం చాలా సంతోషమని హర్షం వ్యక్తం చేశారు.

Related Posts