గ్రేటర్ మునిగిన వేళ, గర్భీణి కోసం మెట్రో రైలు పరుగు

Share on facebook
Share on twitter
Share on telegram
Share on whatsapp

Hyderabad Metro : అవును మీరు వింటున్నది నిజమే. ఒక్కరి కోసం మెట్రో రైలు పరుగులు తీసింది. ఇది ఎక్కడో జరిగింది కాదు. హైదరాబాద్ లో. సర్వీసు సమయం ముగిసినా..గర్భిణీ కోసం ప్రత్యేకంగా రైలును నడిపి ఆ ఒక్కరిని భద్రంగా గమ్యానికి చేర్చారు మెట్రో సిబ్బంది. ఈ విషయాన్ని స్వయంగా హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి వెల్లడించారు.హైదరాబాద్ లో భారీ వర్షాలు కురుస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అత్యవసర సమయంలో నగర వాసులను ఆదుకుంటామనే భరోసా కల్పించింది. 2020, అక్టోబర్ 14వ తేదీ రాత్రి నగర వ్యాప్తంగా కుండపోతగా వర్షం కురుస్తోంది. ఈ సమయంలో ఎల్బీనగర్ – మియాపూర్ మార్గంలో విక్టోరియా మెమోరియల్ స్టేషన్ కు రాత్రి 10 గంటల సమయంలో ఓ గర్భిణీ చేరుకుంది.ఎలాగైనా మియాపూర్ మెట్రో స్టేషన్ కు చేర్చాలని అక్కడున్న సిబ్బందిని వేడుకుంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియచేశారు. గర్భిణీ మానవత్వంతో స్పందించిన మెట్రో సిబ్బంది..ఉన్నతాధికారుల అనుమతితో ఒక్క మహిళ కోసమే మెట్రో రైలును నడిపారు.రాత్రి 10 గంటలకు బయలుదేరిన రైలు… 10:40 గంటలకు మియాపూర్‌కు గర్భిణిని సురక్షితంగా చేర్చారు. అత్యవసర సమయాల్లో పౌరులను కాపాడేందుకు మెట్రో రైళ్లను నడపాలన్న నిబంధన ఉందని మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు.

Related Posts