లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Crime Stories

చెల్లి కోసం తల్లిని ఉరి వేసి చంపేసిన అన్న..

Published

on

Hyderabad man killed his mother sake his sisiter : చెల్లెలిపై ఉన్న ప్రేమతో ఓఅన్న కన్నతల్లినే కడతేర్చాడు. తల్లి మెడకు ఆమె చీరతోనే ఉరి బిగించి చంపేసిన ఘటన హైదరాబాద్ లోని జగద్గిరిగుట్టలో సంచలనం రేపింది. డబ్బుల కోసం కన్నకూతుర్ని వ్యభిచారంలోకి దించాలనే ఆలోచిస్తున్న తల్లిని హత్య చేశాడా కొడుకు.

జగద్గిరగుట్టలో ఎల్లమ్మ బండకు చెందిన సురేష్‌ అనే యువకుడు ఆటో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. సురేష్ కు తల్లీ, తండ్రీ, ఓ చెల్లెలు ఉన్నారు. తల్లిదండ్రులు, చెల్లెలితో కలిసి సురేష్ ఓ అద్దె ఇంట్లో ఉంటున్నాడు. సురేష్‌ తల్లి మల్లమ్మ (40) చెడు సావాసాలకు అలవాటు పడింది. తండ్రి మద్యానికి బానిసగా మారాడు. కొడుకుని తరచూ డబ్బుల కోసం వేధిస్తుంటాడు.

తండ్రి అడిగిన డబ్బులిచ్చే కొడుకు తండ్రిని తిడుతుంటాడు. ఏమాత్రం బాధ్యత లేకుండా ఇంటి గురించి పట్టించుకోకుండా ఎప్పుడూ తాగుతుంటాడని విసుక్కున్నా ఏమాత్రం పట్టని ఆ తండ్రి మద్యం తాగందే ఉండలేడు. దీంతో సురేష్ తండ్రికి డబ్బులివ్వటం మానేశాడు. కొడుకు డబ్బులివ్వకపోటంతో అతను భిక్షాటన చేస్తూ వచ్చిన డబ్బులతో తాగటం మాత్రం మానటం లేదు.

మరోపక్క తల్లికి డబ్బులంటే ఆశ. దీంతో మల్లమ్మ డబ్బులు సంపాదించాలనే ఆశతో తన మైనార్టీ కూడా తీరని కూతురిని చెడు మార్గంలోకి (వ్యభిచారం) దింపాలని చూసింది. ఇది గమనించిన సురేష్ చాలాసార్లు తల్లిని మందలించాడు. నువ్వసలు తల్లివేనా కూతురితో పాడు పనులు చేయించాలనుకుంటున్నావ్..అని తిట్టాడు. కానీ తల్లి తీరు మార్చుకోలేదు. చెడు పనులు చేయించటానికి సిద్ధపడింది.

దీంతో సురేష్ కు ఆగ్రహం కలిగింది. తల్లితో గొడవపడ్డాడు. ఆదివారం (డిసెంబర్ 27,2020)తల్లీకొడుకుల మధ్య గొడవ పెద్దదైంది. సురేష్‌ ఆగ్రహంతో మల్లమ్మ గొంతుకు చీరతో ఉరి బిగించి హత్య చేశాడు.అనంతరం పోలీసులకు లొంగిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సురేష్ చెల్లెలిని విచారిస్తున్నారు.