Home » బాబోయ్ : హైదరాబాదులో ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న 100మందికి పైగా నకిలీ డాక్టర్లు..
Published
2 months agoon
Hyderabad More than 100 people fake doctors ; హైదరాబాదు నగరం వైద్యానికి పేరొందింది. ఎన్నో రోగాలకు ఇక్కడ చక్కటి వైద్యం లభిస్తుందనే ఆశతో తెలుగు రాష్ట్రాల ప్రజలు హైదరాబాద్ లోని హాస్పిటల్స్ కు వస్తుంటారు. కానీ హైదరాబాద్ లో ఎన్ని హాస్పిటల్స్ సేఫ్టీ? ఎంతమంది డాక్టర్లు సరైన వైద్యం చేస్తున్నారు? అంటే కాస్త ఆలోచించాల్సిందేనంటున్నారు పోలీసులు.
ఎందుకంటే హైదరాబాద్ నగరంలో ఇటీవల పోలీసులు నకిలీ డాక్టర్లపై నిఘా పెట్టారు. నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లతో పలువురు డాక్టర్లు వైద్యం చేస్తున్నారని గుర్తించారు. అలా 10,20మందికాకుండా ఏకంగా 100మందికి పైగా నకిలీ డాక్టర్లను గుర్తించారు.
నకిలీ డాక్టర్లు చిన్న చిన్న క్లినిక్ లతో పాటు హాస్పిటల్స్ ను ఏర్పాటు చేసుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని పోలీసులు తమ తనిఖీల్లో వెల్లడించారు. ఇతర రాష్ట్రాల నుంచి నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు కొనుగోలు చేసి హైదరాబాద్ లో డాక్టర్లుగా చెలామణి అవుతున్నాని పోలీసులు.. వైద్య శాఖ అధికారులు గుర్తించారు.
ఇలాంటి ఫేక్ సర్టిఫికెట్ పొందిన వైఎస్ తేజ అనే నకిలీ డాక్టర్ పోలీసులను కూడా ఏమార్చాడు. లాక్ డౌన్ సమయంలో పోలీసులకు కరోనా సలహాదారుగా వ్యవహరించాడని తెలిసిన పోలీసులు షాక్ అయ్యారు.
ఢిల్లీకి చెందిన సునీల్ అనే ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ ద్వారా తేజ, షాబాద్ కు చెందిన రాంరెడ్డి అనే వ్యక్తి నకిలీ డాక్టర్ సర్టిఫికెట్లు పొందారని పోలీసులు తెలిపారు. వీరికి చత్తీస్ గఢ్ యూనివర్సిటీ తరఫున ఎంబీబీఎస్ సర్టిఫికెట్లు కొన్నట్లుగా తెలిపారు.
ఈ నకిలీ డాక్టర్ల గురించి మేడిపల్లి పోలీస్ ఇన్ స్పెక్టర్ బి.అంజిరెడ్డి మాట్లాడుతూ..రూ.40 వేలు ఇస్తే నకిలీ ఎంబీబీఎస్ సర్టిఫికెట్ ఫొటోకాపీ ఇస్తామని..అదే మరో రూ.2 లక్షలు ఇస్తే.. అసలైన నకిలీ సర్టిఫికెట్ ను పంపించే విధంగా తేజ ఆ ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాడని తెలిపారు.
పోలీసులు ఢిల్లీలో ఉన్న ఎడ్యుకేషనల్ కన్సల్టెంట్ సునీల్ ను అరెస్ట్ చేయడంతో అనేకమందికి నకిలీ ఎంబీబీఎస్ పట్టాలు విక్రయించిన విషయం వెలుగులోకి వచ్చింది. దీనిపై ఆరోగ్య శాఖ అధికారులు విచారణకు ఆదేశించగా..ఇటువంటి నలికీ ఎంబీబీఎస్ లు 100 మంది వరకు ఉన్నట్టు తేలింది. ఈ విషయం వెలుగులోకి రావటంతో నగరవాసులతో పాటు వైద్యం కోసం హైదరాబాద్ వస్తున్న రోగులు..వారి తరపు బంధువుల కూడా భయాందోళనలకు గురవుతున్నారు.
స్కూల్ కెళ్లి చదువుకోమన్నారని బాలుడు ఆత్మహత్య
శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర
ఉల్లిగడ్డల చోరీకి వచ్చాడనే అనుమానంతో వ్యక్తిని కొట్టి చంపిన రైతులు, కర్నూలు జిల్లాలో విషాదం
విద్యార్థినులకు నీలిచిత్రాలు చూపించిన టీచర్, క్లాస్‌రూమ్‌లో గలీజు పని
హైదరాబాద్ ఘట్కేసర్లో యువతుల దందా, స్వచ్చంద సంస్థ పేరుతో వసూళ్లు
రియల్ ఎస్టేట్ వ్యాపారితో వెళ్ళిపోయిన ఇంటర్ చదివే బాలిక