లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

Andhrapradesh

మొగుడ్ని చంపేయ్… మావయ్యను పెళ్ళి చేసుకో….తల్లి వేధింపులతో కూతురు ఆత్మహత్య

Published

on

కూతురు కాపురం చక్కగా ఉండాలని కోరుకునే తల్లి, ఆ కుటుంబాన్ని బుగ్గిపాలు చేసింది. తమ్ముడి జీవితం కోసం కూతురు జీవితాన్ని నాశనం చేసింది. భర్తను హత్య చేయమని తల్లి చెప్పినా మనసు రాక…. కూతురు ఆత్మహత్య చేసుకుంది.

ఏపీలోని కృష్ణాజిల్లా నందలూరు గ్రామానికి చెందిన కతి రాములమ్మ(45) తన కుమార్తె గాయత్రిని రెండేళ్ల క్రితం అదే ప్రాంతానిక చెందిన సైదారావు అనే వ్యక్తికి ఇచ్చి విహాహం జరిపించింది. నిజానికి రాములమ్మకు ఆ పెళ్ళి చేయటం ఇష్టంలేదు. గాయత్రిని తన చిన్న తమ్ముడికి ఇచ్చి చేయాలని ఉండేది. కుటుంబ పరిస్ధితుల మూలంగా ఆ వివాహం చేయాల్సి వచ్చింది.ఏడాది క్రితం రాములమ్మ , గాయత్రి, సైదారావులు హైదారాబాద్ వచ్చి నేరేడ్ మెట్ లోని కాకతీయ నగర్ లో అద్దెకు దిగారు. సైదారావు కారు డ్రైవర్ గా చేరాడు. గాయత్రి ఇంటి పనులు చేస్తూ ఉండేది. రాములమ్మ సాయినాధపురంలో ఉండే పెద్ద తమ్ముడు సొడిపాగ పుల్లారావు(29) దగ్గరకు వచ్చి ఉంటోంది. పుల్లారావును అతడి భార్య ఏడాది క్రితం వదిలేసి వెళ్లిపోయింది.

గర్ల్ ఫ్రెండ్ ఫోన్ ఎత్తడం లేదని, ఆత్మహత్యాయత్నం చేసిన ఆటోడ్రైవర్


దీంతో రాములమ్మ గాయత్రిని పుల్లారావు కి ఇచ్చి పెళ్లి చేయాలని, మళ్లీ మరోసారి భావించింది. అనుకున్నదే తడువుగా తమ్ముడిని కుమార్తెతో చనువుగా ఉండమని చెప్పింది. అక్క చెప్పినట్లు పుల్లారావు గాయత్రి ఇంటికి తరచూ వస్తు ఉండేవాడు. ఈ లోగా తల్లి తన మనసులో మాట కూతురికి చెప్పింది. అల్లుడిని అడ్డు తొలగించుకుంటే కూతురుకు మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశ చూపింది.ఆరు నెలల క్రితం అందరూ స్వగ్రామం కృష్ణా జిల్లా వెళ్ళారు. అక్కడ తల్లి , మేనమావ, కలిసి గాయత్రికి పురుగుల మందు ఇచ్చి సైదారావును చంపమని ప్రోత్సహించారు. సైదారావు గాయత్రిని మంచిగా చూసుకునే వాడు. పెళ్లైన నాటినుంచి గాయత్రి సైదారావులది అన్యోన్య దాంపత్యమే. సైదారావు అంటే కూడా గాయత్రికి చాలా ఇష్టం. తల్లి, మేనమామ ఎంత ఒత్తిడి చేసినా గాయత్రి సైదారావును చంపటానికి ఇష్టపడలేదు.

అందరూ కల్సి తిరిగి హైదరాబాద్ నేరేడ్ మెట్ వచ్చారు. అప్పటి నుంచి మళ్లీ… భర్తను చంపమని తల్లి తిరిగి గాయత్రిని వేధించసాగింది. తల్లి వేధింపులు భరించలేన గాయత్రి మనోవేదనకు గురైంది. సెప్టెంబర్11, శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేన సమయం చూసి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు తల్లి, మేనమావ కారణమని…తన భర్త చాలా మంచోడని చెప్పి సూసైడ్ నోట్ రాసింది. ఈ లేఖ ఆధారంగా నేరేడ్ మెట్ పోలీసులు ఆదివారం రాములమ్మను, పుల్లారావును అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.Continue Reading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *